‘తమిళనాడు నన్ను గుండెల్లో పెట్టుకుంది... ఆ తప్పుతో జీవితం నాశనం’

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశం ఉండటం లేదని బహిరంగంగా వినిపించే మాట. అందం, అభినయం ఉన్నప్పటికీ టాలీవుడ్ తమను పట్టించుకోవడం లేదని పలువురు తెలుగు అమ్మాయిలు ఆరోపిస్తుంటారు. అంజలి, శ్రీదివ్య, ఐశ్వర్య రాజేష్, ఆనంది వంటి ముద్దుగుమ్మలు తమిళ చిత్ర పరిశ్రమలో సత్తా చాటి స్టార్ హీరోయిన్‌లుగా వెలుగొందుతున్నారు. వెండితెరే కాదు.. తెలుగు బుల్లితెరపైనా అదే పరిస్ధితులు నెలకొన్నాయని ఓ నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

సదరు నటి ఎవరో కాదు ప్రియాంక నల్కారి. అప్పుడెప్పుడో 2010లోనే అందరి బంధువయా సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక. ఆ తర్వాత కిక్ 2, కాంచన 3, శివ మనసులో శృతి, హైపర్, నేను రాజు నేనే మంత్రి, వైఫ్ ఆఫ్ రామ్ వంటి సినిమాలలో నటించింది. వెండితెరతో పాటు బుల్లితెరపైనా సత్తా చాటింది ప్రియాంక. ఈటీవీలో ప్రసారమైన మేఘమాల సీరియల్‌లో నటించింది. ఆ వెంటనే ఆహ్వానం, మంగమ్మగారి మనవరాలు, శ్రావణ సమీరాలు, లక్ష్మీ రావే మా ఇంటికి తదితర తెలుగు సీరియల్స్‌లో నటించింది.

Priyanka Nalkari Opens Up About Career Struggles Telugu Industry Opportunities and Personal Life

దానితో పాటు పలు షోలకు యాంకర్‌గానూ మెరిసింది. అయితే తెలుగులో అంతగా అవకాశాలు దక్కకపోవడంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది ప్రియాంక. ఈ క్రమంలోనే ఆమెకు రోజా అనే సీరియల్‌లో టైటిల్ రోల్ పోషించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సీరియల్ తమిళ బుల్లితెరపై సంచలనం సృష్టించడంతో పాటు తమిళ మహిళల ఆదరణను దక్కించుకుంది. ఈ ధారావాహిక హిట్ కావడంతో తమిళంలో సీతారామన్, నల దమయంతి, రోజా 2, మారీ, ఇదయమ్ సీరియల్స్‌లో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే తెలుగులో మాత్రం ఆమెను పట్టించుకునేవారే కరువయ్యారు. తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా టెలికాస్ట్ అవుతున్న కిస్సిక్ టాక్ షోకు గెస్ట్‌గా వచ్చిన ప్రియాంక తన కెరీర్, జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

నేను ఎక్కడా దాక్కోలేదు.. ఇక్కడే ఉన్నాను కానీ ఎవరూ నన్ను కనిపెట్టలేదు. రోజా అనే సీరియల్‌లో టైటిల్ రోల్ పోషించా.. అందరి మనసుల్లో నేను రోజాగా ఉండిపోయా, అది ఎలాగంటే తమిళనాడుకు ఒక అక్కని అయిపోయా. నేను కోరుకున్న అవార్డ్‌లన్నీ కూడా నాకు ఆ ప్రాజెక్ట్‌లోనే వచ్చాయి. అప్పట్లో నా మీద నమ్మకం లేక నాకు మనవాళ్లు ప్రాజెక్ట్ ఇవ్వలేదేమో, అది కూడా నేను తప్పుబట్టలేను. కానీ ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకుని వచ్చాను. ఇప్పుడు కూడా ఇవ్వలేదంటే ఏం చేయలేనని ప్రియాంక చెప్పింది.

చాలామంది నేను ఫారిన్‌లో సెటిలైపోయానని అనుకుంటున్నారు. కానీ నేను ఇక్కడే ఉన్నాను. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరైనా అప్రోచ్ అవుతారేమో చూడాలి. ఇండస్ట్రీలో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటే బ్రేక్ తీసుకోవద్దు.. నేను అదే మిస్టేక్ చేశాను, చేజేతులా నా కెరీర్‌ని నేనే నాశనం చేసుకున్నానని ప్రియాంక చెప్పింది. పెళ్లిపై నీ అభిప్రాయం ఏంటని వర్ష అడగ్గా.. నాకు జరిగిన దానిని బట్టి నేను పెళ్లి చేసుకోను, సింగిల్‌గానే హ్యాపీగా ఉంది, అబ్బాయిల మీద నమ్మకం లేదు. ఎవరికైనా నా ప్రేమను ఇవ్వాలని వెయిట్ చేశాను, కానీ అలసిపోయాను. నా ప్రొఫెషన్‌కి సపోర్ట్ చేస్తూ.. నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీలను అర్ధం చేసుకుని, నాకే ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి కనిపిస్తే పెళ్లి చేసుకుంటా. నాతో ఉన్నవాళ్లంతా నటించే వాళ్లే.. ఎవరెవరో వచ్చి నేనంటే చాలా ఇష్టమని, నా కోసం ప్రాణాలైనా ఇస్తానని చెబుతారు. నేనూ యాక్టర్‌నేనని కౌంటర్ ఇస్తా. లవ్‌లు గివ్‌లు కాదు ఫ్యామిలీతో ఉండండి, ఫ్యామిలీ కోసం బతకండి కనీసం వాళ్లయినా నీ పక్కన ఉంటారు. ఒకదశలో చనిపోవాలని అనుకున్నానని ప్రియాంక తెలిపింది.

నువ్వు లక్‌ని నమ్ముతావా? టాలెంట్‌ని నమ్ముతావా అని వర్ష అడగ్గా.. హార్డ్ వర్క్‌ని నమ్ముతా, కొంచెం లేట్ అవ్వొచ్చు కానీ నువ్వు చేసిన హార్డ్ వర్క్‌కి డబుల్ వస్తుంది. హైప్‌లో ఉన్నప్పుడు నాకేం తెలియదు, నా ప్రాజెక్ట్ అయాపోయాక కష్టమేంటో తెలుస్తోంది. సేవింగ్స్ అనేవి మెయింటైన్ చేయాలి, ఎమర్జెన్సీ వస్తే నువ్వు ఎవరినీ అడుక్కుంటావు, ఎవ్వడూ హెల్ప్ చేయడు. నా కెరీర్ డిస్ట్రబ్ అయిపోయింది.. ఇంత జరుగుతున్నా నా కంట్లో కన్నీళ్లు మాత్రం రాదని ప్రియాంక ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. ప్రియాంక కెరీర్ ఎందుకిలా అయ్యింది? ప్రేమలో ఆమెను మోసం చేసిందెవరు? తెలియాలంటే ఈ శనివారం ప్రసారమయ్యే కిస్సిక్ టాక్స్ ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more about: priyanka nalkari movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X