బాగానే జ్ఞానోదయమైనట్టుంది.. బిగ్‌బాస్‌కి వెళ్లి నేర్చుకుంది అదేనట.. పునర్నవి కామెంట్స్ వైరల్

బిగ్‌బాస్ షో అనేది చూసే వారికి బాగానే వినోదాన్ని పంచుతుంది. కానీ బిగ్ బాస్ హౌస్‌లో ఉండే వారికి మాత్రం అలా ఉండదు. అంతవరకు వారిని చూసిన వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయి.. అప్పటి వరకు వారి మీదున్న అభిప్రాయాలు మారుతుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. మన నిజ స్వరూపాన్ని బట్టలిప్పి మరీ కూర్చుండబెట్టేలా చేస్తుంది. అందుకే బిగ్ బాస్ షో అంటే కొందరు బెదిరిపోతుంటారు. కొందరు మాత్రం ధైర్యంగా ముందడుగు వేస్తుంటారు.

కొందరికి ప్లస్...

కొందరికి ప్లస్...

బిగ్ బాస్ షో కొందరికి మేలు చేస్తుంటే మరి కొందరికి మాత్రం చేటు చేస్తుంది. గడిచిన బిగ్ బాస్ తెలుగు మూడు సీజన్లలో ఎంతో మందికి పాజిటివ్ ఇమేజ్ రాగా.. ఎంతో మందికి నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. అందులో శివ బాలాజీ, హరితేజ, గీతా మాధురి, రాహుల్, వరుణ్, ఆదర్శ్, అమిత్ ఇలా ఎంతో మందికి మంచి పేరు వచ్చింది. వీరంతా తమ మంచితనంతో ఎంతో మంది అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు.

 ఇంకొందరికి బ్యాడ్ ఇమేజ్..

ఇంకొందరికి బ్యాడ్ ఇమేజ్..

బిగ్‌బాస్ ద్వారా నెగెటివ్ ఇమేజ్ వచ్చిన వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. తేజస్వీ, కిరిటీ, దీప్తి సునయన, శ్రీముఖి, మహేష్, హేమ ఇలా ఎంతో మంది ఉన్నారు. అంత వరకు మనం చూసిన వ్యక్తికి, బిగ్ బాస్‌లో ఉన్న వ్యక్తికి ఎంతో తేడా ఉంటుంది. అందుకే చాలా మంది బిగ్ బాస్‌కు నో చెబుతారు.

పునర్నవికి పాజిటివ్..

పునర్నవికి పాజిటివ్..

బిగ్ బాస్ మూడో సీజన్‌లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో పునర్నవి ఒకరు. అయితే ఈ పునర్నవికి అంతకు ముందున్న పాపులారిటీ కంటే వంద రెట్ల క్రేజ్‌ను బిగ్ బాస్ తెచ్చిపెట్టినా.. షోపై సంచలన కామెంట్స్ చేస్తోంది. తాజాగా ఓ ఫ్లకార్డ్‌ను పట్టుకుని పునర్నవి రచ్చ చేస్తోంది.

అదే నేర్చుకున్నా..

అదే నేర్చుకున్నా..

తాజాగా రెండు అట్టపెట్టెలతో పునర్నవి దర్శనమిచ్చింది. అందులో ఒకదాంట్లో బిగ్ బాస్‌కు వెళ్లి ఏం నేర్చుకున్నావ్ పున్ను అని రాసి ఉంది. అయితే పునర్నవి మాత్రం.. బిగ్‌బాస్‌లోకి వెళ్లకూడదని నేర్చుకున్నా అని రాసి ఉన్న అట్టపెట్టెను పట్టుకుంది. ఇదే రియలైజేషన్ (పశ్చాత్తాపం) అంటూ చెప్పుకొచ్చింది.

Recommended Video

Kaushal Manda Breaks His Mobile Gifted By Bigg Boss
తాజాగా ఆ ఈవెంట్‌లో..

తాజాగా ఆ ఈవెంట్‌లో..


వినాయక చవితి సందర్భంగా ‘2020 అనుకున్నది ఒకటి అయింది ఒకటి' అనే ఈవెంట్‌లో రాహుల్, పునర్నవి సందడి చేయబోతోన్నారు. ఇద్దరూ లేచిపోయి వచ్చిన జంటగా.. వారికి పెళ్లి చేసే బాధ్యతను జబర్దస్త్ గ్యాంగ్ తీసుకున్నట్టుగా స్కిట్ చేయబోతోన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి చాలా రోజుల తరువాత రాహుల్, పునర్నవిలు వార్తల్లో నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X