మహేష్ కత్తికి అమ్మాయిల పిచ్చి.. 200 మందిని.. ఈ దరిద్రాన్ని ఆాపాల్సిందే.. టాలీవుడ్ నిర్మాత ఫైర్

By Rajababu

Recommended Video

మహేష్ కత్తికి అమ్మాయిల పిచ్చి..! టాలీవుడ్ నిర్మాత ఫైర్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్‌, త్రివిక్రమ్‌లపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్న కత్తి మహేష్‌పై నటుడు, నిర్మాత రాంకీ మండిపడ్డారు. కత్తి మహేష్‌ దర్శకత్వంలో నిర్మించిన రిపోర్టర్ చిత్రానికి ఈయన నిర్మాతగా వ్యవహరించారు. మహేష్ కత్తి చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ రాంకీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తి దరిద్రాన్ని ఆపేందుకే మీడియా ముందుకు వచ్చాను అని చెప్పారు. మహేష్ కత్తి గురించి నిర్మాత రాంకీ వెల్లడించిన విషయాలు ఇవే..

డైరెక్షన్ అవకాశమిచ్చాను

డైరెక్షన్ అవకాశమిచ్చాను

రిపోర్టర్ కథతో నా వద్దకు వస్తే నేను సినిమా అవకాశం ఇచ్చాను. ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరావు లాంటి సాంకేతిక నిపుణులను ఇచ్చాను. లోకేషన్‌లో షాట్ చెప్పి ఫేస్‌బుక్ చూసుకొంటాడు. కట్‌ కూడా చెప్పడం రాదు. ఓ దశంలో కెమెరామెన్ కట్ చెప్పేవాడు. అలాంటి వ్యక్తి డైరెక్టర్‌గా పనికిరాడు అని తీసేశాం.

 సినిమాల గురించి తెలియదు

సినిమాల గురించి తెలియదు

మహేష్ కత్తికి సినిమాల గురించి ఏమీ తెలియదు. సినిమాల విషయంలో ఆయనకు జీరో నాలెడ్డ్. ఆయనకు సినిమా చెప్పే రివ్యూలన్నీ చెత్తే. పవన్ కల్యాణ్ హీరోనే కాడు అని అంటే చెప్పుతో కొడుతారు.

 ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాడు

ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాడు

పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి వ్యాఖ్యలు చేస్తున్నందున నేను స్పందించాల్సి వస్తుంది. రివ్యూలతో సినిమా పరిశ్రమకు చీడపురుగులా మారాడు. మహేష్ కత్తి అనే దరిద్రానికి పుల్‌స్టాప్ పెట్టడానికే మీడియా ముందుకు వస్తున్నాను. రివ్యూలతో సినిమా పరిశ్రమను నాశనం చేస్తున్నాడు. సమాజాన్ని విడదీస్తేందుకు ప్రయత్నిస్తున్నాడు.

200 మందితో ఆడిషన్

200 మందితో ఆడిషన్

హీరోయిన్ ఎంపిక కోసం 200 అమ్మాయిలను ఆడిషన్ చేశాడు. ఎంతో మంది అమ్మాయిల ఫోన్ నంబర్లు తీసుకొని అసభ్యకరమైన సందేశాలు పంపుతాడని నాకు ఫిర్యాదు వచ్చింది. ఎంతో మంది అమ్మాయిలు మాకు మెసేజ్‌లు పెడుతుంటారు. సినిమాపై ఫోకస్ ఉండదు. ఆయన దృష్టంతా ఫేస్‌బుక్, వాట్సప్‌లపైనే. ఒకరోజు టిఫిన్ తేలేదని అలిగి వెళ్లిపోయాడు.

 మానసిక వ్యాధితో

మానసిక వ్యాధితో

అమ్మాయిల నుంచి మహేష్ కత్తిపై ఏవోవో పిచ్చి ఫిర్యాదులు వస్తుంటాయి. అతడిని స్త్రీ లోలుడు (ఉమనైజర్) అంటామో ఏమంటామో తెలియదు గానీ అమ్మాయిలకు ఏవోవో పిచ్చి మెసేజ్‌లు పెడుతుంటాడు. ఇప్పటికీ నాకు చాలా విషయాలను నా దృష్టికి తీసుకొచ్చారు. అతడు ఏదో మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు.

 ప్రేక్షకుల పెట్టిన భిక్షతో

ప్రేక్షకుల పెట్టిన భిక్షతో

సినీ ప్రేక్షకులు పెట్టిన భిక్షే వల్ల కత్తి మహేష్ బతుకుతున్నాడు. ప్రేక్షకుడు లేకుంటే సినిమా లేదు. సినిమా లేకుంటే నీ బతుకు లేదు. నీవు తినే బిర్యానీ కూడా సినిమా ప్రేక్షకుడు చెల్లించేదే. అలాంటి ఫ్యాన్స్‌ను నీవు దూషిస్తావా?

 ఫ్యాన్స్‌తో వైరం సరికాదు

ఫ్యాన్స్‌తో వైరం సరికాదు

సినీ హీరోలను అభిమానించే ఫ్యాన్స్‌తో వైరం పెట్టుకోవడం సబబు కాదు. పవన్ కల్యాణ్ వచ్చి నాకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం ఏ విధంగా సరైనది. కత్తి మహేష్‌కు సమాధానం చెప్పడానికి ఆయనకున్న హోదా ఏమిటి అని రాంకీ అన్నాడు.

సినిమా తీయడం రాదు

సినిమా తీయడం రాదు

సినిమా తీయడం రాదు, చేయడం రాదు, సినిమా చూడటం రాదు. అర్థం పర్థం లేకుండా రివ్యూలు రాసే హక్కులు ఎవరిచ్చారు. రివ్యూల పాయింట్ ఆఫ్ వ్యూలో నిర్మాతలు సినిమాలు తీయాలా? అసలు నీ వెవరు? తనకు తాను క్రిటిక్‌గా ముద్ర వేసుకొని సమీక్ష రాయడం ఎంత వరకు సబబు.

సినిమా నుంచి తొలగించాం

సినిమా నుంచి తొలగించాం

మహేష్ కత్తి దర్శకత్వంలో రిపోర్టర్ సినిమా తీశాం. అతడికి సినిమా తీయడం చాతకాదు. అతడి టాలెంట్ లేనివాడు అని తెలిసిన మరుక్షణమే ప్రాజెక్ట్ నుంచి తొలగించాం. మహేష్ కత్తి పేరు లేకుండా రిపోర్టర్ సినిమాను రిలీజ్ చేస్తాం. ఒకవేళ ఆయన పేరు వేయాల్సి వస్తే ఆ సినిమాను చెత్త బుట్టలో వేస్తాను. కానీ రిలీజ్ మాత్రం చేయం.

ఎన్ శంకర్‌తో పూర్తి

ఎన్ శంకర్‌తో పూర్తి

కత్తి మహేష్‌కు సినిమా తీయడం రాదనే వ్యవహారం తెలిసిన వెంటనే ఆయనను తొలగించాం. ఎన్ శంకర్‌తో కలిసి సినిమాను పూర్తి చేశాం. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె లాంటి సాంకేతిక నిపుణులను ఇచ్చాం. నిర్మాత అంటే ఆయనకు గౌరవం లేదు. దారినపోయే వ్యక్తికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే ఫొజులు కొడుతున్నాడు. కత్తి మహేష్‌కు సినిమా అవకాశం ఇచ్చి తప్పు చేశాననే ఫీలింగ్ కలుగుతున్నది.

 వారితోనే నీకు ప్రమాదం

వారితోనే నీకు ప్రమాదం

సినిమా ఇండస్ట్రీలో ఎవరి అండతోనో పవన్ కల్యాణ్ మీద ఆరోపణలు చేస్తున్నావు. అది సరికాదు. అలాంటి వారి నుంచే నీకు ప్రమాదం ఉంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ దాడి చేయాలనుకొంటే ఎప్పుడో చేసేవారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X