చెప్పు చూపించిన పునర్నవి.. పోరి కోపంలో కూడా అంటూ రాహుల్.. కెమిస్ట్రీ అదుర్స్!

Recommended Video

Bigg Boss Telugu 3: బాబా శాపంతో శిల్ప అవుట్!! | Episode 57 Highlights | Filmibeat Telugu

హోస్ట్‌గా నాగార్జున బిగ్‌బాస్ రియాలిటీ షోను సందడిగా మార్చేశాడు. ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉండటంతో ఇంటి సభ్యులను మొదట ఆనందంలో ముంచెత్తి.. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియను పూర్తి చేశాడు. హోస్ట్ నాగార్జున ఎపిసోడ్ ప్రారంభిస్తూ ఇంటి సభ్యులతో స్కిట్స్‌ను ఆడించాడు. ఇంటిలో రెండు రకాల ఆటలను ఆడించి ఇంటి సభ్యులను ఉత్తేజ పరిచారు. వారాంతం ఇలా హ్యాపీగా గడిచిపోయింది. స్కిట్‌లో భాగంగా పునర్నవి, రాహుల్ కెమిస్ట్రీ ఎలా ఉందంటే..

కోపంలో ఎంత అందంగా..

కోపంలో ఎంత అందంగా..

ఎప్పుడొస్తదబ్బా.. ఈ పిల్ల అంటూ పునర్నవి కోసం రాహుల్ ఓ చోట వెయిట్ చేస్తుంటాడు. అంతలోనే అక్కడికి వచ్చి చెప్పు ఎందుకు రమ్మన్నావు అంటుంది. దానికి రాహుల్ సమాధానం ఇస్తూ.. నీవు మాట్లాడుతావా.. నేను మాట్లాడాలా అని అంటే.. పునర్నవి ఏం మాట్లాడాలి అని కసురుకొన్నది. ఏం మాట్లాడాలో అర్ధం కాక.. ‘కమ్మలు ఎక్కడ కొన్నవు.. కోఠిలో కొన్నావా?' అంటే ఇందుకేనా పిలిచింది అంటూ షాక్ ఇచ్చింది. దానికి రాహుల్ సమాధానం ఇస్తూ ‘కోపంలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటే తెలియనప్పుడే ఎంత పొగరు ఉంటే.. తెలిస్తే ఇంకెంత ఉంటుందో' అని రాహుల్ ఝలక్ ఇచ్చాడు.

రాహుల్‌కు పునర్నవి వార్నింగ్

రాహుల్‌కు పునర్నవి వార్నింగ్

ఇంతకు నన్ను ఎందుకు పిలిచావు. నాకు వేరే పనులు ఉన్నాయి. 10 నిమిషాలు సమయం ఇస్తున్నా.. ఏం చెప్పాలో అది చెప్పు అని పునర్నవి వార్నింగ్ ఇచ్చింది. అందుకు ‘నిన్ను ఎందుకు పిలిచానంటే.. నిన్ను లైన్‌లో పెట్టడానికి అంటూ రాహుల్ అన్నాడు. అంతేకాకుండా వెంట్రుకలకు రంగు వేశావా? ఇంతకు నీ వయసు ఎంత.. నీ చెప్పు సైజు ఎంత అని రాహుల్ ప్రశ్నలు కురిపించాడు. దాంతో పునర్నవి చెప్పు చూపించింది.

కొవ్వు బాగా ఉందే

కొవ్వు బాగా ఉందే

నీ మాటలు చూస్తుంటే నీకు కొవ్వు బాగా ఉన్నదనిపిస్తుంది. నీ ఒళ్లంతా కొవ్వే.. బ్రెయిన్ అంతా కొవ్వే అంటూ రాహుల్‌పై తిట్ల వర్షం కురిపించింది. చెత్త విషయాలు పక్కన పెట్టి అసలు చెప్పు.. నన్ను ఎందుకు పిలిచావు అంటూ మళ్లీ అడిగింది. ఈ మధ్యలో హోస్ట్ నాగార్జున కల్పించుకొని రీచార్జ్ చేయి అంటే.. రీఛార్జ్ అవుతావా? అని రాహుల్ మజాక్ చేశాడు.

రీచార్జ్ అవుతావా అంటూ

రీచార్జ్ అవుతావా అంటూ

దాంతో కాఫీకి పిలిచి రీఛార్జ్ చేస్తావా.. ఏంట రా నువ్వు రీచార్జి చేసేది.. కాఫీకి పిలిచి ఇలానే రా లైన్ వేసేది. కోపంలో కూడా పోరి క్యూట్‌గా ఉంది అంటూ ఆటపట్టించాడు. వారిద్దరి మధ్య చిలిపిగా, సరదాగా గిల్లికజ్జాలు స్కిట్‌లో కనిపంచాయి. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఫన్‌ను క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X