Punarnavi: గే బెస్టీతో ప్రెగ్నెంట్ అంటూ వార్తలు.. అతనితో అలాంటి ఫొటోలు.. క్లారిటీ ఇచ్చిన పునర్నవి!
సినిమాలతో అలాగే పలు రియాలిటీ షోలతో మంచి క్రేజ్ అందుకున్న పునర్నవి భూపాలం గురించి అందరికీ తెలిసిందే. అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ తెలుగమ్మాయి ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఊహించిన విధంగా దర్శనమిస్తోంది. ఇక గ్లామరస్ లుక్స్ సంగతి పక్కన పెడితే. ఇటీవలనే ఒక ఫారిన్ కు చెందిన గే తో స్నేహం చేస్తోంది అని అయితే ఆమె ప్రెగ్నెంట్ కూడా అయ్యింది అని వివిధ రకాల దారుణమైన వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంపై పునర్నవి కూడా ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు పక్కింటి అమ్మాయిలా..
పునర్నవి మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. ఇక ఆ తర్వాత ఆమె ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ పాత్రలో ఆమె పక్కింటి అమ్మాయి తరహాలో చూపించిన హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఆ తర్వాత మాత్రం పునర్నవి ఒక్కసారిగా తన మోడరన్ లుక్ ను కూడా బయటపెట్టింది.

బిగ్ బాస్ లోకి వెళ్లిన తరువాత..
ఇక బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత అసలు ఈమె లుక్స్ చూసి ఎవరు నమ్మలేదు. ఉయ్యాల జంపాలాలో సింపుల్ గా కనిపించిన ఆ అమ్మాయేనా? అనే విధంగా ఓ వర్గం వారు అయితే ఆశ్చర్యపోయారు. చూడగానే అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఆకట్టుకునే పునర్నవి బిగ్ బాస్ లో మాత్రం మంచి క్రేజ్ అందుకుంది. అందులోనే ఆమె ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కూడా అద్భుతమైన కెమిస్ట్రీని వర్కవుట్ అయ్యేలా చేసింది.

అలాంటి పార్టీలతో షాక్
ఇక పునర్వవి సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు గ్లామరస్ అందాలతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం లండన్ లో ఉన్నత చదువులతో బిజీగా ఉన్న ఆమె అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి వెస్ట్రన్ కల్చర్ స్టైల్ లో పార్టీలు కూడా చేసుకుంటుంది. ఇక ఆమె కొంతమంది అబ్బాయిలతో కూడా కనిపించడంతో సోషల్ మీడియాలో వివిధ రకాల కథనాలు కూడా వైరల్ అవుతున్నాయి.

గే తో పునర్నవి స్నేహం
అయితే రీసెంట్ గా పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్ వార్తలను ప్రసారం చేశాయి. ఆమెకు గత కొంతకాలంగా ఫ్రెండ్స్ ఉన్నారు అని అందులో ఒక అబ్బాయితో ఆమె ప్రేమలో ఉందని అతను గే అని కూడా వివిధ రకాల కథనాలు వెలువడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ప్రెగ్నెన్సీ పై పునర్నవి రియాక్షన్
ఇక ఆ వార్తలపై మరోసారి ఊహించని విధంగా పునర్నవి రియాక్ట్ అయింది.. ఈ వార్తలు అస్సలు నిజం లేదు అని నా గే బెస్ట్ వల్ల నాకు గర్భం వచ్చింది అని యూట్యూబ్ లో వివిధ రకాల వార్తలు ప్రచారం చేశారు అని.. కానీ నేను గత నెలలో అనారోగ్యంతో ఉన్నాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటున్నారు. మీకు అసలు ఏమాత్రం అర్థం కాలేదు యూట్యూబ్ ఫ్రెండ్స్ అంటూ.. ఆమె కౌంటర్ ఇచ్చింది. అలాగే ఆమె తన ఫ్రెండ్ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

టాలీవుడ్ రీ ఎంట్రీ ఎప్పుడు?
పునర్నవి భూపాలం ఆ మధ్య ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అలాగే ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా మళ్లీ సరికొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కూడా కథనాలు వచ్చాయి. కానీ ఇంకా పునర్నవి తన రీ ఎంట్రీ గురించి ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ కూడా చదువు పైనే ఉంది అని పూర్తిస్థాయిలో తన విద్యాభ్యాసం ముగిసిన తరువాత మళ్ళీ సినిమాల గురించి ఆలోచిస్తానని ఈ బ్యూటీ ఆ మధ్య తెలియజేసింది.


Click it and Unblock the Notifications











