Bigg Boss Telugu 7: అశ్విని శ్రీకి అమ్మాయిలతోనే ప్రాబ్లమా.. ఏందిరా అయ్యా ఈ లొల్లి!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతోంది. ఉల్టా పుల్టా పేరుతో ఏ సీజన్ లో లేని వింతలన్నీ చేస్తూ... ప్రేక్షకుల్లో తెగ ఆసక్తి కల్గజేస్తున్నారు. అద్భుతమైన టాస్కులు, అంతకు మించిన ఎమోషన్స్ తో షోను రక్తి కట్టిస్తున్నారు. అలాగే ఇంట్లో ఉండే కంటెస్టెంట్లు చేసే రచ్చ అయితే మామూలుగా ఉండట్లేదు. ప్రతిరోజూ వచ్చే షోకంటే శనివారం నాగార్జున పీకే క్లాసులు, ఆదివారం ఎలిమినేషన్, సోమవారం రోజు జరిగే నామినేషన్లను ప్రతీ ఒక్కరూ ఫాలో అవుతుంటారు. ఈ మూడు రోజుల్లో బిగ్ బాస్ షోను వీక్షించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.
అయితే నిన్నటి ఎపిసోడ్ లో పూజా మూర్తి ఇంట్లోంచి ఎలిమినేట్ అయిపోవడం.. రతిక రీఎంట్రీ ఇవ్వడం చూశాం. ఇక ఈరోజు నామినేషన్ల ప్రక్రియ చాలా హాట్ హాట్ గా సాగుతోంది. ప్రతీ ఒక్క కంటెస్టెంటు.. నామినేట్ చేసిన వారితో విపరీతమైన మాటల యుద్ధానికి దిగుతున్నారు. అలాగే ఇష్టం వచ్చినట్లుగా ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. తాజాగా ప్రియాంక జైన్... అందరూ అనుకున్నట్లుగానే అశ్విని శ్రీని నామినేట్ చేసింది. ఈక్రమంలోనే చాలా గట్టిగా అరుస్తూ.. అందరూ షాకయ్యే కొన్ని కామెంట్లు చేసింది. ముఖ్యంగా నీకు అమ్మాయిలతోనే ప్రాబ్లం అంటూ చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఇదంతా చూస్తుంటే ఆమె అమ్మాయిలతో స్నేహం చేయట్లేదని.. ముఖ్యంగా శోభా శెట్టి, ప్రియాంక జైన్ లతో అస్సలే సరిగ్గా మాట్లాడట్లేదని అర్థం అవుతోంది. అలాగే అశ్విని శ్రీ ఎక్కువగా భోలే షవాళితో క్లోజ్ గా ఉన్నట్లు నిన్నటి ఎపిసోడ్ చూస్తుంటే మరింత అర్థం అవుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో భోలె సేవ్ అయి, పూజా ఎలిమినేట్ అయి బయటకు వచ్చాకా... అశ్విని శ్రీ అన్న సేవ్ అయ్యాడంటూ డ్యాన్స్ చేసింది. కిచెన్ లో భోలె షవాళి, అశ్వినిశ్రీలు ఇద్దనే ఉన్నప్పుడు.. భోలె అన్న సేవ్ అయ్యాడంటూ ఆమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
అశ్విని శ్రీ వారితో పాటు శివాజీ, పల్లవి ప్రశాంత్ లతో కూడా బాగానే ఉంటోంది. కాకపోతే అమ్మాయిల అందరితో నీకు ప్రాబ్లం వస్తుందంటూ ప్రియాంక చేసిన కామెంట్లు చర్చకు దారి తీస్తున్నాయి. ఈరోజు వచ్చిన ప్రోమోలో ఇదంతా ఉండగా.. నెట్టింట తెగ వైరల్ గా మారింది. అమ్మాయిలతో మాత్రమే ప్రాబ్లం ఉంటుందా.. మరి అబ్బాయిలతో అశ్విని బాగానే ఉంటోందా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అశ్విని, భోలె షవాళి మధ్య జరుగుతున్న చర్చలపై ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఈక్రమంలోనే అశ్వినిపై... ప్రియాంక జైన్ ఇలాంటి కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది.

అయితే ప్రియాంక చేసిన కామెంట్లపై అశ్వినిశ్రీ స్పందించింది. అమ్మాయిల అందరికీ నాతో ప్రాబ్లం ఉన్నట్లు నాకే తెలియదని చెప్పగా... ఇదే నిజమైన సమస్య అంటూ ప్రియాంక చెప్పింది. ఈరోజు ఎపిసోడ్ చూస్తే తప్ప ఏం జరిగిందో అర్థం కాదు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











