బిగ్‌బాస్ 3 తెలుగు ఫినాలె : పెళ్లి సంబంధాలు పెరిగాయి.. మా సంబంధం అలాంటిదే
జూలై 21న మొదలైన బిగ్‌బాస్ మూడో సీజన్ నవంబర్ 3న ముగిసేందుకు వచ్చింది. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఎవ్వరూ ఊహించని రీ ఎంట్రీ, ఈ మూడో సీజన్‌కు హైలెట్‌గా నిలిచిన స్పెషల్ హోస్ట్ రమ్యకృష్ణ, తనస్టైల్లో సీజన్‌ను విజయవంతం చేసిన నాగార్జున ఇలా ఎన్నో విశిష్టతలతో కూడిన బిగ్‌బాస్ మూడో సీజన్‌కు వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది.
ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ ఫినాలే ఎపిసోడ్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎంతో మంది వెండితెర తారలు, బుల్లితెర నటీనటులు తమ ఆటపాటలతో అలరిస్తున్నారు. ఈసీజన్‌కు విన్నర్‌గా నిలిచే కంటెస్టెంట్‌కు ఓ ప్రత్యేకమైన అతిథి చేతుల మీదుగా టైటిల్, కప్పును అందజేయనున్నారు. అంతకంటే ముందు బిగ్‌బాస్ వీక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అతిరథమహారథులు వారి ఆటపాటలతో అందర్నీ మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ ఫినాలె ఎపిసోడ్ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

మా సంబంధం అలాంటిదే
బిగ్‌బాస్ కంటెస్టంట్లందరిని పలకరిస్తూ నాగ్.. వారి మనోభావాలను అడిగి తెలుసుకున్నాడు. ఎలిమినేట్ అయి బయటకు వెళ్లాక తమ జీవితం ఎలా ఉందని అందరిని అడిగారు. సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నానని హిమజ, లేడీ ఫాలోయింగ్ పెరిగిందని జాఫర్, తనను తోపు అంటున్నారని హేమ, పెళ్లి సంబంధాలు పెరిగాయని రవికృష్ణ, బిగ్‌బాస్‌తో గుర్తింపు పెరిగిందని రోహిణి, వరుణ్‌కు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ బిజీగా ఉన్నానని వితికా చెప్పుకొచ్చింది. లోపలికి వెళ్లాక కూడా రాహుల్‌ను తిట్టడం అవసరమా? అని నాగ్ ప్రశ్నించగా.. మా సంబంధం అలాంటిదేనని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











