For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పునర్నవి భూపాలం అందాల అరబోత.. ఇంత బోల్డుగా ఎప్పుడూ చూసుండరేమో!

  By Manoj Kumar P
  |

  పునర్నవి భూపాలం.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ షో ద్వారా ఈమె ఎంతో పాపులర్ అయిపోయింది. అంతకు ముందే సినిమాల్లోకి ఎంటర్ అయినప్పటికీ.. ఈ రియాలిటీ షో తర్వాతనే ఆమెకు భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. తనకు తోచిన విషయాన్ని సూటిగా చెబుతూ హౌస్‌లో హాట్ టాపిక్ అయిన ఈ అమ్మడు.. విన్నర్ రాహుల్ సిప్లీగంజ్‌తో వ్యవహరించిన తీరుతో కూడా చర్చనీయాంశం అయింది. బిగ్ బాస్ తర్వాత కూడా ఈమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా హాట్ అవతారంతో ఈమె షాకిస్తోంది. వివరాల్లోకి వెళితే...

  అప్పుడెప్పుడో వచ్చింది.. పేరు మాత్రం రాలేదు

  అప్పుడెప్పుడో వచ్చింది.. పేరు మాత్రం రాలేదు

  అప్పుడెప్పుడో వచ్చిన ‘ఉయ్యాల జంపాల' అనే సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది హాట్ బ్యూటీ పునర్నవి భూపాలం. ఆ తర్వాత శర్వానంద్ నటించిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', ‘పిట్టగోడ', ‘మనసుకు నచ్చింది', ‘ఈ సినిమా సూపర్ హిట్', ‘ఎందుకో ఏమో' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు అంతగా పేరు మాత్రం రాలేదు.

  అందులోకి రావడంతో ఫేమస్ అయిపోయింది

  అందులోకి రావడంతో ఫేమస్ అయిపోయింది

  చాలా కాలంగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ దక్కని పేరు.. బిగ్ బాస్ షోతో సంపాదించుకుంది. స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన సీజన్ -3లో కంటెస్టెంట్‌గా వచ్చిన పున్నూ.. తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేంది. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఊహించని స్థాయిలో ఫాలోయింగ్‌ను సైతం దక్కించుకుంది.

  రాహుల్‌తో ప్రేమాయణం.. పెళ్లి వరకు వెళ్లింది

  రాహుల్‌తో ప్రేమాయణం.. పెళ్లి వరకు వెళ్లింది

  ఇదే బిగ్ బాస్ హౌస్‌లో రాహుల్ సిప్లీగంజ్‌తో పునర్నవి వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాహుల్.. ఆమెతో ప్రేమ విషయాన్ని చెప్పడంతో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని ప్రచారం మొదలైంది. అంతేకాదు, ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని పునర్నవి ఖండించిన విషయం తెలిసిందే.

  బయటకు వచ్చాక.. అక్కడే కనిపిస్తోంది

  బయటకు వచ్చాక.. అక్కడే కనిపిస్తోంది

  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పునర్నవి భూపాలం ఎక్కువగా సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. గతంతో పోలిస్తే ఈ మధ్య ఆమె ఎంతో యాక్టివ్ అయిపోయింది. ఈ క్రమంలోనే తన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తోంది. అంతేకాదు, తన వ్యక్తిగత కెరీర్ సంబంధిత విషయాలను పంచుకుంటోంది. దీంతో పున్నూ ఫాలోవర్లు కూడా భారీగా పెరుగుతున్నారు.

  అప్పటితో పోలిస్తే ఇప్పుడు రెచ్చిపోతోంది

  అప్పటితో పోలిస్తే ఇప్పుడు రెచ్చిపోతోంది

  పునర్నవి కెరీర్ ఆరంభం నుంచి మంచి మంచి పాత్రలే చేసింది. అదే సమయంలో గ్లామర్ విషయంలోనూ పరిమితులు విధించుకుంది. ఇక, ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిందో.. అప్పటి నుంచి ఆ పరిమితులను ఎత్తేసింది. తరచూ గ్లామర్‌గా కనిపిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది.

  Rahul Sipligunj & Punarnavi's Music Album Coming Soon
  క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన పునర్నవి

  క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన పునర్నవి

  తాజాగా పునర్నవికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు డిజైనర్ వేర్స్‌తో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం ఇన్నర్‌వేర్‌తో హల్‌చల్ చేస్తోంది. ఆమె యోగా చేస్తుండగా దిగిన ఈ ఫొటోలో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ ఇన్నర్‌తో ఆమె అందాలను ఒలకబోస్తుంది. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

  English summary
  Punarnavi Bhupalam is Indian actress in Telugu cinema and contestant in a reality TV show Bigg Boss Telugu 3. She was born on 28 May 1996 in Tenali, Guntur District, Andhra Pradesh to Bhagya Lakshmi and Nagesh Kumar Bhupalam. Her great-grandfather Bhupalam Subbarayudu Setty was a freedom fighter from Jammalamadugu, Cuddapah district, Andhra Pradesh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X