twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాతో డేటింగ్ వల్లే నిన్ను సేఫ్ చేశారు.. పునర్నవి షాకింగ్ కామెంట్స్.. బయటకొచ్చిన అన్ సీన్ వీడియో

    |

    Recommended Video

    Rahul Sipligunj & Punarnavi Interesting Talks

    తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి ఎలిమినేషన్ వరకు ఎవరు వస్తారు.. ఎవరు వెళ్లిపోతారు అనేది రహస్యంగానే ఉంటోంది. అయితే, కంటెస్టెంట్ల ప్రవర్తనను బట్టి కాదు.. బిగ్ బాస్ నిర్వహకులు ఎవరిని బయటకు పంపాలనుకున్నారో వారే వెళ్లిపోతారన్న టాక్ కూడా ఉంది. ఇక, గత వారం ఎలిమినేషన్.. తాజా ఎపిసోడ్‌లో పునర్నవి - రాహుల్ సింప్లీగంజ్ మధ్య జరిగిన సంభాషణ దీనికి బలం చేకూర్చుతోంది.

    డేటింగ్ గురించి సంభాషణ

    డేటింగ్ గురించి సంభాషణ

    గత వారం జరిగిన ఓ ఎపిసోడ్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఆ సమయంలో రాహుల్.. పునర్నవిని నీతో డేటింగ్ చేయాలంటే ఏం చేయాలి..? అని అడిగాడు. దానికి సమాధానంగా నేను ఖాళీగా ఉన్నానా లేదా అన్నది తెలుసుకోవా అని పునర్నవి అన్నది. అప్పుడు రాహుల్ నువ్వు డేట్‌లో ఉన్నావా అనగానే ఆమె అవును అని చెప్పింది.

    ప్రస్తావించిన నాగార్జున

    ప్రస్తావించిన నాగార్జున

    పోయిన శనివారం నాగార్జున దీనిపై మాట్లాడాడు. ఆయన చేతిలో ఉండే కోతి.. ఈ మధ్య అతడు డేటింగ్ గురించి మాట్లాడుతున్నాడు బాస్ అంటూ అనగానే అందరూ రాహుల్ వైపు చూశాడు. అప్పుడు రాహుల్ ఏదో సమాధానం చెబుతుండగా.. నాగ్ కలుగజేసుకుని నువ్వు సేఫ్ అయ్యావ్ అని చెప్పడంతో దానికి పుల్‌స్టాప్ పడిపోయింది.

    బిగ్ బాస్ బజ్

    బిగ్ బాస్ బజ్

    బిగ్ బాస్ బజ్ అంటూ స్టార్ మా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ఈ కార్యక్రమంలో గత సీజన్‌లో పాల్గొన్న తనీష్ ఇంటర్వ్యూ చేయడం.. రాత్రి జరిగే ఎపిసోడ్‌లో మిస్ అయిన కంటెంట్‌ను చూపించడం కోసం దీన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో ఉంచుతున్నారు.

    డేటింగ్‌పై చర్చ

    డేటింగ్‌పై చర్చ

    డేటింగ్ విషయమై పునర్నవి - రాహుల్ మధ్య మరో సంభాషణ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను స్టార్ మా విడుదల చేసింది. ఇందులో ‘అందరూ డేటింగ్ డేటింగ్ అంటుంటే నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు. నాగార్జున గారికి కూడా సమాధానం ఎందుకు చెప్పలేదు. అందరూ అంటున్నా సైలెంట్‌గా ఎందుకుంటున్నావ్' అని రాహుల్‌ను ప్రశ్నించింది పునర్నవి.

    రాహుల్ స్పందన

    పునర్నవి ప్రశ్నలకు రాహుల్ సమాధానం చెప్పాడు. ‘నేను నీ పక్కనే ఎప్పుడూ కూర్చోలేదు. నాగ్ సార్‌కు కూడా చెప్పా మాది ప్యూర్ ఫ్రెండ్‌షిప్ అని చెబుతుంటే ఆయన ఆపు ఆపు అన్నారు. ఇప్పుడేమైంది..? ఏమైనా ప్రాబ్లమా..?' అని అనగానే పునర్నవి కొంటె నవ్వు నవ్వింది. అంతలో అక్కడకు వితిక షేరు వచ్చింది.

    వివరించిన వితిక

    వివరించిన వితిక

    వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణను వితకకు వివరించాడు రాహుల్. ‘దీనికి డేటింగ్ కోసం నన్ను ఎలిమినేట్ చేయలేదంట' అని ఆమెకు చెప్పాడు. దీంతో వితిక ‘అప్పుడు నాగ్ సార్ ఏ పదం వాడారో అది చెబుతుందిరా తింగరోడా. ఆయన చేతిలో ఉన్న కోతి అనగానే ఆ పదం చెప్పి నిన్ను సేఫ్ చేశారని పున్ను అంటోంది. మైండ్ పెట్టు' అని వివరించింది. దీంతో రాహుల్ పునర్నవి వైపు చూసి ‘నా లైఫ్‌లో నేను ఏ అమ్మాయి వైపు చూడలేదు గుర్తు పెట్టుకో' అని అన్నాడు. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

    English summary
    Big boss reality show Full success in Telugu Television History. Two seasons succesfully completed. And season 3 Started 21st july. This season Was Host By Akkineni Nagarjuna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X