సిల్లీగా ఉందంటూనే చీప్‌ పని చేసిన పునర్నవి.. అలీ రేజాపై నిందలు.. హగ్గిచ్చి వదిలాడు

'బిగ్ బాస్' సీజన్ - 3.. గత రెండు సీజన్లతో పోలిస్తే ఇప్పుడు ఈ షోపై చాలా మందిలో వ్యతిరేకత ఉంది. దీనికితోడు, ఇద్దరు సెలెబ్రిటీలు శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా నిర్వహకులపై ఆరోపణలు చేయడం.. వారికి ఊహించని స్థాయిలో మద్దతు దొరకడం.. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుతో పాటు దేశ రాజధాని ఢిల్లీ వరకు వెళ్లడం వంటి కారణాలతో ఈ షో భారీ స్థాయిలో పాపులర్ అయిపోయింది. ఎన్నో అవాంతరాలను దాటుకుని ప్రారంభమైంది సీజన్ - 3. ఇది మొదలై వారం రోజులు కూడా కాకముందే హౌస్‌లో మామూలు రచ్చ జరగడం లేదు. రోజుకో గొడవతో 'బిగ్ బాస్'కు ఊహించని స్థాయిలో ప్రమోషన్ దొరుకుతుంది.

 గురువారం రచ్చ రచ్చ

గురువారం రచ్చ రచ్చ

ఇక, గురువారం ఎపిసోడ్ విషయానికొస్తే.. షో చూపించిన గంటలో నాలుగు గొడవలే ఉన్నాయి. అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు..? ఎందుకు సీరియస్ అవుతున్నారు..? ఎందుకలా ప్రవర్తిస్తున్నారు..? వంటివి తెలియకుండానే గొడవలు మాత్రం జరిగిపోతున్నాయి. దీంతో షో నిర్వహకులు ఏం ఆశిస్తున్నారో.. అవే జరుగుతుండడంతో పండగ చేసుకుంటున్నారు.

చపాతి ముక్క కోసం గొడవ

చపాతి ముక్క కోసం గొడవ

గురువారం ఎపిసోడ్‌లో ఎన్ని గొడవలు జరిగినప్పటికీ, విజయవాడ అమ్మాయి పునర్నవి భూపాలం చేసిన పని, ప్రేక్షకుల్లో ఒకింత అసహనం కలిగించినప్పటికీ, నవ్వు కూడా తెప్పించింది. ఇంతకీ ఆమె ఏం చేసిందనే కదా మీ సందేహం..? చిన్న చపాతీ ముక్క కోసం గొడవ చేసింది. అవును.. ఆమె చపాతిని ఎవరో తినేశారని రచ్చ రచ్చ చేసింది.

ఊగిపోయిన పునర్నవి

ఊగిపోయిన పునర్నవి

చపాతి ముక్క తిన్నారని గొడవ చేస్తుండగా, ఎవరో అలీ రేజా తిన్నాడని చెప్పారు. దీంతో అతడిని ఉద్దేశిస్తూ పునర్నవి తిట్టసాగింది. సిల్లీగా ఉంది చపాతి ముక్క కోసం గొడవ పెట్టుకుంటామా? అంటూనే ఊగిపోయింది. ఇంతలో హేమ.. అలీ దగ్గరకు వెళ్లీ మరీ, ‘నువ్ చపాతీ తినేశావని వాళ్లు అనుకుంటున్నారు' అంటూ అలీకి చెప్పింది.

అలీ వచ్చి క్లారిటీ ఇవ్వబోతే

అలీ వచ్చి క్లారిటీ ఇవ్వబోతే

హేమ చెప్పడంతో లోపలికి వచ్చిన అలీ.. తాను చపాతిని తినలేదని చెప్పే ప్రయత్నం చేసినా.. పునర్నవి వినిపించుకోలేదు. రాహుల్ తిననంటే అతడి చపాతీని నేను తిన్నానని క్లారిటీ ఇవ్వబోయాడు. అయినా.. ఆమె తగ్గలేదు. ఇంతలో పక్కనే ఉన్న వాళ్లు బాబా భాస్కర్ రెండు చపాతీలు తిన్నారు అంటూ అన్నారు.

బాబా భాస్కర్ వచ్చి క్లారిటీ

బాబా భాస్కర్ వచ్చి క్లారిటీ

అప్పుడే బయటి నుంచి వచ్చిన బాబా భాస్కర్.. రెండు చపాతీలు తిన్నా. కర్రీ బాగుంది అని తనదైన శైలిలో కామెడీ చేయడంతో.. గొడవకు కారణమైన చపాతీ సుందరి పునర్నవి అయ్యో మీరు తిన్నారా? అనవసరంగా నేను అలీని అనేశానే అని నాలుక కర్చుకుంటూనే మిగిలిని చపాతీని లాగించేసింది.

అలీ లైట్ తీసుకోవడంతో..

అలీ లైట్ తీసుకోవడంతో..

పునర్నవి చేసిన రచ్చకు అలీ గొడవ పెట్టుకుంటాడని చాలా మంది అనుకున్నారు. కానీ, అతడు మాత్రం సారీ చెప్పగానే చిన్న హగ్గిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో చపాతీ గొడవకు పుల్‌స్టాప్ పడిపోయింది. అక్కడ ఏమీ గొడవ జరగకపోవడంతో హౌస్‌మేట్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, దీనికి ‘బిగ్ బాస్' మాత్రం నిరాశ చెంది ఉంటాడనడంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X