ఆయన్ని నేనేం అనలేదు..పుల్లలు పెట్టొద్దు.. వీడియో రిలీజ్ చేసిన పృథ్వీరాజ్!

నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే పేరుతో పరిచయమైన ఆయన తెలుగులో అనేక సినిమాల్లో నటించారు.. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి సపోర్ట్ చేసే ఆయన గత ఎన్నికల సమయంలో జగన్ కోసం ప్రచారం చేస్తూ కాళ్లకు చక్రాలు కట్టుకుని మరి ఆంధ్రప్రదేశ్ అంతా ప్రచారం చేశారు. దీంతో జగన్ అధికారంలోకి రాగానే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ గా పని చేస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా నియమించారు.

అయితే పృథ్వీరాజ్ దిగా చెప్పబడుతున్న ఒక ఫోన్ కాల్ వాయిస్ బయటికి రావడంతో ఆయన ఆ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ఆయన సినిమాల్లో నటిస్తూనే శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కొన్ని షోలకు హాజరవుతూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన పాల్గొన్న శ్రీ దేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ఒకటి టెలికాస్ట్ అయ్యింది..

prudhvi raj releases video about goutham raju issue in sri devi drama company

అయితే ఆ ఎపిసోడ్ లో ఆయన గౌతంరాజు అనే స్నేహితుడు గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే ఆ కామెంట్స్ నటుడు గౌతమ్ రాజు గురించి చేసినవి అంటూ పెద్ద ఎత్తున దుమారం రేగడంతో దీనికి సంబంధించి పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చారు. తాను ఈ కామెంట్ చేసింది తన స్నేహితుడు గౌతంరాజు గురించి అని సినిమా నటుడు గౌతమ్ రాజు కూడా తనకు స్నేహితుడే అయినా ఆయన గురించి ఈ కామెంట్స్ చేయలేదని చెప్పుకొచ్చారు.. కొంతమంది తీరు చూస్తుంటే కావాలని తానేదో గౌతమ్ రాజు గారి మీద కామెంట్ చేసినట్లు కావాలని ఇరికిస్తున్నట్టు ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

తాను ఆయన చాలా మంచి స్నేహితులమని మా మధ్య పుల్లలు పెట్టొద్దు అని ఆయన వీడియోలో పేర్కొన్నారు.. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం మాత్రం ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అని చెప్పక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X