బిగ్‌స్క్రీన్‌పై పుష్ప 2 బ్లాక్‌బస్టర్.. బుల్లితెరపై డిజాస్టర్.. రేటింగ్ ఎంత వచ్చిందో తెలుసా?
ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లతో ఎన్నో కొత్త కొత్త రికార్డులు సెట్ చేసిన చిత్రంలలో గత ఏడాది ముగింపు సినిమాలో వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం పుష్ప ది రూల్ కూడా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి కించిన క్రేజీ సీక్వెల్ సినిమా ఇది కాగా పాన్ ఇండియా లెవెల్ లో ఊహించని అంచనాలను ఈ సినిమా సెట్ చేసుకొని ధియేటర్స్ లో రిలీజ్ కి వచ్చింది.
కాగా పార్ట్ 1 నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ రీచ్ రావడంతో బాహుబలి, కే జి ఎఫ్ ఇలాంటి సినిమాల రేంజ్ లో ఒక ఎగ్జైటింగ్ సీక్వెల్ క్లైమాక్స్ కూడా లేకపోయినప్పటికీ పుష్ప పార్ట్ 2 పై మాత్రం ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. ఇదే అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1890 కోట్ల పైగా వసూళ్లు అందుకొని ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

మరి ఇంతలా రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం డిజాస్టర్ గా నిలవడం అనేది షాకింగ్ గా మారింది. కాగా ఈ చిత్రాన్ని గత కొన్ని రోజుల క్రితం తెలుగులో స్టార్ మా చానల్ వారు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కి తీసుకొచ్చారు.
అయితే ఈ టెలికాస్ట్ లో గత టీఆర్పి రికార్డ్ లోని ఈ చిత్రం బ్రేక్ చేస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా ఈ సినిమా ఒకటి డిజాస్టర్ టిఆర్పిని అందుకుంది చెప్పక తప్పదు. పుష్ప 2 కేవలం 12.62 టిఆర్పి రేటింగ్స్ పాయింట్ మాత్రమే అందుకుంది.
ఇది ఒక పాన్ ఇండియా రేంజ్ భారీ హిట్ సినిమాకి చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఒక బిలో యావరేజ్ సినిమా అనుకున్నా సరే ఎంత తక్కువ వచ్చింది అనుకుంటే దానికి సమంజసం ఉంటుంది. కానీ అంత పెద్ద హిట్ అయ్యి బుల్లితెరపై ఇంత తక్కువ రావడం అనేది అల్లు అర్జున్ అభిమానులు కూడా షాకింగ్ గా ఉంది.
ఎందుకంటే అల్లు అర్జున్ అండర్ పర్ఫార్మ్ చేసిన సినిమాలు కూడా బుల్లితెరపై మంచి రేటింగ్స్ ఉన్నాయి. ముందు వచ్చిన పుష్ప పార్ట్ వన్, అలాగే అల వైకుంఠపురం లో లాంటి సినిమాలు కి ఆల్ టైం రికార్డ్స్ ఉన్నాయి. పుష్ప 1 కి అయితే 21 పైగా టిఆర్పి రేటింగ్స్ ఉండటం విశేషం.
దీనికి సీక్వెల్ గా వచ్చిన పార్ట్ 2 కి మాత్రం కేవలం 12 దాటి రావడం అనేది ఆశ్చర్యకరమైన చెప్పాలి. దీనితో పుష్ప 2 బుల్లితెరపై మాత్రం డిజాస్టర్ అని చెప్పక తప్పదు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మలయాళం స్టార్ నటుడు ఫహద్ ఫాసిల్ అలాగే సీనియర్ జగపతిబాబు విలన్ పాత్రలో నటించారు.
అలాగే సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలో నటించగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఈ చిత్రంలో స్పెషల్ ఐటమ్ సాంగ్ లో కనిపించింది. ఇక దేవి శ్రీ ప్రసాద్ సామ్ సి ఎస్ లు సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రానికి పార్ట్ 3 పుష్ప ది రాంపేజ్ ను కూడా అనౌన్స్ చేసి రానున్న 2025లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.


Click it and Unblock the Notifications











