Bigg Boss Telugu పెద్ద బావ, చిన్న బావ.. బుల్లి బావ అంటూ ప్రియాంక రొమాంటిక్‌గా..
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో అక్టోబర్ 26వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం అభయహస్తం టాస్క్ కొనసాగింది. అంతకుముందు జరిగిన పోస్ట్ మ్యాన్ టాస్క్‌లో లెటర్లను స్క్రాప్ చేయడంపై ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. అయితే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ ఎలా కొనసాగిందంటే..

బావలు అంటూ సయ్యా అంటూ
ఇంటి సభ్యుల్లో యాంకర్ రవి, లోబో, ప్రియాంక సింగ్ మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది. శ్రీరామచంద్రను పెద్ద బావ, మానస్‌ను చిన్నబావ అని, జెస్సీని బుల్లి బావ అంటూ సాగిన సరదా సంభాషణ వినోదంగా మారింది. పెద్ద బావ ఒప్పుకోవడం లేదన్న.. కట్నం కావాలని అంటున్నాడు అన్నయ్య అంటూ యాంకర్ రవితో అంటే.. రెండో అన్నయను అడుగు అంటూ లోబో వద్దకు పంపించారు.

నా జీవితం బుగ్గిపాలు అంటూ
అయితే ప్రియాంక రావడంతో నెత్తి మీద గుడ్డ కప్పుకొన్నాడు. అలా చేయకు అన్నా.. నా జీవితం బుగ్గిపాలు అవుతుంది అంటూ ప్రియాంక ఫన్‌గా డైలాగ్ చెప్పింది. అయితే కట్నం కావాలని అడిగితే కాళ్లు, చేతులు తీసేస్తా అని లోబో అంటే.. నా జీవితం ఎలా అంటే.. నేనున్నాను. జీవితాంతం నిన్ను, వాడిని ప్రేమిస్తాను అంటూ లోబో చెప్పాడు. ఇక రెండో బావ మానస్ దేనికైనా అడ్జస్ట్ అయిపోతాడు. వాడిని తెచ్చిపెళ్లి చేస్తా అంటూ లోబో అన్నాడు.
బుల్లి బావ జెస్సీ అంటూ
అయితే యాంకర్ రవితో లోబో మాట్లాడుతూ పింకికి బుల్లి బావ ఎవరు అంటూ.. జెస్సీ అని యాంకర్ రవి సమాధానం చెప్పాడు. అయితే వాడు కూడా క్యారెక్టర్‌లో ఉన్నాడా అంటూ లోబో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాంతో జెస్పీ గాడికి నేనంటే చాలా ఇష్టం అంటూ ప్రియాంక చెప్పడంతో సరదా సంభాషణ ముగిసింది.

అభయ హస్తం టాస్క్
అభయ హస్తం టాస్క్‌ను పరిచయం చేస్తూ ఇంటిని లాక్‌డౌన్ చేశారు. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశం, ఇంటిలోకి వెళ్లేందుకు అవకాశం ఉన్న పోటీదారులే ఉంటుంది. ఈ టాస్క్‌లో మొత్తం ఐదు పోటీలు ఉంటాయి అని గేమ్ రూల్స్ చెప్పారు. ఐదు అవకాశాల కోసం ఎవరు పోటీ పడాలనేది కంటెస్టెంట్లు నిర్ణయించుకోవాలని అన్నారు.

షణ్ముఖ్ విజేతగా
అభయ హస్తం టాస్క్‌లో మొదటగా మట్టిలో ముత్యాలు అనే పోటిని నిర్వహించారు. ఇందులో లోబో, షణ్ముఖ్ పాల్గొన్నారు. ఇందులో టబ్ నుంచి ఎక్కువ ముత్యాలు సేకరించిన షణ్ముఖ్ విజేతగా నిలిచి కెప్టెన్సీ టాస్క్ మొదటి పోటీదారుడిగా నిలిచి ఇంటిలోకి వెళ్లే అవకాశాన్ని పొందాడు.

కెప్టెన్సీ టాస్క్ కోసం రెండో కంటెస్టెంట్‌గా
గాలం మార్చే మీ కాలం పోటిని నిర్వహించగా యాంకర్ రవి, సిరి హన్మంతు పాల్గొన్నారు. గాలంతో స్విమ్మింగ్ పుల్‌లోని బాటిల్‌ను బయటకు తీయాలి. అలా ఎక్కువ బాటిల్స్‌ను తీసిన వారు విజేతలుగా నిలుస్తారు. ఇందులో సిరి హన్మంతు విజేతగా నిలిచారు.Recommended Video

శ్రీరామచంద్ర మూడో కంటెస్టెంట్‌గా
అభయ హస్తం టాస్క్‌లో భాగంగా తాడులు తకధిమి అనే పోటీని నిర్వహించారు. ఎక్సర్‌సైజ్ రోప్స్‌ను ఎక్కువ సేపు కదుపుతారో వారు విజేతలుగా నిలుస్తారు అని బిగ్‌బాస్ ఆట నియమాలను చెప్పారు. ఈ గేమ్‌లో పోటీదారులు మానస్, శ్రీరామచంద్ర పాల్గొన్నారు. అయితే చివరకు వరకు తాళ్లను కదుపుతూ శ్రీరామచంద్ర విజయం సాధించారు. దాంతో ఆయన కెప్టెన్సీ టాస్క్ పోటీదారులుగా నిలిచారు.


Click it and Unblock the Notifications











