బిగ్ బాస్‌పై పునర్నవి సంచలన వ్యాఖ్యలు: ఊహించని స్టే‌ట్‌మెంట్‌తో షాకిచ్చిన బ్యూటీ

బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సినిమాల్లో నటించినా గుర్తింపు రాని చాలా మంది ఈ రియాలిటీ షో ద్వారా విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో తెలుగు హీరోయిన్ పునర్నవి భూపాలం ఒకరు. గత ఏడాది ప్రసారం అయిన మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. విభిన్నమైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా మారిన పునర్నవి.. తాజాగా బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళితే...

ఆ సినిమాతో ఎంట్రీ... ఆ తర్వాత అవి కూడా

ఆ సినిమాతో ఎంట్రీ... ఆ తర్వాత అవి కూడా

రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘ఉయ్యాల జంపాల' అనే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రను పోషించి టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది హాట్ బ్యూటీ పునర్నవి భూపాలం. ఆ తర్వాత శర్వానంద్ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', ‘పిట్టగోడ', ‘మనసుకు నచ్చింది', ‘ఈ సినిమా సూపర్ హిట్', ‘ఎందుకో ఏమో' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు.

బిగ్ బాస్ షోలోకి ప్రవేశం.. మార్క్ చూపించి

బిగ్ బాస్ షోలోకి ప్రవేశం.. మార్క్ చూపించి

గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ మూడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది పునర్నవి. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే తన మార్క్ చూపిస్తూ ప్రేక్షకులను తన వైపునకు తిప్పుకుంది. ముక్కుసూటితనంతో పలు గొడవల్లో భాగమైనప్పటికీ.. ఆమె నిజాయితీకి మంచి పేరు వచ్చింది. అయినా ఈ షోలో చివరి వరకూ కొనసాగని ఆమె మధ్యలోనే ఎలిమినేట్ అయింది.

సింగర్‌తో ప్రేమాయణం.. బయటా రచ్చ రచ్చ

సింగర్‌తో ప్రేమాయణం.. బయటా రచ్చ రచ్చ

బిగ్ బాస్ హౌస్‌లో తనదైన శైలితో వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్న పునర్నవి.. సింగర్ రాహుల్ సిప్లీగంజ్ విషయంలో విమర్శలను ఎదుర్కొంది. హౌస్‌లో అతడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు నడిస్తూ తరచూ వార్తల్లో నిలిచింది. షోలోనే కాదు.. బయట కూడా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ రచ్చ రచ్చ చేశారు. దీంతో వీళ్లకు పెళ్లి కూడా జరగబోతుందని జోరుగా ప్రచారం జరిగింది.

ఎంగేజ్‌మెంట్ పిక్‌తో షాకిచ్చిన ముద్దుగుమ్మ

ఎంగేజ్‌మెంట్ పిక్‌తో షాకిచ్చిన ముద్దుగుమ్మ

కొద్ది రోజుల క్రితం ఓ సినీ నటుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నానని చెబుతూ పునర్నవి సోషల్ మీడియాలో ఓ ఫొటోను వదిలింది. ఇది వైరల్ అయిపోయింది. ఆ తర్వాత ఈ పిక్ ‘కమిట్ మెంటల్' అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమని వెల్లడించి షాకిచ్చింది. ఆహా వీడియో రూపొందించిన ఈ సిరీస్‌ రఘునందన్ హీరోగా నటించాడు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

బిగ్ బాస్‌ షోపై పునర్నవి సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్‌ షోపై పునర్నవి సంచలన వ్యాఖ్యలు

బిగ్ బాస్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది హీరోయిన్ పునర్నవి భూపాలం. అయితే, షో వల్ల వచ్చిన క్రేజ్‌ను తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఆమె సక్సెస్ కాలేదు. ఓ వైపు పలువురు కంటెస్టెంట్లు వరుస ఆఫర్లు దక్కించుకుంటుంటే ఈమె మాత్రం ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ వల్ల తనకు లాభం జరగలేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఊహించని స్టే‌ట్‌మెంట్‌తో వార్తల్లో నిలిచిన భామ

ఊహించని స్టే‌ట్‌మెంట్‌తో వార్తల్లో నిలిచిన భామ


తాజాగా జరిగిన చిట్ చాట్‌లో పునర్నవి మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌పై బిగ్ బాస్ ఏమాత్రం ప్రభావం చూపలేదు. అంతేకాదు, ఈ షో నాకు అవకాశాలను కూడా అందించలేదు. సోషల్ ప్రొఫైల్ పెంచుకోవడంలోనూ ఇది నాకు అస్సలు ఉపయోగడపలేదు. కానీ, దీని వల్ల జరిగిన మంచి ఏమిటంటే ఫ్యాన్స్‌కు దగ్గరవడానికి మాత్రం దారి చూపించింది' అంటూ షాకింగ్‌గా స్పందించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X