ఆదిలోనే అన్నీ కష్టాలే.. 'బిగ్ బాస్ 3'పై గుప్పుమంటున్న వార్తలు

Recommended Video

Bigg Boss Telugu 3 : Celebrities Are Not Willing To Participate In Bigg Boss ? || Filmibeat Telugu

బుల్లితెర ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగవంతం చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ హోస్ట్‌గా నాగార్జునను కన్ఫర్మ్ చేస్తూ ప్రోమో రిలీజ్ చేసిన బిగ్ బాస్ యాజమాన్యం పార్టిసిపెంట్స్ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ విషయమై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి పోతే..

ఎన్టీఆర్, నాని, నాగార్జున

ఎన్టీఆర్, నాని, నాగార్జున

బిగ్ బాస్ సీజన్ వన్ మొదలైనప్పటి నుంచే బుల్లితెర ప్రేక్షకులు బాగా అట్రాక్ట్ అయ్యారు. మొదటి సీజన్‌లో ఎన్టీఆర్ హోస్టింగ్ చేయడంతో ఈ షోకి సూపర్ పాపులారిటీ వచ్చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 2లో నాచురల్ స్టార్ నాని దానిని కంటిన్యూ చేస్తూ విజయవంతం చేశారు. దీంతో ఈ షో పట్ల ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేయాలని సీజన్ 3 హోస్టింగ్ బాధ్యతలను సీనియర్ హీరో నాగార్జునకు అప్పగించారు.

రోజుకో కొత్త పేరు.. కొసాగుతున్న సస్పెన్స్

రోజుకో కొత్త పేరు.. కొసాగుతున్న సస్పెన్స్

బిగ్ బాస్ సీజన్ 3 ఎప్పుడు ప్రారంభ తేదీని అఫీషియల్‌గా ప్రకటించలేదు కానీ జులై 21న మొదలయ్యే అవకాశం ఉందని టాక్. అయితే ఇందులో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రతీ రోజు కొన్ని పేర్లు బయటకు వస్తునప్పటికీ.. ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూనే ఉన్నారు సదరు సెలెబ్రిటీలు.

సెలెబ్రిటీలు నో ఇంట్రెస్ట్

సెలెబ్రిటీలు నో ఇంట్రెస్ట్

అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ మేరకు ఈ షోలో పార్టిసిపెంట్స్‌గా ఉండేందుకు సెలెబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపడం లేదట. 100 రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండి బిగ్ బాస్ హౌస్ లోనే కాలం గడపడం కష్టమని అంతా భావిస్తున్నారట. అందుకే బిగ్ బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని టాక్ నడుస్తోంది. మరోవైపు పార్టిసిపెంట్స్ ఇంట్రెస్ట్ చూపక పోవడానికి మరో బలమైన కారణం కూడా ఉందని చెప్పుకుంటున్నారు.

శివ‌బాలాజీ, కౌశల్ పరిస్థితి ఏంటి..?

శివ‌బాలాజీ, కౌశల్ పరిస్థితి ఏంటి..?

బిగ్ బాస్ షోలో పాల్గొంటే మంచి పాపులారిటీ వస్తుంది, ఆ వెంటనే అవకాశాలు వెల్లువెత్తుతాయి అని భావిస్తారంతా. కానీ గత రెండు సీజన్లలో విన్నర్లుగా నిలిచిన శివ‌బాలాజీ, కౌశల్ ఆశించిన మేర అవకాశాలు అందిపుచ్చుకోలేదు. ఈ ఒక్క కారణం ప్రాతిపదికన సెలెబ్రిటీలు బిగ్ బాస్ హౌస్‌పై ఇంట్రస్ట్ పెట్టడం లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఈ నెలాఖరు వరకు బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చెనందుకు ఎవరెవరు ముందుకొస్తారో!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X