బిగ్‌బాస్ షో అలాంటిదే.. అక్కడ జరిగేది అదే.. పునర్నవి కామెంట్స్
పునర్నవి భూపాలం వెండితెరపై మెరిసి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే నటించింది తక్కువ సినిమాల్లోనే అయినా.. మంచి పేరును తెచ్చుకుంది. పిట్టగోడ, ఉయ్యాల జంపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాల్లో మంచి నటనను కనబర్చింది. అయితే సినిమాల ద్వారా కంటే బిగ్‌బాస్ షో ద్వారానే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. పునర్నవి కెరీర్ బిగ్‌బాస్ షోకు ముందు, బిగ్‌బాస్ షో తరువాత అనేట్టుగా మారింది. అంతటి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది పునర్నవి.

పునర్నవి క్రేజ్..
బిగ్‌బాస్ మూడో సీజన్‌లో విపరీతమైన పాపులార్టీ సాధించిన వారిలో పునర్నవి కూడా ఉంటుంది. రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి కెమిస్ట్రీయే మూడో సీజన్‌ను నడిపించింది. వీరి ప్రేమ, స్నేహం, కోపం, తిట్లు ఇలా అన్ని ప్రేక్షకులకు నచ్చేశాయి. వీరిద్దరికి ఓట్లలోనూ ఆధిక్యత కనిపించేది. ఎలిమినేషన్‌కు వెళ్లిన ప్రతీసారి భారీ తేడాతో సేవ్ అవుతూ వచ్చేవారు.

పున్ను యాటిట్యూడ్..
పునర్నవి తన యాటిట్యూడ్, ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకుంది. టాస్కులో భాగంగా బిగ్‌బాస్‌కే వార్నింగ్ ఇవ్వడం, పనిష్మెంట్‌ను తిరస్కరించడం వంటివి బాగా పాపులర్ అయ్యాయి. అయితే టాస్కులు మాత్రం సరిగా ఆడకపోయేదనే బ్యాడ్ టాక్ ఉండేది. తాజాగా పునర్నవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షోపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

బిగ్‌బాస్ షో అలాంటిదే..
బిగ్‌బాస్ షో అనేది మొత్తం ఎడిట్ చేసి చూపిస్తారని, లోపల ఏం జరిగినా సరే వారికి నచ్చినట్టుగా మలుచుతారని చెప్పుకొచ్చింది. రోజు మొత్తంలో ఎంతో జరుగుతుందని కానీ వారికి కావాల్సిన పుటేజ్‌ను ఎడిట్ చేసి గంట మాత్రమే చూపిస్తారని, అది చూసి జనాలు ఫిక్స్ అయిపోతారని చెప్పుకొచ్చింది. అయితే తానేంటో తనకు మాత్రమే తెలుసని పేర్కొంది.
Recommended Video

అందరితో టచ్‌లో ఉన్నా..
హౌస్ మేట్స్ అందరితో టచ్‌లో ఉన్నానని పునర్నవి తెలిపింది. అందరూ మాట్లాడతారని, ఈవెంట్లకు కూడా పిలుస్తారని, అయితే తనకు సమయం ఉంటే వెళ్తానని పునర్నవి చెప్పుకొచ్చింది. అయితే పునర్నవి మాత్రం ఈ మధ్య మిగతా హౌస్ మేట్స్ కలిసి చేసే పార్టీలో కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











