For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుమకు చుక్కలు చూపించిన కమెడియన్: కోపంతో చేతిలో కార్డ్స్ విసిరేసిన టాప్ యాంకర్

    |

    తెలుగు బుల్లితెరపై దాదాపు రెండు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోంది సుమ కనకాల. లొడలొడ మాట్లాడడంతో పాటు అద్భుతమైన టైమింగ్‌తో పంచులు వేస్తూ సత్తా చాటుతుందామె. ఇలా ప్రతి దాన్ని తనదైన శైలి హోస్టింగ్‌తో వన్ ఉమెన్ షోగా మార్చుకుంటోంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ జబర్ధస్త్ కమెడియన్.. ఓ క్రేజీ షోలో ఏకంగా టాప్ యాంకర్ సుమ కనకాలకే చుక్కలు చూపించాడు. దీంతో ఆమె కోపంతో ఊగిపోయింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

    ఎక్కడ చూసినా సుమనే కనిపిస్తోంది

    ఎక్కడ చూసినా సుమనే కనిపిస్తోంది

    ఎంతో కాలంగా తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోన్న సుమ కనకాల.. ఎవరికీ సాధ్యం కాని రితిలో దూసుకెళ్తోంది. అదే సమయంలో సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లను ఆమెనే హోస్ట్ చేస్తోంది. సుమకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ వల్లే ఇది సాధ్యమవుతోంది. ఇవి మాత్రమే కాదు... వ్యాపార ప్రకటనలో పాటు యూట్యూబ్ వీడియోలతో సత్తా చాటుతూ తన స్టామినాను చూపిస్తోంది.

    సుమ కెరీర్‌లోనే ఇది ప్రత్యేకమైనదిగా

    సుమ కెరీర్‌లోనే ఇది ప్రత్యేకమైనదిగా

    సుదీర్ఘమైన కెరీర్‌లో సుమ ఎన్నో షోలను హోస్ట్ చేసింది. ఆమె బెస్ట్ షోలలో ‘క్యాష్' ఒకటి. ఇందులో సినీ, టెలివిజన్ ప్రముఖులు గెస్టులుగా వస్తారు. ఇందులో ఈ యాంకరమ్మ చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. అందుకే ఈ షోకు సంబంధించిన ప్రోమోలు, ఎపిసోడ్ వీడియోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుండడంతో ట్రెండ్ అవుతున్నాయి. అలాగే టీవీలో రేటింగ్ భారీగా వస్తోంది.

    కమెడియన్ల ఫ్యామిలీలతో సుమ రచ్చ

    కమెడియన్ల ఫ్యామిలీలతో సుమ రచ్చ

    వచ్చే వారం ప్రసారం కానున్న ‘క్యాష్' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో పంచ్ ప్రసాద్, జబర్ధస్త్ నూకరాజు, జబర్ధస్త్ ఇమాన్యూయేల్, జబర్ధస్త్ బాబులు గెస్టులుగా వచ్చారు. వీళ్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. వాళ్లందరితో సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. కడుపుబ్బా నవ్వించే విధంగా ఉన్న ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

    షోలోనే హైలైట్ అయిన పంచ్ ప్రసాద్

    షోలోనే హైలైట్ అయిన పంచ్ ప్రసాద్

    వచ్చే వారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్‌ అందరిపై పంచులు వేస్తూ కనిపించడంతో అతడినే బాగా హైలైట్ చేశారు. మాట మాటకూ అద్భుతమైన టైమింగ్‌తో సెటైర్లు వేస్తూ కడుపుబ్బా నవ్వించాడు. మరీ ముఖ్యంగా యాంకర్ సుమను కూడా ఆడుకున్నాడు. దీంతో ప్రసాద్‌కు మద్దతుగా ప్రేక్షకులంతా కామెంట్లు పెడుతుండడం విశేషం.

    సుమకు చుక్కలు చూపించిన ప్రసాద్

    ఈ ప్రోమో మొత్తంలో ఎన్నో పంచులు వేశాడు ప్రసాద్. మరీ ముఖ్యంగా వాళ్ల అమ్మతో ఆన్సర్ ‘D' అని చెప్పమన్నాడు. ఆమె అలాగే చెబితే.. ‘ఇది ఢీ షో కాదమ్మ.. క్యాష్ అని' తల్లికే సెటైర్ వేశాడు. ఆ తర్వాత ఇమాన్యూయేల్ మీద, వాళ్ల మదర్ మీద, బాబు తండ్రి మీద పలు రకాల పంచులు వేసి మెప్పించాడు. ఈ క్రమంలోనే మొత్తం మీద యాంకర్ సుమకు చుక్కలు చూపించేశాడతను.

    Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma
    కోపంతో చేతిలో కార్డ్స్ విసిరేసిన సుమ

    కోపంతో చేతిలో కార్డ్స్ విసిరేసిన సుమ

    చివర్లో నూకరాజు తన అన్న గురించి ఎమోషనల్‌గా చెప్పాడు. ఆ తర్వాత ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఈయన నా మేనమామ. ఈయన వల్లే నేను ఈ స్టేజ్‌కు వచ్చాను. థ్యాంక్యూ మామయ్య. ఒకవేళ ఈయన హెల్ప్ చేయకపోతే ఇంకా గొప్ప పొజిషన్‌లో ఉండేవాడినేమో' అని పంచ్ వేశాడు. దీంతో అంతా నువ్వుకోగా.. సుమ మాత్రం చేతిలో ఉన్నా కార్ట్ విసిరేసి మరీ తనలో తానే నవ్వుకుంది.

    English summary
    Punch Prasad, Jabardasth Nookaraju, Jabardasth Immaneul, Jabardasth Babu participants in Anchor Suma Cash Show Upcoming Episode.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X