మగాళ్లపై నమ్మకం పోయింది.. ఎప్పటికీ పెళ్లి చేసుకోను: సీరియల్ బ్యూటీ ఎమోషనల్

తెలుగు బుల్లితెరపై తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నఈ నటి.. ప్రస్తుతం తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. కానీ తెరపై ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆమె జీవితంలో మాత్రం ఎన్నో చేదు అనుభవాలు, మోసాలు, కన్నీటి కథలు దాగి ఉన్నాయి. ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోయి తీవ్ర మానసిక వేదన అనుభవించిన ఈ నటి, ఒక దశలో ఆత్మహత్య గురించి కూడా ఆలోచించిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలను బయటపెట్టింది. మగాళ్లను అస్సలు నమ్మను.. ఇక జీవితంలో పెళ్లే చేసుకోను అంటూ సంచలన ప్రకటన చేసింది. ఇంతకీ ఆ సీరియల్ బ్యూటీ ఎవరో తెలుసా?

ఆ సీరియల్ బ్యూటీ ఎవరో కాదు.. ప్రియాంక నల్కార్.. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు అమ్మాయిగా సినీ, టెలివిజన్ రంగంలో అడుగుపెట్టిన ఆమెకు తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినా, తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కింది. వరుస సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియాంక, అంతే కాదు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పింది. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని బాధాకర అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.

Priyanka Nalkari Reveals Heartbreaking Past Says Marriage Is Not for Her

తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడిన ప్రియాంక, ప్రేమ పేరుతో తాను తీవ్రంగా మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో నమ్మిన వ్యక్తి చివరకు తనను మోసం చేయడంతో మానసికంగా పూర్తిగా కుంగిపోయానని చెప్పారు. ఆ ఘటన తన జీవితాన్ని తలకిందులు చేసిందని, కొన్ని సందర్భాల్లో బతకాలని కూడా అనిపించలేదని వెల్లడించారు. ఆ సమయంలో తనకు ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని చెప్పి షాక్ ఇచ్చారు.

"ప్రేమ పేరుతో చాలా మంది జీవితాలను నాశనం చేస్తున్నారు. నేను కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఒకరిని గుడ్డిగా నమ్మి ప్రేమించడం నా జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ఒకసారి మోసపోయాక మళ్లీ అలాంటి బాధను అనుభవించే ధైర్యం నాకు లేదు. అందుకే ఇక జీవితంలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు" అంటూ ప్రియాంక భావోద్వేగానికి గురయ్యారు.

అయితే తనను కాపాడింది కుటుంబమేనని ఆమె చెప్పారు. తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల కోసం తాను బలంగా నిలబడాల్సి వచ్చిందని తెలిపారు. కుటుంబానికి తానే పెద్ద దిక్కుగా మారి, సోదరీమణుల పెళ్లిళ్లు, ఇంటి బాధ్యతలు అన్నీ తన భుజాలపై మోశానని చెప్పారు. "నా ఆనందం కంటే నా కుటుంబ సభ్యుల సంతోషమే నాకు ముఖ్యమైంది. వాళ్ల కోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను. కానీ నా జీవితాన్ని మాత్రం పట్టించుకోలేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం సీరియల్స్‌కు కొంతకాలం విరామం ఇవ్వడమే తన జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితిగా మారిందని ప్రియాంక తెలిపారు. కెరీర్‌లో వచ్చిన గ్యాప్ తనను మానసికంగా మరింత బాధపెడుతోందని చెప్పారు. "ఇప్పటివరకు నేను నా కుటుంబం కోసం చాలా చేశాను. కానీ నా భవిష్యత్తు గురించి, నా జీవిత లక్ష్యాల గురించి ఆలోచించలేదు. అదే నేను చేసిన పెద్ద తప్పు. ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఏడవకూడదని నాకే నేను చెప్పుకుంటున్నాను" అన్నారు.

యువతలో పెరుగుతున్న ఆత్మహత్యలపై కూడా ప్రియాంక స్పందించారు. ఇటీవల చిన్న చిన్న కారణాలకు కూడా యువత ఆత్మహత్యలు చేసుకోవడం తనను కలచివేస్తోందని చెప్పారు. "సూసైడ్ అనేది సమస్యలకు పరిష్కారం కాదు. ఒక వ్యక్తి కోసం, ప్రేమ కోసం జీవితాన్ని ముగించుకోవడం సరైన నిర్ణయం కాదు. నేను కూడా కొన్ని సందర్భాల్లో అలాంటి ఆలోచనలు చేశాను. కానీ వెంటనే నా కుటుంబం గుర్తుకు వచ్చింది. నా తల్లిదండ్రులు, నా కుటుంబం గురించి ఆలోచించాను. అందుకే ఆ నిర్ణయం తీసుకోలేదు" అని చెప్పారు.

"ఎన్ని కష్టాలు వచ్చినా తల్లిదండ్రులను దూరం పెట్టకండి. మీ కోసం కష్టపడే వాళ్లు వాళ్లే. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కుటుంబంతో పంచుకోండి. ఒక క్షణిక భావోద్వేగంతో తీసుకునే నిర్ణయం జీవితాలను నాశనం చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించండి" అని సూచించారు. ప్రస్తుతం ప్రియాంక నల్కార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రేమ, పెళ్లి, కుటుంబ బాధ్యతలు, మానసిక ఆరోగ్యం గురించి ఆమె చెప్పిన మాటలు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా యువతకు ఆమె ఇచ్చిన సందేశం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X