పెళ్లి పీటలెక్కబోతున్న ‘వదినమ్మ’ ప్రియాంక నాయుడు.. కాబోయే భర్త ఎవరంటే..
తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన నటనతో ఆకట్టుకొంటున్న ప్రియాంక నాయుడు త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నారు. వదినమ్మ, అనగనగా ఒక దుర్గ లాంటి సీరియల్స్‌లో తెలుగు వారింటిలో ఓ సభ్యురాలిగా మారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో తన అభిమానులతో ముచ్చటిస్తూ.. తన కాబోయే భర్త, ఆయన ఎలాంటి వారనే విషయాలను పూసగుచ్చినట్టు చెప్పారు. ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరంటే..

ఇన్స్‌టాగ్రామ్ చాటింగ్‌లో
తన ఇన్స్‌టాగ్రామ్ లైవ్ చాటింగ్‌కు తన అభిమానులకు ఓ ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ప్రకారం తనకు కాబోయే భర్త ఫోటోను రివీల్ చేయాలనే కండిషన్‌తో చాట్‌ను ప్రారంభించారు. ఈ చాట్ సందర్భంగా పలువురు తనకు కాబోయే భర్త ఫోటోను చూపించమని అడిగితే గతంలో వారిద్దరు దిగిన ఫోటోనే షేర్ చేశారు.

యాక్టర్ మధుతో ప్రేమలో
ప్రియాంక నాయుడు పెళ్లి చేసుకొనే వ్యక్తి టెలివిజన్ నటుడు మధు. తనకు సమీప బంధువైన మధుతో కొంతకాలం ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వారిద్దరి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇరు కుటుంబాలను ఒప్పుకోవడంతో వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడింది.

నిరీక్షణే నిజమైన ప్రేమకు చిహ్నం
తనకు కాబోయే భర్త మధు గురించి ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో ప్రియాంక నాయుడు వెల్లడించారు. నిరీక్షణ అనేది నిజమైన ప్రేమకు, ఓర్పుకు ఓ సాక్ష్యం. అందరూ ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసుకొంటారు. కానీ కొందరు మాత్రమే ఆ కలను నిజం చేసుకొంటారు అని ప్రియాంక నాయుడు తన పోస్టులో వెల్లడించారు.

చీటింగ్ చేయరు.. మహిళలంటే గౌరవం
లైవ్ చాటింగ్ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నకు చాలా ఓపిగా సమాధానాలు ఇచ్చారు. మధు చాలా సపోర్టివ్. నాతో మంచి అవగాహన ఉంది. ప్రేమించే మనస్తత్వం కలవారు. చాలా సమయస్పూర్తి కలిగిన తెలివైన వ్యక్తి. ఆయనతో మాట్లాడుతుంటే సమయమే తెలియదు. ముఖ్యంగా చీటింగ్ చేసే మనస్తత్వం లేదు. మహిళలను తన జిత్తులతో మోసం చేయరు అంటూ మధుపై ప్రియాంక నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు.

స్వాతి చినుకులతో ఫేమస్‌గా
ప్రియాంక నాయుడు కెరీర్ విషయానికి వస్తే.. స్వాతి చినుకులు అనే పాపులర్ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. వైషు పాత్రలో ఆమె ఒదిగిపోవడంతో చాలా మంది బుల్లితెర ప్రేక్షకులు అభిమానులుగా మారిపోయారు. వదినమ్మ, అనగనగా ఒక దుర్గ సీరియల్స్ మంచి పేరు తెచ్చిపెట్టాయి.

వదినమ్మతో భారీ ప్రేక్షకాదరణ
ఇక లాక్‌డౌన్ సందర్భంగా వదినమ్మ టీమ్ చేసిన ఓ వీడియోలో ప్రియాంక నాయుడు చివరిసారిగా కనిపించారు. వదినమ్మ సీరియల్ విషయానికి వస్తే తెలుగు బుల్లితెర మీద టాప్ 5 స్థానాల్లో ఉండేది. అలాంటి సీరియల్‌లో ప్రియాంక నాయుడు కీలకంగా వ్యవహరించడమే కాకుండా ఆమె తన ప్రతిభతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకొన్నారు.


Click it and Unblock the Notifications











