నాలుగు గోడల మధ్య ఓకే.. నలుగురిలో కన్నెత్తి చూడని బంధం నాది.. బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన

Priyanka Singh: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫేమ్, నటి ప్రియాంక సింగ్ (పింకీ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్‌బాస్‌ షోతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. షో తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఎందుకు అయ్యారనే ప్రశ్న అందరిలోనూ ఉంది. తాజాగా జబర్దస్త్ షో (Jabardasth show)నటి, యాంకర్ వర్షా హోస్ట్ చేస్తున్న కిసిక్ టాక్ షోలో పాల్గొన్న ఆమె, ఇప్పటి వరకు ఎప్పుడూ బయటపెట్టని పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. తన లవ్ స్టోరీ గురించి చెబుతూ.. 'నాలుగు గోడల మధ్య ఓకే.. నలుగురులో కన్నేత్తి చూడని రిలేషన్ నాది..' అంటూ బిగ్‌బాస్ బ్యూటీ పింకీ ఆవేదన వ్యక్తం చేసింది. అసలేం జరిగిందంటే?

ఇంటర్య్వూలో యాంకర్ వర్ష 'బిగ్ బాస్ తర్వాత ఎందుకు కనిపించలేదు?' అన్న ప్రశ్నకు ప్రియాంక ఇచ్చిన సమాధానం ఇస్తూ 'సోషల్ మీడియా అన్నది ఇప్పుడు బూతులు, ద్వేషం, హింసల వేదిక అయిపోయింది. లైక్స్, వ్యూస్ కోసం మనుషులు ఏ స్థాయికైనా దిగజారిపోతున్నారు' అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఇన్‌స్టాగ్రామ్ వచ్చిన తర్వాత సాధారణంగా ఉండే వ్యక్తులు కూడా అసభ్యంగా కామెంట్లు చేయడం ప్రారంభించారని, వ్యక్తిగత జీవితం, లింగ మార్పు, రూపం గురించి అనవసరమైన కామెంట్లు తమను మానసికంగా దెబ్బతీశాయని చెప్పారు. సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యానని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది.

Priyanka Singh Emotional Interview Bigg Boss Star Reveals Hidden Pain About Her Relationship

'నిన్ను సాయి అని పిలవాలా? ప్రియాంక అని పిలవాలా?' అని వర్ష ప్రశ్నించగా.. ప్రియాంక తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'ఇలాంటి ప్రశ్నలు అడుగుతారని తెలిసే నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. ఇది వ్యక్తిగత గాయం. బురదలో రాయి వేసినట్టే'అని భావోద్వేగంతో చెప్పారు. సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారిన ప్రయాణం సులభం కాదని, ఆ నిర్ణయం వెనుక ప్రేమ, నమ్మకం ఉన్నప్పటికీ, సర్జరీ తర్వాత తాను నమ్మిన వ్యక్తి మోసం చేశాడని హృదయ విదారక విషయాన్ని గుర్తుచేశారు.

కాస్టింగ్ కౌచ్ అనుభవంపై వచ్చిన ప్రశ్నకు ప్రియాంక స్పందిస్తూ 'ఇది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు. ప్రతి రంగంలో మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారు. బట్టల దుకాణంలో పనిచేసే అమ్మాయిలు కూడా సమస్యలు పడుతున్నారు'అని చెప్పారు. ప్రియాంకను తీవ్రంగా గాయపరిచిన సంఘటనల్లో ఒకటిగా ఆమె చెప్పినది జబర్దస్త్ తరహా కామెడీ షో సంఘటన. ఆమె తెలిపిన వివరాల ప్రకారం షో ఆఫర్ ఇచ్చి, రిహార్సల్స్ చేయించి, స్టేజ్‌పై వెళ్లబోతుండగా నిర్మాతలు వచ్చి 'నువ్వు చేస్తే షోకు చెడ్డ పేరు వస్తుంది'అని బయటకు పంపించారట. ఈ అవమానాల కారణంగా ఆమె మానసికంగా బాగా కుంగిపోయి ఒకటిన్నర సంవత్సరం మంచాన పడినట్లుగా తెలిపారు.

ఈ క్లిష్ట సమయంలో 'ప్రతి నెలా నా ఖాతాలో డబ్బులు పంపించారు. మాటలు లేకున్నా అండగా నిలిచారు. నా జీవితంలో మరచిపోలేని మనిషి నాగబాబు గారు'అని కృతజ్ఞతతో చెప్పారు. 'మీ బాయ్‌ఫ్రెండ్‌కు ముందే చెప్పారా? మ్యారేజ్ గురించేమన్నారా?' అని వర్షా ప్రశ్నించగా ప్రియాంక భావోద్వేగంతో 'చెప్పిన తర్వాతనే కదా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు... నా రిలేషన్‌షిప్ నాలుగు గోడల మధ్య బాగానే ఉంటుంది. కానీ నలుగురు ఉన్న చోట... నాకు నా బాయ్‌ఫ్రెండ్ కనీసం కన్నెత్తి కూడా చూడడు" అంటూ హార్ట్ టచ్చింగ్ కామెంట్స్ చేశారు.

'నేను ట్రాన్స్ ఉమెన్‌ను... ట్రాన్స్ గర్ల్స్ అంటే చాలా మందికి కేవలం సె...క్స్ టాయ్స్ అనే భావన. మాలాంటి వాళ్లతో బయట తిరిగితే సమాజం వారిని చిన్నచూపు చూస్తుందని చాలా మంది పురుషులు భయపడతారు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాటల్లో కనిపించిన ఆవేదన ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. ప్రియాంక సింగ్ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X