ఫ్లాప్ హీరోయిన్‌కు బండ్ల గణేష్ బంపర్ ఆఫర్.. ఓంకార్ ముందే లక్ష రూపాయలకు బదులుగా కోటి అంటూ..
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. వేదికపై తాను వదిలే మాటల బాణాలు అందర్నీ నవ్వుల్లో ముంచెత్తుతాయి. తాజాగా ఓంకార్ నిర్వహించే సిక్త్స్‌సెన్స్ షోలో బండ్ల గణేష్ చేసిన హంగామా ఆ షోకు హైలెట్‌గా మారింది. ఈ సందర్భంగా ఓ హీరోయిన్‌కు ఆఫరిస్తానని చెప్పడటమే కాకుండా నిన్ను కోటి రూపాయల హీరోయిన్ చేస్తానని హామీ ఇచ్చాడు. అలా హామీ ఇవ్వడానికి ముందు ఏం జరిగిందంటే..
Recommended Video

కూతురితో కలిసి బండ్ల గణేష్
సిక్త్ సెన్స్ రియాలిటీ షోలో సీజన్ 4లోకి హీరోయిన్ నందిత శ్వేత, బండ్ల గణేష్ అడుగుపెట్టారు. అయితే తన కూతురు జనని బండ్లతో కలిసి ఆయన వచ్చారు. నందిత శ్వేత ఈ షోలో పాల్గొనే ముందు బండ్ల గణేష్‌తో మీరు అన్నయ్య లాంటి వాళ్లు అని అన్నారు. నేను సాధారణంగా ఎవరినీ అన్నయ్య అని పిలువను. ఎందుకో బండ్ల గణేష్‌ను చూడగానే అన్నయ్య అని పిలువాలని అనిపించింది అని నందితా శ్వేత అన్నారు.

షోలో బండ్ల గణేష్, నందితా శ్వేత
ఇక సిక్త్ సెన్స్ షో కోసం బండ్ల గణేష్, నందితా శ్వేత ఇద్దరు పోటీదారులుగా మారిపోయారు. బండ్ల గణేష్‌కు కూతురు సపోర్ట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్, నందితా శ్వేత మధ్య రసవత్తరంగా పోటి జరిగింది. ఓ సందర్భంగా ఎగ్స్ పగలకొట్టే సందర్భంలో ఓంకార్ కంగారు పెట్టడంతో నందితా శ్వేతకు బండ్ల గణేష్ అండగా నిలిచారు.

మూడు కోడి గుడ్ల ఆట
సిక్త్ సెన్స్ ఆటలో భాగంగా మూడు కోడి గుడ్లు ఉంటాయి. అందులో ఒకదానిలో రూ.1 లక్ష విలువైన బంగారం ఉంటుంది. అయితే సరిగా అంచనా వేసి.. ముందుగా రెండు ఖాళీ గుడ్లను పగలకొట్టాలి. అయితే ఓంకార్ వద్దంటున్నా ఓ గుడ్డును పగలకొట్టేందుకు నందితా శ్వేత పగలకొట్టబోయింది. అయితే ఓంకార్ వారిస్తూ... అందులోనే రూ.1 విలువైన బంగారం ఉంటుంది అని హెచ్చరించారు.

నేను చెప్పిన గుడ్డు పగలకొట్టేసేయ్
అయితే నందితా శ్వేతకు ఓంకార్ పెట్టే టెన్షన్ చూడలేకపోయిన బండ్ల గణేష్... నేను చెప్పిన దాన్నే కొట్టేయ్.. అందులో బంగారం ఉండదు అని ప్రోత్సహించాడు. ఒకవేళ అందులో బంగారం ఉండి.. నీకు ఆ ఛాన్స్ మిస్ అయితే... నేను లక్ష రూపాయలు ఇస్తాను. నేను చెప్పిన గుడ్డు, నీవు అనుకొంటున్న గుడ్డులో బంగారం ఉండందంటూ భరోసా ఇచ్చారు. అయితే ఓంకార్ వన్ సెకన్ అంటూ చివరకు వరకు ఆ గుడ్డును పగలకొట్టకుండా వారించాడు.

నిన్ను టాప్ హీరోయిన్ చేస్తా
కానీ బండ్ల గణేష్ చెప్పిన గుడ్డును పగలగొట్టకుండా నందిత శ్వేతాను వన్ సెకన్ అంటూ ఆపుతూ వచ్చారు. దాంతో విసిగిపోయిన బండ్ల గణేష్.. లక్ష రూపాయలు కాదు... నేను నీకు నా సినిమాలో ఆఫర్ ఇస్తా.. నిన్ను టాప్ హీరోయిన్ చేస్తా.. నీకు కోటి రూపాయలు అందుకొనే హీరోయిన్‌గా మార్చేస్తా అంటూ బండ్ల గణేష్ అన్నారు. దాంతో లక్ష రూపాయల బంగారం పోయినా పర్వాలేదు. నాకు బండ్ల అన్నయ్య నాకు సినిమా ఆఫర్ ఇస్తానని అన్నాడు అంటూ నందితా శ్వేత ఆ గుడ్డును పగలకొట్టింది.

లక్ష రూపాయల బంగారం మిస్
అయితే ఓంకార్ చెప్పినట్టే.. నందితా శ్వేత పగలకొట్టిన గుడ్డులో బంగారం ఉంది. దాంతో లక్ష రూపాయల బంగారం నందితా శ్వేత మిస్ చేసుకొన్నది. దాంతో ఏం బాధపడకు.. నీకు నేను మంచి హీరోయిన్ ఆఫర్ ఇస్తాను అంటూ బండ్ల గణేష్ చెప్పారు. చివరికి ఈ షోలో బండ్ల గణేష్ లక్ష రూపాయలు గెలుచుకోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











