పెళ్లి ఎప్పుడు.. రాహుల్‌తో రిలేషన్ ఏంటి?.. నెటిజన్ల ప్రశ్నలకు పునర్నవి ఘాటు రిప్లై!!

బిగ్‌బాస్ మూడో సీజన్‌లో ఓ ఫార్మూలా వర్కౌట్ అయిందే. అదే రాహుల్-పునర్నవి మధ్య ఉన్న రహస్య బంధం. అది చూసే జనాలకు ప్రేమలా అనిపించొచ్చు. కానీ తాము కేవలం స్నేహితులమే అని చెబుతూ వస్తోన్న రూమర్లను కొట్టిపారేస్తూ వస్తున్నారు. మూడో సీజన్ అయిపోయి ఏడాది అవుతోండగా.. నాల్గో సీజన్ సందడి చేస్తున్నా కూడా ఇంకొందరు అదే టాపిక్ వద్ద అక్కడే ఆగిపోయారు. నిత్యం వాటిపై ప్రశ్నలు సంధిస్తూ చిరాకు పెడుతుంటారు.

ఆ మధ్య రాహుల్‌ను కూడా..

ఆ మధ్య రాహుల్‌ను కూడా..

రాహుల్ ఆ మధ్య ఓ సారి తన ఫాలోవర్స్‌తో చిట్ చాట్ చేశారు. ఇక చాలా మంది పునర్నవి గురించి అడగడంతో చిరాకు పడ్డాడు. ‘స్క్రీన్ మీద కనిపించేవి నిజాలు కాదు. ప్రతీ ఒక్కరికీ తమదైన జీవితం ఉంటుంది. బిగ్‌బాస్ ముగిసింది. ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ముందుకుపోతున్నారు. కాబట్టి మీ అందరికీ చెబుతున్నా.. చిల్ అవ్వండి. మళ్లీ అలాంటి ప్రశ్నలతో నన్ను చంపకండి'అని కాస్త అసహనాన్ని ప్రదర్శించాడు.

ప్రతీసారీ అంతే..

ప్రతీసారీ అంతే..

ఇలా వీరిద్దరు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా పదే పదే అదే ప్రశ్నల ఎదురువుతుంటాయి. మీ ఇద్దరి మధ్య ఏముంది? మీకు పెళ్లి ఎప్పుడు వంటి ప్రశ్నలతో నెటిజన్లు విసిగెత్తిస్తుంటారు. తాజాగా పునర్నవికి మళ్లీ ఇలాంటి పరిస్థితే అలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. ఈ సారి పునర్నవి మరింత ఘాటుగా స్పందించింది.

రాహుల్‌తో రిలేషన్..

రాహుల్‌తో రిలేషన్..

బోర్ కొడుతోంది.. ఏవైనా ప్రశ్నలు అడగండి సమాధానాలు చెబుతాను అంటూ పునర్నవి సోషల్ మీడియాలో ఓ సెషన్ మొదలుపెట్టింది. తలా ఒకరు వారికి నచ్చిన ప్రశ్నలు అడిగారు. అందులో ఒకరు రాహుల్‌తో నీకు ఉన్న రిలేషన్ ఏంటి అని అడిగేశాడు. ఈ ప్రశ్నకు చిర్రెత్తిపోయిన పునర్నవి.. మీది మీరు కడుక్కోండి అంటూ కాస్త ఘాటుగా బదులిచ్చింది.

Recommended Video

Psycho Varma: Pichodi Chetilo Rayi Song Teaser | Natti Kranthi
మీ పెళ్లెప్పుడు..

మీ పెళ్లెప్పుడు..

అలా రాహుల్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైందో లేదో.. వెంటనే పెళ్లికి సంబంధించిన మరో ప్రశ్న ఎదురైంది. మీ పెళ్లి ఎప్పుడు అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. ఇక ఈ ప్రశ్నతో మరింత విసుగు చెందిన పునర్నవి ఓ రేంజ్‌లో సెటైర్ వేసింది. ప్రతీసారి ఇలాంటి బ్యాచ్ ఒకటి వస్తుంది.. ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు.. పెళ్లి చేసుకునేటప్పుడు మీ అందరికీ కచ్చితంగా వెడ్డింగ్ కార్డ్స్ పంపిస్తా..అంటూ అసహనానికి లోనైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X