ఆ భయంతోనే సీరియల్స్ మానేశా.. బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన

తెలుగు బుల్లితెరపై తనదైన గుర్తింపును సంపాదించుకున్న నటి ప్రియాంక జైన్ (Priyanka Jain). మౌనరాగం, జానకి కలగనలేదు వంటి హిట్ సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ భామ, తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకుంది. సహజ నటన, ప్రతిభ ఆమెను ఇతర నటీమణుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. అనంతరం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొని ఫైనల్ వరకు చేరడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. బిగ్ బాస్ తర్వాత సీరియల్స్‌కు దూరమైన ఈ అమ్మడు ఈవెంట్స్, టీవీ షోలు, ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతోంది. అయితే.. ఆ భయంతోనే సీరియల్స్ మానేశానని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ప్రియాంక జైన్.. ముంబైకు చెందిన ఈ అమ్మడు తన కెరీర్‌ను మోడలింగ్‌తో ప్రారంభించింది. మొదట్లో హైట్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, తనపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగింది. 2015లో తమిళ చిత్రం 'రంగి తరంగ'తో సినీ రంగంలో అడుగుపెట్టి, తరువాత కన్నడ, తెలుగు చిత్రాల్లో నటిస్తూ అవకాశాలు అందుకుంది. అయితే అసలు గుర్తింపు మాత్రం టెలివిజన్ ద్వారానే వచ్చింది. 2017లో ప్రసారమైన 'మౌనరాగం' సీరియల్ ఆమె కెరీర్‌కు మలుపు తిప్పింది. తరువాత వచ్చిన 'జానకి కలగనలేదు' సీరియల్‌తో ఆమె ఇంటింటికి పరిచయమైంది. తెలుగు ప్రేక్షకుల దగ్గరైంది.

Priyanka Jain Throwback Interview Why Bigg Boss 7 Star Quit TV Serials

సీరియల్స్‌తో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా ప్రియాంక తన ప్రతిభను చాటుకుంది. యు గాట్ మీ గర్ల్, సితార, సోచ్ వంటి వెబ్ సిరీస్ ల్లో నటించి మెప్పించింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ ప్రయాణమే ఆమెను బిగ్ బాస్ హౌస్ వరకు తీసుకెళ్లింది. బిగ్ బాస్ షోలో ఆమె గేమ్, పర్సనాలిటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే బిగ్ బాస్ తర్వాత ఆమె సీరియల్స్‌కు దూరంగా ఉండటం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రియాంక క్లారిటీ ఇచ్చింది.

ప్రియాంక జైన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సీరియల్స్ చేస్తే ఒకే రకమైన పాత్రల్లో చిక్కుకుపోతామనే భయం కలిగింది. టైప్‌కాస్ట్ అయిపోతాననే ఆలోచనతోనే ఆ నిర్ణయం తీసుకున్నాను' అని స్పష్టం చేసింది. అలాగే సీరియల్స్ వల్ల తన పేరు, గుర్తింపు వచ్చిందని, ఆ ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని భావోద్వేగంగా చెప్పింది. ప్రస్తుతం ఓటీటీ ప్రాజెక్ట్‌లకు క్రేజ్ పెరిగిందని చెప్పుకొచ్చింది. అలాగే..తాను నటించిన నయనం వెబ్ సిరీస్ కూడా మంచి స్పందన పొందుతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో ప్రదర్శించిన ఈ సిరీస్‌లో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. విభిన్న కథలు, కొత్త తరహా పాత్రలు చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను ఈ మార్గాన్ని ఎంచుకోవాలని ఆమె కోరింది.

సీరియల్స్, సినిమాల మధ్య తేడా గురించి కూడా ప్రియాంక ఆసక్తికరంగా స్పందించింది. "ఏ మీడియా అయినా నటన ఒకటే. పాత్రకు న్యాయం చేయడం నా లక్ష్యం. సీరియల్స్ చేస్తున్నప్పుడు కూడా పూర్తి ప్రిపరేషన్‌తో వెళ్లి, ఒక్క టేక్‌లోనే షాట్ పూర్తి చేయడానికి ప్రయత్నించేదాన్ని" అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇక ప్రియాంక జైన్ వ్యక్తిగత విషయానికి వస్తే.. సీరియల్ నటుడు శివకుమార్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నారని, ఇద్దరూ లివ్-ఇన్‌లో ఉన్నారని టాక్ నడుస్తోంది. త్వరలో పెళ్లి తాము పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించారు. ప్రస్తుతం మ్యాడ్ ఫర్ ఇచ్ ఆదర్స్ అనే రియలిటీ షో పాల్గొంటున్నారు వీరు. ఈ షోలో ఈ జంటకు మంచి క్రేజ్ , ఫాలోయింగ్ కూడా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X