సుధీర్‌పై ప్రముఖ కమెడియన్ ఫైర్: అవకాశాలు రాకుండా చేస్తున్నాడని స్టేజ్ మీదే!

తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకడు. యాక్టింగ్, డ్యాన్స్, సింగింగ్ అన్నింటికీ మించి కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను చాలా కాలంగా అలరిస్తోన్న ఈ యంగ్ కమెడియన్.. ఊహించని రీతిలో పాపులారిటీని దక్కించుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోతో యాంకర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా సుడిగాలి సుధీర్‌పై ప్రముఖ కమెడియన్ పంచ్ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. అసలేం జరిగింది? ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

జబర్ధస్త్‌గా సాగుతోన్న సుధీర్ కెరీర్

జబర్ధస్త్‌గా సాగుతోన్న సుధీర్ కెరీర్

సుధీర్ మెజీషియన్‌గా కెరీర్‌ను ఆరంభించి.. చాలా చానెళ్లలో షోలు చేశాడు. ఆ సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ల సహకారంతో.. అందులోకి ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. అలా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లతో ప్రేక్షకులను అలరించాడు. దీంతో షో నిర్వహకులు అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. అప్పటి నుంచి జబర్ధస్త్‌గా ముందుకెళ్తున్నాడు.

రష్మీతో ట్రాక్‌తో మరింత పాపులర్

రష్మీతో ట్రాక్‌తో మరింత పాపులర్

కెరీర్ ఆరంభంలోనే సుడిగాలి సుధీర్ భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. అదే సమయంలో యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో మరింత ఎక్కువగా పాపులరిటీని సంపాదించుకున్నాడు. చాలా కాలంగా ఆమెతో వ్యవహారం నడుపుతున్నట్లు కనిపిస్తున్నాడు. దీంతో అప్పటి నుంచి వీళ్లిద్దరూ లవర్సే అని ప్రచారం జరుగుతూనే ఉంది.

 మూవీల్లోనూ సత్తా చాటుతోన్నాడు

మూవీల్లోనూ సత్తా చాటుతోన్నాడు

బుల్లితెరపై తనదైన శైలి కామెడీతో టాప్ ఆర్టిస్టుగా వెలుగొందుతున్నాడు సుధీర్. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించాడు. అలాగే హీరోగానూ మారి ‘సాఫ్ట్‌వేర్ సుధీర్', ‘త్రీమంకీస్' సినిమాలు చేశాడు. ఇక, ఇప్పుడు సుధీర్ హీరోగా ‘కాలింగ్ సహస్రా', ‘గాలోడు' వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.

 యాంకర్‌గా సుధీర్ రీఎంట్రీ ఇచ్చి

యాంకర్‌గా సుధీర్ రీఎంట్రీ ఇచ్చి

చాలా రోజుల క్రితం సుడిగాలి సుధీర్ ‘పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారాడు. అందులో హోస్టుగానూ తన మార్క్‌ను చూపించి ఆకట్టుకున్నాడు. కానీ, ఆ షోతో యాంకరింగ్‌ను ఆపేశాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో మరోసారి యాంకర్‌గా ఎంట్రీ మారాడు. అందులో అదిరిపోయే హోస్టింగ్‌తో మెప్పిస్తున్నాడు.

వచ్చే ఆదివారం మరింత మజాగా

వచ్చే ఆదివారం మరింత మజాగా

రాబోయే ఆదివారం ప్రసారం కాబోతున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. గతంలో జరిగిన వాటి మాదిరిగానే ఈ ఎపిసోడ్ కూడా ఎంతో సందడిగా సాగినట్లు ప్రోమోలో చూపించారు. ఆర్టిస్టులు ఆటపాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. దీనికి కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్' మూవీ యూనిట్ ప్రమోషన్ కోసం వచ్చింది.

సుధీర్‌పై ఫేమస్ కమెడియన్ ఫైర్

‘శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకు సంబంధించిన ప్రోమోను ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేశారు. మరీ ముఖ్యంగా ఇందులో పంచ్ ప్రసాద్ వేసిన గెటప్, చెప్పిన పంచ్ డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి. ఇక, ఈ షోలో సుధీర్ కూడా అదిరిపోయే గెటప్‌తో వచ్చాడు. చివర్లో అతడిపై పంచ్ ప్రసాద్ ఫైర్ అయ్యాడు. అవకాశాలు రాకుండా చేస్తున్నాడని మండి పడ్డాడు.

Recommended Video

Aa Ammayi Gurinchi Meeku Cheppali First Look Launch Full Event | Filmibeat Telugu
ఆఫర్లు రాకుండా చేస్తున్నాడంటూ

ఆఫర్లు రాకుండా చేస్తున్నాడంటూ


ఈ షోకు ‘సెబాస్టియన్' టీమ్ రాగా.. పంచ్ ప్రసాద్ తన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని అడుగుతాడు. అప్పుడాయన ఏదో చెబుతుండగా.. సుధీర్ మధ్యలోకి వస్తాడు. దీంతో ప్రసాద్ ‘నేనేదో ఆఫర్ల కోసం అడుక్కుంటుంటే.. మధ్యలోకి వస్తావేంటి? ఏంటి అలా చూస్తున్నావ్? నా కిడ్నీ సమస్యకే భయపడలేదు. నీ ఫ్యాన్స్ నా విగ్గు కూడా పీకలేరు' అంటూ ఫన్నీగా గొడవ పెట్టుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X