twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరాగ్యంలో పునర్నవి.. పూర్తిగా విసిగిపోయాను కొంత సమయం కావాలి.. బిగ్‌బాస్ బ్యూటీ పోస్ట్ వైరల్

    |

    బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. లేడీ మోనార్క్‌లా బిగ్‌బాస్‌నే ఓ ఆట ఆడుకున్న పునర్నవి హౌస్‌లో బాగానే సందడి చేసింది. రాహుల్ సిప్లిగంజ్‌తో కుదిరిన కెమిస్ట్రీతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. చివరి వరకు జంటగా ఉన్న వీరిద్దరు.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లతో పాటు, బిగ్‌బాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. బయటకు వచ్చిన వీరిద్దరు అదే రేంజ్‌లో కెమిస్ట్రీని కొనసాగించారు. తాజాగా పునర్నవి చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

    ఎక్కడ చూసిన అవే వార్తలు..

    ఎక్కడ చూసిన అవే వార్తలు..

    బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎక్కడ చూసిన రాహుల్-పునర్నవిలకు సంబంధించిన వార్తలే కనిపించేవి. ఒకానొక దశలో వీరిద్దరికీ పెళ్లి కూడా ఫిక్స్ అయిందని వార్తలు కూడా రాసిన సందర్భాలున్నాయి. అయితే తాము మాత్రం మంచి స్నేహితులమేనని వివరణ ఇస్తూ వస్తున్నారు.

    సోషల్ మీడియాలో అంతగా..

    సోషల్ మీడియాలో అంతగా..

    పునర్నవి సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండదు. తన ఫోటోలను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే వాటిపై ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయి. అయితే ఆ మధ్యలో లాంగ్ గ్యాప్ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంటరైన పునర్నవి.. మళ్లీ ఎగ్జిట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

     నేను అందుకు రాలేదు..

    నేను అందుకు రాలేదు..

    తనపై ఎంతో మంది ప్రేమను కురిపించారని అందరికీ థ్యాంక్స్ అని పునర్నవి చెప్పుకొచ్చింది. తాను చేసే పోస్ట్‌లపై కొన్ని సార్లు నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయని, అయితే తాను సోషల్ మీడియాలో ఒకరిని ధూషించడానికి రాలేదని చెప్పుకొచ్చింది. నేనూ ఓ మామూలు మనిషినే, తప్పులుండొచ్చు.. కానీ నేను మిగతా వారి తప్పులను ఎత్తి చూపాలనుకోవడం లేదని తెలిపింది.

    Recommended Video

    Rahul Sipligunj Special Request To KTR | నమ్మి ఎన్నుకుంటే ఇలా చేస్తారా..!!
    నాకు కొంత సమయం కావాలి..

    నాకు కొంత సమయం కావాలి..

    ‘మీరు నాపై చూపిన ప్రేమకు ఈ థ్యాంక్స్ అనేది సరిపోదని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ అనేది కొన్నిసార్లు ఓ విష సాధనం.. నేను పూర్తిగా విసిగిపోయాను.. మళ్లీ కొత్త జీవంపుంజుకోవడానికి నాకు కొంత సమయం కావాల'ని చెప్పుకొచ్చింది.

    English summary
    Punarnavi Bhupalam Getting Hurt For Negative Comments On Instagram. She Says That She Needs Some Couple Of Days To Revive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X