మల్లెమాల టీం ఎత్తుగడ .. ఆర్పీ విమర్శలకు కొత్త వ్యక్తితో కౌంటర్.. ఏకంగా షోలోనే క్లారిటీ!

కొంతకాలం క్రితం మల్లెమాల సంస్థ పైన ఆ సంస్థ అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డి పైన ఒకప్పుడు జబర్దస్త్ లో కామెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న కిరాక్ ఆర్పీ చేసిన ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అక్కడ భోజనం బాగోదు అని మొదలుపెట్టిన ఆర్పీ అనేక సంచలన ఆరోపణలు గుప్పించారు. అయితే ఆర్పీ చేసిన ఆరోపణలు నిజం కాదని ఇప్పటికే జబర్దస్త్ లో కొంత మంది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మల్లెమాల సంస్థ స్వయంగా ఒక వ్యక్తిని తెర మీదకి తీసుకు వచ్చింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

జబర్దస్త్ ఎంట్రీ

జబర్దస్త్ ఎంట్రీ


హోటల్ లో సర్వర్ గా పని చేస్తూ ఎలాగో ప్రయత్నం చేసి జబర్దస్త్ ఎంట్రీ సంపాదించాడు ఆర్పీ. మొత్తం మీద జబర్దస్త్ లో టీం లీడర్ స్థాయికి వెళ్ళిన తర్వాత ఆయన జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు. ఏకంగా దర్శకుడిగా మారిన ఆయన సినిమా ఆగిపోవడంతో మళ్లీ టీవీ షోస్ లో కనిపిస్తున్నారు. అయితే ఈ మధ్యనే ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని త్వరలోనే వివాహానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒక యూట్యూబ్ ఛానల్ ఆయనతో ఇంటర్వ్యూ నిర్వహించింది.

 స్వలాభం కోసం

స్వలాభం కోసం


ఈ ఇంటర్వ్యూలో ఆయన మల్లెమాల సంస్థ పైన సంస్థ నిర్వాహకులు అలాగే సంస్థ అధినేత అయిన శ్యాం ప్రసాద్ రెడ్డి మీద అనేక సంచలన ఆరోపణలు చేశారు. మల్లెమాలలో భోజనం కంటే చర్లపల్లి, చంచల్గూడా జైలులో ఖైదీలకు పెట్టే భోజనం బాగుంటుంది అంటూ ఆయన సంచలన ఆరోపణలు గుప్పించారు. అంతేకాక మల్లెమాల సంస్థ చేసేది వ్యాపారం అని కేవలం వారి స్వలాభం కోసం చూసుకుంటారు తప్ప జబర్దస్త్ కమెడియన్లు ఏమైపోయినా వాళ్ళకి అవసరం లేదు అంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు.

జాతి రత్నాలు షో ప్రోమోలో

జాతి రత్నాలు షో ప్రోమోలో


అంతేకాక పంచ్ ప్రసాద్ అనే వ్యక్తికి కిడ్నీ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా నాగబాబు స్వయంగా ముందుకు వచ్చి సహాయం చేశారు. కానీ మల్లెమాల సంస్థ ఇప్పటికీ సహాయం చేయకుండా తిప్పించుకుంటుంది అంటూ ఆయన ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఇప్పుడు పంచ్ ప్రసాద్ చేత ఈ విషయం మీద క్లారిటీ ఇప్పించే ప్రయత్నం చేశారు. ఇటీవల ప్రసారమైన జాతి రత్నాలు షో ప్రోమోలో ఈ విషయాన్ని చూపించారు .

 తినే గ్యాప్లో

తినే గ్యాప్లో


ప్రోమో ఐదు నిమిషాలు ఆసక్తికరంగా సాగింది. ఇక తరువాత నూకరాజు తన పక్కన పంచ్ ప్రసాద్ ను కూర్చోబెట్టుకుని ఇప్పుడు మీరు పని చేస్తున్న సంస్థ మీద చాలా మంది రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ భోజనం బాగోదంట కదా అంటూ మొదలు పెట్టడంతో దానికి పంచ్ ప్రసాద్ స్పందిస్తాడు. తినే గ్యాప్లో అంటూ మొదలుపెట్టి ఏవేవో సంచలన విషయాలు బయటపెట్టినట్లు ప్రోమో కట్ చేశారు.

టీఆర్పీల కోసమే

టీఆర్పీల కోసమే


సాధారణంగా ఆయన ఇప్పుడు జబర్దస్త్ టీంతో ట్రావెల్ అవుతున్నాడు కాబట్టి ఆర్పీ చేసిన ఆరోపణలు ఎన్ని నిజం కాదని ఇది జబర్దస్త్ వల్లే తనకు లైఫ్ వచ్చిందని చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ టిఆర్పి రేటింగ్స్ కోసం పాకులాడుతున్న మల్లెమాల సంస్థ మరోసారి టీఆర్పీల కోసమే ఈ ప్రోమో కట్ చేయించింది అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X