40 ఏళ్ల వయసులో రెచ్చగొట్టేలా రంగమ్మత్త.. చుక్కల చీరలో అనసూయ అందాల జాతర!

తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్‌లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నటిగా మారి స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తోంది. హీరోయిన్లను మించిన అందంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న అనసూయ 40 ఏళ్ల వయసులోనూ మెరిసిపోతున్నారు. తాజాగా ఈ జబర్దస్త్ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎంబీఏ పూర్తి చేసిన అనంతరం తొలుత సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ జీవితాన్ని జబర్దస్త్ కామెడీ షో మలుపు తిప్పింది. ఈ కామెడీ షోకు తన గ్లామర్‌తో మరింత క్రేజ్ తీసుకొచ్చారు అనసూయ. జడ్జిలకు తోడు మధ్య మధ్యలో కంటెస్టెంట్స్‌పై అనసూయ వేసే పంచ్‌లు బాగా వర్కవుట్ అయ్యేవి. తనకు స్టార్‌డమ్‌ను, పేరును తీసుకొచ్చిన జబర్డస్త్‌ను జీవితంలో మరిచిపోనని ఆమె పలుమార్లు తెలిపారు .

Pushpa 2 Actress Anasuya Bharadwaj Latest photoshoot with White Saree

అలాంటి జబర్దస్త్‌ను అనసూయ వీడటం తెలుగు టెలివిజన్ రంగంలో చర్చనీయాంశమైంది. ఇప్పటికీ ఆమె ఈ ప్రోగ్రామ్‌ను ఎందుకు వదిలేశారో సరైన కారణం తెలియదు. కానీ అనసూయపై సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. సినీ రంగంలో బిజీ కావడం వల్లే యాంకరింగ్‌కు అనసూయ స్వస్తి పలికారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. జబర్దస్త్‌ కంటే పలు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు వేశారు అనసూయ. కానీ అవేవి అంతగా గుర్తింపు తీసుకురాలేదు.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా ఆమె కీలకపాత్ర పోషించారు. హీరోకి అండగా ఉండే పాత్రలో గ్లామర్ టచ్ ఇస్తూ అనసూయ అద్భుతంగా నటించారు. ఆ తర్వాత క్షణం, ఎఫ్ 2, సోగ్గాడే చిన్ని నాయన, విన్నర్, యాత్ర, కథనం, చావు కబురు చల్లగా, థ్యాంక్యూ బ్రదర్ వంటి చిత్రాల్లో కనిపించారు ఈ జబర్దస్త్ బ్యూటీ. ఇక పుష్ప సిరీస్‌లో ద్రాక్షాయణిగా అనసూయ నెగిటివ్ క్యారెక్టర్‌లోనూ అదరగొట్టారు. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు తమిళ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు.

హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆడిపాడారు అనసూయ. కొల్లగొట్టినాదిరో అంటూ సాగే ఈ పాటలో పూజిత పొన్నాడ, పవన్ కళ్యాణ్‌తో కలిసి రంగమ్మత్త స్టెప్పులు వేశారు. రెండ్రోజుల క్రితం విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఇక సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో అనసూయ భారీగానే సంపాదిస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట షోరూంల ఓపెనింగ్స్‌లో పాల్గొంటూనే ఉన్నారు.

ఖాళీ దొరికితే కుటుంబానికి సమయం కేటాయిస్తూ భర్త, పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు అనసూయ భరద్వాజ్. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. దీని సినిమాలు , షోలు, ఈవెంట్లు, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా చుక్కల చీర కట్టి, స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో చేసిన ఫోటో షూట్‌ను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X