గోవా రోడ్లపై విషాదంలో ప్రియాంక జైన్.. ప్రియుడు చేసిన పనే కారణం!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 క్యూట్ బ్యూటీ ప్రియాంక జైన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా సీరియల్స్ లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ అలా వచ్చిన ఫేమ్ తోనే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది. అద్భుతమైన ఆట తీరుతో అందరినీ మెప్పించిన ఈమె.. తాజాగా గోవా వెళ్లింది. కానీ అక్కడకు వెళ్లాకా జరిగిన ఓ సంఘటనతో తీవ్రంగా భయపడిపోయిన ప్రియాంక జైన్.. రోడ్లపై ఒంటరిగా తిరుగుతూ ఫుల్ గా ఏడ్చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది, ప్రియాంక ఎందుకు ఏడ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మౌనరాగం సీరియల్ తో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మరింత ఫేమ్ సంపాధించుకుంది. ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి ప్రియుడితో కలిసి రచ్చ చేస్తోంది. ఎక్కడకు వెళ్లినా వీరిద్దరూ కలిసే వెళ్లి వస్తున్నారు. పెళ్లి కాకముందే ఒకే ఇంట్లో ఉంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ జంట మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గోవా వెళ్లారు.

అయితే అక్కడే ప్రియాంక జైన్.. రాత్రి కాస్త రాష్ గా మాట్లాడింది మిగితా వాళ్లతో. దీంతో వాళ్లంతా కలిసి ప్రియాంక జైన్ ను వదిలిపెట్టి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఓ లెటర్ రాసి పెట్టి మరీ నీ ప్రవర్తన మాకు నచ్చలేదు.. అందుకే వెళ్లిపోతున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే నిద్రలోంచి లేచి వచ్చిన ప్రియాంక.. స్నేహితులు కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికింది. అయినప్పటికీ వారు కనిపించలేదు. దీంతో ఫోన్ చేసేందుకు వెళ్లగా.. అక్కడే తనకు లెటర్ కనిపించింది.
అందులో రాత్రి నువ్వు చేసిన పని మాకు నచ్చలేదు.. అందుకే వెళ్లిపోతున్నాం బై అంటూ రాయగా.. అది చూసిన ప్రియాంక జైన్ విపరీతంగా ఏడ్చేసింది. ఏం చేయాలో తెలియక.. హోటల్ బయటకు వచ్చి మరీ పరుగులు పెట్టింది. అన్ని చోట్లా వెతికినా వారి జాడ దొరక్కపోవడంతో ఫోన్ చేస్తూనే ఉంది. అయినా వారి ఫోన్ కలవలేదు. దీంతో మళ్లీ హోటల్ లోని తన రూమ్ కు వచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఇంతలోనే తన ప్రియుడు సహా మిగతా ఇద్దరు స్నేహితులు రూంకు వచ్చారు.

అయితే వాస్తవానికి ప్రియాంక జైన్ వారితో రాష్ గా బిహేవ్ చేయలేదు. వారినీ ఏమీ అనలేదు. కానీ ప్రియాంక జైన్ ప్రియుడు శివ్ కుమార్ యే... లవర్ పై ప్రాంక్ చేయాలని ఇలా ప్లాన్ చేశాడు. ముందుగానే గదిలో కామెరా ఫిక్స్ చేసిన ఈయన ఇంత నాటకం ఆడాడు. ఇదంతా తెలియని ప్రియాంక జైన్ రోడ్లపై ఒంటరిగా తిరుగుతూ ఏడుస్తూ... వారికోసం వెతుకులాడింది. అయితే చివరకు రూంకు వచ్చిన వాళ్లు ప్రియాంక జైన్ కు అసలు విషయం చెప్పారు. ప్రాంక్ చేసినట్లు వివరించారు.
వాళ్లు ఎంత చెప్పినా ప్రియాంక జైన్ మాత్రం ఏడుస్తూనే ఉంది. అలా ఒంటరిగా తనను ఉంచడం ఏంటంటూ బాధపడింది. కానీ ఆ తర్వాత ప్రియుడు శివ్ కుమార్ దగ్గరకు తీసుకుని సారీ చెప్పాడు. చిన్న పిల్లను ఊరుకోబెట్టినట్లు ఊరుకోబెట్టాడు. దీంతో ప్రియాంక జైన్ కాస్త శాంతించింది. ఆ తర్వాత వీరంతా కలిసి పార్టీకి వెళ్లారు.


Click it and Unblock the Notifications











