నీతో క్లోజ్‌గా ఉంటే నా మూడ్ అలా.. నీవు తక్కువోడివి కాదు.. మానస్‌తో ప్రియాంక రొమాంటిక్ లవ్ ట్రాక్
బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో ఏడోవారం నామినేషన్ల ప్రక్రియ ఇంటి సభ్యుల్లో భారీగా చిచ్చు పెట్టింది. వీజే సన్నీ, మానస్‌కు ఆర్జే కాజల్ దగ్గర కావడంతో ప్రియాంక సింగ్ అలకమానింది. కాజల్‌ను నామినేట్ చేస్తే స్పందించకుండా యాంకర్ రవిని సంచాలకుడు వీజే సన్నీ నామినేట్ చేయడంపై ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన కారణం లేకుండా నామినేట్ చేస్తున్నారు. అంతా సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటూ నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగానే భోరున విలపించింది. దాంతో ఇంటిలో జరుగుతున్న వ్యవహారాలపై కోపంతో అలకతో కనిపించింది. ఈ క్రమంలో ప్రియాంకను మానస్ ఎలా బుజ్జగించారంటే..]
Photo Courtesy: Star మా and Disney+Hotstar

ప్రియాంక వన్ సైడ్ లవ్
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ప్రారంభమైనప్పటి నుంచి ప్రియాంక, మానస్ మధ్య ఓ రకమైన రిలేషన్ బలపడుతూ వస్తున్నది. వారిద్దరి మధ్య వన్ సైడ్ లవ్ ట్రాక్ లాంటిది నడుస్తున్నట్టు స్పష్టంగా కనిపించింది. మానస్‌పై ప్రియాంక ప్రేమను వ్యక్తం చేసినా మానస్ మాత్రం మౌనంగా ఉంటూ కనిపిస్తున్నాడు. అయితే మానస్ ప్రేమను ఎలాగైనా పొందాలని ప్రియాంక ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో మానస్ టీమ్‌కు ప్రియాంక దగ్గర కావడంతో కొంత అసహనానికి గురవుతూ కనిపిస్తున్నది.

ఇంట్లో అందరికి గోరుముద్దలు అంటూ ప్రియాంక
ఇలాంటి పరిస్థితుల్లో కాజల్‌కు మానస్ అన్నం కలిపి గోరుముద్దలు తినిపించడంతో ప్రియాంక ఇంకా ఉడికిపోయింది. తనకు అన్నం తినిపించమంటే తినిపించడు కానీ.. ఇంటిలోని అందరికి ఆయన గొరుముద్దలు తినిపిస్తాడు అంటూ వీజే సన్నీ ముందు ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నీవంటే మానస్‌కు ఓ రకమైన రెస్పక్ట్ అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఇంటిలో ముభావంగా ఉంటే.. ప్రియా వచ్చి భోజనం చేద్దాం రా అంటూ పిలిస్తే నిరాకరించింది.

మానస్ చేష్టలతో ప్రియాంక ఏడుస్తూ
మానస్, వీజే సన్ని, కాజల్ కలిసి భోజనం చేస్తుంటే చూసి తట్టుకోలేక ప్రియాంక ఏడుస్తుంటే.. అనీ మాస్టర్ ఊరడించే ప్రయత్నం చేసింది. ధాంతో తనలోని ఆవేదనను బయటపెడుతూ.. నా మనసును మానస్ కూడా అర్ధం చేసుకోవడం లేదు అని ప్రియాంక చెప్పింది. నీవు గుడ్ ఫ్రెండ్ అని తెలుసు. నిన్ను మానస్ అర్ధం చేసుకొంటాడులే. కాజల్, మానస్, వీజే సన్నీ ఒక్కటయ్యారు. ఒక్కరోజు అసలు ఫ్రెండ్ ఎవరో తెలుస్తుంది అని అనీ మాస్టర్ చెప్పింది.

నా మనసు అర్ధం కాలేదా అంటూ పింకి
దాంతో అనీ మాస్టర్‌కు సమాధానం చెబుతూ.. ఫ్రెండే కాదా.. ఏదైనా విషయం నాకు చెప్పవచ్చు కదా.. ప్రియాంక చెప్పినది కరెక్ట్ రీజన్ అని తెలియదా. నా మనసు అర్ధం కాలేదా. నేను చెప్పింది అర్ధం కాలేదా. నేను అన్నది తెప్పా నేను ఓ చిన్న మాట అంటే నన్ను పట్టించకోకుండా ఉంటాడా? మానస్‌ను అంతకంటే ఎక్కువగా మాటలు అన్నారు. నేను కూడా డ్రామా చేయాలా? అని అని మాస్టర్‌తో అంటూ ఉంటే.. మానస్ వచ్చి అన్నం తిన్నావా అని అడిగాడు. దాంతో నీవు మాట్లాడు అంటూ అనీ మాస్టర్ వెళ్లిపోయింది.

మానస్ అలాంటి వాళ్లు నాకు నచ్చరు అంటూ
ప్రియాంకతో మానస్ మాట్లాడుతూ.. సింపుల్.. వీజే సన్నీని టార్గెట్ చేయాలని చూశారు. ప్రియ గారు కాజల్‌ను డైరెక్ట్‌గా నామినేట్ చేయవచ్చు కదా.. ప్రియా నామినేషన్ వేశారు. యాంకర్ రవి నామినేట్ అయ్యారు. తనను టార్గెట్ చేయడంతో తన ఫ్రెండ్ కాజల్‌ను వీజే సన్నీ కాపాడాడు అని అన్నాడు. అయితే రెండు రకాల మనస్తత్వాలు ఉన్న వారంటే ఇష్టం ఉండదు అని అంటే.. అది కాదు.. నీకు చుట్టు పక్కల జరుగుతున్న విషయాలు అర్ధం కావడం లేదు అంటూ మానస్ అన్నాడు.

ఓవరాక్షన్ చేయకు అంటూ మానస్
ఆ తర్వాత ప్రియాంకతో మాట్లాడుతూ.. నీకు అన్నం తినిపించాలా అని మానస్ అడిగితే ఆమె మౌనంగా ఉంది. నేను ఒక్కసారి అడుగుతాను. ఆఫర్ ఒక్కసారే ఉంటుంది ఓవరాక్షన్ చేయకు అంటే నాకు ఆకలి లేదు అంటే.. చివరిసారిగా అడుగుతున్నాను అంటే కాసేపు ఆగు తింటాను అని ప్రియాంక చెప్పింది.

నీతో క్లోజ్‌గా ఉంటే నా మూడ్ అలా ఉంటుంది..
ప్రియాంక తన కోపం తగ్గించుకోవడంతో మానస్ అన్నం కలిసి తినిపిస్తూ ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక్కడ ఉన్నంత సేపు ఇదో ప్రపంచం అని గుర్తుంచుకో. బయట ఏం జరుగుతున్నది అని ఆలోచిస్తే పని జరగదు అని అంటే.. నీతో క్లోజ్‌గా మాట్లాడితే నా మూడ్ బాగుంటది. మధ్యాహ్నం నుంచి నా మూడు బాగాలేదు అని ప్రియాంక అంటే.. అవును అందరి మీద జోకులేసి హుషారుగా కనిపించావు. చివరికి ఇలా నేను తినిపించాల్సి వస్తున్నది అని మానస్ అంటే.. చాలా మందికి తినిపిస్తున్నావు అని ప్రియాంక సెటైర్ వేసింది.
Recommended Video

నీ చేతి వేళ్లు కూడా వదలదు కదా..
అమ్ము (లహరి షారి) అయితే బాగా తినిపించుకొనేది అంటూ మానస్ అంటే.. అవును వేళ్లు కూడా నాకేసేది అని ప్రియాంక బాంబు పేల్చింది. దాంతో ఓహో నీవు కూడా చూశావా అని మానస్ అంటే.. అవును.. ఇంటిలో ఎన్ని కెమెరాలు ఉన్నాయో.. అందులో నేను ఒక కెమెరాను. నీను ఎక్కడ ఉంటే అక్కడ నా ఫోకస్ ఉంటుంది. నీవు బాత్రూంలో ఉంటే తప్ప చూడలేను అని అంటే.. నీవు బాగానే చూస్తున్నావు అని మానస్ సమాధానం చెప్పింది. అందులో ఏ మీనింగ్ ఉందో తెలియదు కానీ నీవు కనపడవు కానీ తక్కువోడివి కాదు అంటూ ప్రియాంక చెప్పింది.


Click it and Unblock the Notifications











