Bigg Boss Telugu 7: ఫినాలే అస్త్రతో సీరియల్ బ్యాచ్‌లో చిచ్చు.. అమర్‌దీప్‌ను చావు దెబ్బ కొట్టిన ప్రియాంక
బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులకు బాగానే ఎంటర్ టైన్ ఇస్తున్నాడు. ఇక గత 13 వారాలుగా ప్రేక్షకులను తనదైన శైలిలో అలరిస్తూ.. దానికి తోడు ఉల్టా పుల్టా పేరుతో షాకులు, ట్విస్టులు కూడా ఇస్తున్నాడు. ఇక తాజాగా బిగ్ బాస్ షోలో టికెట్ టు ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. ఇక ఇందులో అమర్ దీప్ టాప్ లో ఉండగా.. ఇప్పటికే శోభా శెట్టి, శివాజీ ఔట్ అయ్యారు. ఇక తాజాగా ప్రియాంక కూడా ఔట్ అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రియాంక.. చేసిన పనికి సీరియల్ బ్యాచ్ లో చిచ్చు ఏర్పడింది. అమర్ దీప్ ను చావు దెబ్బ కొట్టింది ప్రియాంక. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ప్రస్తుతం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎవరు టికెట్ టు ఫినాలే గెలుచుకోనున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇక పోటా పోటీగా టాస్కుల్లో పాల్గొంటున్నారు కంటెస్టెంట్స్. ఇప్పటి వరకు గ్రూప్ గేమ్స్ ఆడుతూ వచ్చిన కంటెస్టెంట్స్.. ఇప్పుడు సింగిల్ గేమ్స్ లో పాల్గొంటూ వారి టాలెంట్ బయటకు తీస్తున్నారు. ఇక ఈ టాస్కుల నుంచి ఇప్పటికే శివాజీ, శోభా శెట్టి ఔట్ అయ్యారు.

ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చూస్తే ప్రియాంక కూడా ఔట్ అయినట్లు తెలుస్తోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో అమర్ దీప్.. ప్రియాంక మధ్య వార్ చూసిన వాళ్లు పాపం ప్రియాంక అని అంటారు. ఎందుకంటే.. టాస్కులో భాగంగా ప్రియాంకతో అమర్ దీప్ ఆటలో గెలవాలని ఆడపిల్ల అని చూసుకోకుండా ఫిజికల్ ఎటాక్ చేశాడు. దీంతో ప్రియాంకకు సింపతీ ఏర్పడింది.
ఇక అమర్ దీప్ ఒక్క టాస్కులో గెలవకపోయినా.. టాప్ లో ఉన్నాడు. కారణం.. ఇప్పటికే అతనికి శోభా శెట్టి, శివాజీ పాయింట్స్ యాడ్ అయ్యాయి. వారు ఔట్ అవ్వగా.. బిగ్ బాస్ వారి పాయింట్స్ ఎవరికో ఒకరికి ఇవ్వాలి అన్నాడు. దీంతో అమర్ దీప్ కు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం అమర్ దీప్ టాప్ లో ఉన్నాడు. అయితే సీరియల్ బ్యాచ్ లో బిగ్ బాస్ ఫినాలే అస్త్రతో మరోసారి చిచ్చు పెట్టాడు. అసలే వీరి బ్యాచ్ ముక్కలు అయ్యే సిచ్యూవేషన్ లో ఉంటే.. బిగ్ బాస్ ఆజ్యం పోశాడు.
తాజా టాస్కులో ఆమెకు తక్కువ పాయింట్లు రావడంతో ప్రియాంక కూడా ఔట్ అయింది. ఇక ఆమె తన పాయింట్స్ లోని సగాన్ని వేరే కంటెస్టెంట్ కు ఇచ్చుకోవచ్చని బిగ్ బాస్ చెప్పాడు. ఇక అమర్ దీప్ నిన్నటి ఎపిసోడ్ లో తనతో ప్రవర్తించిన తీరు గుర్తుకు వచ్చిందో ఏమో.. అమర్ ను చావు దెబ్బ కొట్టింది ప్రియాంక. అయితే ప్రియాంక.. తన సీరియల్ బ్యాచ్ దొస్తును కాదని... వేరే కంటెస్టెంట్ గౌతమ్ కు పాయింట్స్ ఇచ్చింది.
దీంతో అమర్ దీప్ కు ఇచ్చి ఉంటే.. చాలా పాయింట్స్ వచ్చి.. డైరెక్ట్ టికెట్ టు ఫినాలే వచ్చే ఛాన్స్ వచ్చేది కానీ.. ప్రియాంక చావు దెబ్బకు అమర్ మళ్లీ పోరాటం చేయాల్సి వస్తుంది. ఇక గౌతమ్ కి ఇవ్వడంతో గౌతమ్ కూడా ఈ టికెట్ టు ఫినాలే గెలుచుకునే ఛాన్స్ వచ్చేసింది. మొత్తం ఆరు టాస్క్‌లు కంప్లీట్ అయ్యేసరికి.. శివాజీ, శోభా, ప్రియాంకలు ఔట్ అయ్యారు . అమర్ దీప్, అర్జున్, గౌతమ్, ప్రశాంత్, యావర్‌లు రేస్‌లో ఉండగా.. వీరిలో అమర్ దీప్ కే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. టట
తాజా అప్డేట్ ప్రకారం అమర్ దీప్ 450 పాయింట్లు, అర్జున్ 360 పాయింట్లు, యావర్ 320 పాయింట్లు, ప్రశాంత్ 320 పాయింట్లు, గౌతమ్ 250 పాయింట్లు వచ్చాయి. ఇక ప్రియాంకకు 180 పాయింట్లు ఉండగా.. గౌతమ్ కు ఇవ్వగా.. గౌతమ్ 430 పాయింట్స్ కు చేరుకుంటాడు. ఇక ఈసారి విన్నర్ ఎవరు అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











