బిగ్ బాస్‌లో విచిత్రం: రాహుల్‌కు కోలుకోలేని షాకిచ్చిన పునర్నవి.. అందరి టార్గెట్ అతడే.!

Recommended Video

Paint it red!! Nominations for elimination

బిగ్గెస్ట్ తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ -3లో ఎన్నో కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. అన్ని ఎపిసోడ్లతో పోలిస్తే సోమవారం బిగ్ బాస్ హౌస్‌లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. దీనికి కారణం ఆరోజు ఎలిమినేషన్ ప్రక్రయ జరగడమే. ఎలిమినేషన్ ప్రక్రియ సమయంలో మనసులోని మాటలు బయటకు వస్తాయి కాబట్టి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇది చాలా సార్లు నిరూపణ అయింది. ఇక, తాజాగా ఈ వారం కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ వారం కొంచెం కొత్తగా..

ఈ వారం కొంచెం కొత్తగా..

ఇప్పటికే నాలుగు వారాల్లో ఎలిమినేషన్ ప్రక్రియ నాలుగు రకాలుగా జరిగింది. నలుగురు కంటెస్టెంట్లు కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఇక, ఈ వారం బిగ్ బాస్ సరికొత్త ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్లు తమకు ఇష్టంలేని హౌస్‌మేట్ ముఖంపై ఎరుపు రంగు పూయాల్సి ఉంటుంది. ఇదే ప్రోమోలో కనిపించింది. అదే సమయంలో కారణం కూడా చెప్పాలి.

శివజ్యోతి నేరుగానే...

గత సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగే సమయంలో రోహిణి, శివజ్యోతి చేసిన పొరపాటే ఈ వారం ఎలిమినేషన్‌కు కారణమైంది. వాళ్లిద్దరూ కన్ఫెషన్ రూమ్‌కు వెళ్లొచ్చిన తర్వాత నామినేషన్స్‌ గురించి ఒకరితో ఒకరి సంభాషించకూడదని బిగ్ బాస్ పదే పదే హెచ్చరిస్తున్నా.. శివజ్యోతి, రోహిణిలు పట్టించుకోకుండా గుసగుసలాడటంతో బిగ్ బాస్ ఈ ఇద్దర్నీ హెచ్చరిస్తూ శిక్షవిధించారు. శివజ్యోతి నాలుగోవారం అప్పటికే నామినేట్ కావడంతో రోహిణిని డైరెక్ట్‌గా నామినేట్ చేశారు. ఈవారానికి కాకుండా.. వచ్చే వారానికి కూడా ఇద్దర్నీ డైరెక్ట్‌గా నామినేట్ చేసి షాక్ ఇచ్చారు బిగ్ బాస్. వీరిలో రోహిణి ఎలిమినేట్ అవగా.. శివజ్యోతి హౌస్‌లో కొనసాగుతోంది.

అందరి టార్గెట్ రాహులే

అందరి టార్గెట్ రాహులే

ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో అందరి టార్గెట్ రాహుల్ అని కనిపిస్తోంది. ఆదివారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత వచ్చిన ప్రోమోలో హౌస్‌లోని అందరు కంటెస్టెంట్లు రాహుల్ ముఖానికి రంగు పూయడం కనిపించింది. ఈ పరిణామంతో అతడు తీవ్ర నిరాశకు లోనవుతున్నట్లు స్పష్టమవుతోంది. సోమవారం వచ్చిన ప్రోమోలో కూడా రాహుల్ ముఖంపైనే ఎక్కువ రంగు ఉంది.

పునర్నవి కూడా...

పునర్నవి కూడా...

బిగ్ బాస్ హౌస్‌లో వరుణ్ సందేశ్ - వితిక షేరు తర్వాత అత్యంత దగ్గరగా ఉండే కంటెస్టెంట్లలో పునర్నవి - రాహుల్ జంట ఒకటి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే ఎలిమినేషన్ ప్రక్రియలో పునర్నవి కూడా రాహుల్‌ను నామినేట్ చేసింది. దీన్ని కూడా ప్రోమోలు ప్రత్యేకించి చూపించారు.

చాలా బాధగా ఉంది అంటూనే...

చాలా బాధగా ఉంది అంటూనే...

ఈ ప్రోమోలో పునర్నవి మాట్లాడుతూ.. ‘చాలా బాధగా ఉంది రాహుల్‌ను నామినేట్ చేయడానికి' అంటూ చెప్పుకొచ్చింది. అంతలో జోక్యం చేసుకున్న రాహుల్ ‘నేను అర్థం చేసుకోగలను. దీన్ని స్వీకరిస్తున్నాను' అని పేర్కొన్నాడు. ఇంతలో పునర్నవి ‘నేను పూర్తి చేస్తాను. అప్పటి వరకు మాట్లాడకు' అంటూ సీరియస్ అయింది. ఆ తర్వాత అషు రెడ్డి - హిమజ, పునర్నవి - హిమజకు మధ్య కూడా వాదన జరిగింది. దీంతో ఈ వారం ఎవరు నామినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X