BiggBoss 3 nominations: వాడు వేస్ట్ ఫెలో: రాహుల్‌పై పునర్నవి ఫైర్, శివజ్యోతికి షాకిచ్చిన బిగ్‌బాస్

బిగ్‌బాస్‌లో ఎప్పటిలానే ప్రతీ సోమవారం మాదిరిగానే నామినేషన్ ప్రక్రియ జరిగింది. నామినేషన్ ప్రక్రియకు ముందు రాహుల్, పునర్నవి మధ్య అఫైర్‌కు సంబంధించిన చిన్నపాటి అంశంపై వితిక, వరుణ్ మధ్య చర్చ జరిగింది. ఎడమొగం, పెడమొగంగా ఉంటున్నరాహుల్, పునర్నవిని కలిపేందుకు వరుణ్ ప్రయత్నించాడు. అయితే ఇంకా ఇంటిలో సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

రాహుల్, పునర్నవి అఫైర్

రాహుల్, పునర్నవి అఫైర్

గత కొద్దిరోజులుగా రాహుల్, పునర్నవి మధ్య మాటలు సరిగా లేనట్టు వరుణ్‌తో మాటల్లో అర్ధమైంది. తనతో మాట్లాడటం లేదని పునర్నవి గురించి రాహుల్ చెప్పడంతో కొంత చర్చ జరిగింది. రాహుల్‌తో పునర్నవి మాట్లాడించేందుకు ప్రయత్నాలు చేశాడు వరుణ్ సందేశ్. ఆ క్రమంలోనే రాహుల్ బాధపడుతున్నట్టు చెప్పి మాట్లాడించే ప్రయత్నం చేశారు.

వరుణ్ రాయబారం

వరుణ్ రాయబారం

వరుణ్ సందేశ్ మాటలతో కొంత కరిగిపోయిన పునర్నవి మాట్లాడేందుకు లాన్‌లోకి వచ్చింది. అయితే లాన్‌లో హ్యపీగా, జాలీగా, నవ్వుతూ ఉండటంతో పునర్నవికి మళ్లీ కోపం వచ్చింది. వెంటనే రాహుల్ చూసి.. వాడు వేస్ట్ ఫెలో.. వాడితో నేను మాట్లాడను అంటూ పునర్నవి వెళ్లిపోయింది. పునర్నవి విసవిసను చూస్తూ రాహుల్ పకపక నవ్వాడు. వరుణ్‌కు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

ఎలిమినేట్ కావాలని ఉందని

ఎలిమినేట్ కావాలని ఉందని

అనంతరం వితిక, వరుణ్‌తో మాట్లాడుతూ తనలో బాధను వెళగక్కింది. నాకు ఇంట్లో ఉండటం చికాకుగా ఉంది. నేను ఇక ఇంటిలో ఉండలేను. నాకీ పరిస్థితులు నచ్చడం లేదు. ఇక నేను ఎలిమినేట్ అయితే హ్యాపీగా ఉంటాను. ఇప్పటి వరకు ఇంటిలో ఉంది చాలూ అంటూ పునర్నవి వాపోయింది. అయితే బాధలో ఉన్న పునర్నవిని వితిక ఊరడించే ప్రయత్నం చేసింది.

నామినేషన్ పక్రియలో

నామినేషన్ పక్రియలో

ఇక ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇంటి సభ్యుల్లోని 11 మందిలో కెప్టెన్ శివజ్యోతిని మినహాయించింది ఇద్దరిద్దరిని జట్టుగా మారమన్నాడు బిగ్‌బాస్. ఇద్దరిని ఓ బురద బకెట్లు ఉన్న తాడును పట్టుకొని నిలబడమన్నారు. అలా నిలబడిన ఇద్దరిలో ఒకరిని నామినేట్ చేయాలని కోరారు.

నలుగురు నామినేట్

నలుగురు నామినేట్

ఈ నామినేషన్ పక్రియలో ముందుగా పునర్నవి, రవికృష్ణ, మహేష్, హిమజలను ఎక్కువ మంది నామినేట్ చేశారు. ఇంటిలోని అందరు సభ్యులు రవికృష్ణను నామినేట్ చేయడం గమనార్హం. నామినేషన్ పక్రియ ముగిసిందని అనుకుంటే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చారు. నామినేట్ కాని వారిలో నుంచి ఒక్కరిని కెప్టెన్ పవర్‌ను ఉపయోగించి నామినేట్ చేయాలని శివజ్యోతికి సూచించారు.

శివజ్యోతితో ఇరుకున పడ్డ వరుణ్ సందేశ్

శివజ్యోతితో ఇరుకున పడ్డ వరుణ్ సందేశ్

బిగ్‌బాస్ సూచనతో శివజ్యోతి ఇరుకున పడింది. నామినేట్ కాని వారిలో శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, వితిక, అలీ ఉండటంతో ఆలోచనలో పడింది. చివరికి శ్రీముఖి, బాబా భాస్కర్, వితిక, అలీని వారి సామర్ధ్యాన్ని బట్టి సేఫ్ చేసింది. టాస్క్‌లో బలహీనంగా ఉన్నందున వరుణ్ నామినేట్ చేసింది. దాంతో నామినేషన్ ప్రక్రియలో ఈ వారం పునర్నవి, రవికృష్ణ, మహేష్, హిమజతోపాటు వరుణ్ సందేశ్ కూడా చేరిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X