20 రోజుల షూట్.. 10 రోజుల డబ్బింగ్ వృథా? పుష్ప 2 పై బిగ్‌బాస్ బ్యూటీ ఆవేదన..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- డైరెక్టర్ సుకుమార్ కాంబో తెరకెక్కిన 'పుష్ప 2'. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో నటించిన ఒక నటి మాత్రం తన పాత్ర విషయంలో చాలా నిరాశకు గురైంది. సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ, చివరికి తన పాత్రకు జరిగిన మార్పులపై ఆమె ఆవేదన వ్యక్తం చేయడం వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? అసలేం జరిగిందంటే?
ఆ బ్యూటీ ఎవరో కాదు.. బిగ్‌బాస్ ఫేమ్, యంగ్ బ్యూటీ దివి వాద్యా (Divi Vadthya). బిగ్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది. ఈ తరుణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా మెరిసింది. ఆతర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. ఆతర్వాత ఈ బ్యూటీ బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షోలో ఛాన్స్ అందుకుంది. ఈ గేమ్ షోలో తన ఆటతో ప్రేక్షకులకు దగ్గరైంది.

బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీ వరుస సినిమాలు వస్తాయనీ భావించింది. కానీ, అనుకున్న విధంగా జరగలేదు. అయితే.. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో అవకాశం అందుకుంది. ఈ మూవీ దివి ఒక రిపోర్టర్ తరహా పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్ కట్‌లో తన పాత్రను బాగా తగ్గించేయడం పట్ల ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో దివి తాజాగా దీనిపై స్పందించింది.
దివి ప్రకారం.. 'పుష్ప 2' కథ చెప్పినప్పుడు తన పాత్ర చాలా పెద్దదిగా, కీలకంగా ఉంటుందని టీమ్ చెప్పిందట. అంతేకాకుండా విడుదలైన టీజర్‌లో కూడా తన పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడంతో, సినిమాలో తన రోల్ భారీగా ఉంటుందని ఆమె భావించింది. కానీ సినిమా విడుదలైన తర్వాత థియేటర్‌లో చూసి పూర్తిగా షాక్‌కు గురయ్యానని దివి తెలిపింది.
20 రోజులు షూటింగ్... 10 రోజులు డబ్బింగ్
ఈ సినిమా కోసం తాను దాదాపు 20 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నానని, అదేవిధంగా మరో 10 రోజుల పాటు డబ్బింగ్ చెప్పానని ఆమె వివరించింది. ఇంత కష్టపడి పనిచేసిన తర్వాత తన పాత్ర స్క్రీన్‌పై చాలా తక్కువగా కనిపించడం తీవ్ర నిరాశ కలిగించిందని తెలిపింది. 'చెప్పింది ఒకటి, తీసింది ఒకటి' అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని ఆమె అభిప్రాయపడింది. షూటింగ్ సమయంలో ఉన్న చాలా సన్నివేశాలు ఫైనల్ ఎడిటింగ్‌లో తీసివేశారని బాధపడింది. టీజర్‌లో కనిపించిన కొన్ని సీన్స్ కూడా సినిమాలో లేకపోవడం ఆమెకు మరింత బాధ కలిగించిందని తెలిపింది.
థియేటర్‌లోనే నిరాశ
సినిమాపై నమ్మకంతో తన ఫ్రెండ్స్‌ను కూడా థియేటర్‌కు తీసుకెళ్లిన దివి, అక్కడ తన పాత్ర కేవలం రెండు మూడు సీన్స్‌కే పరిమితం కావడంతో తీవ్రంగా ఫీలయ్యానని వెల్లడించింది. 'మన బాధ ఎవరు పట్టించుకుంటారు.. ముందుకు సాగాల్సిందే'అంటూ తన బాధను వ్యక్తం చేసింది. అయితే.. ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు కొత్తవి కావని చెప్పాలి. కథా,రన్‌టైమ్,నేరేషన్ వంటి పలు కారణాల వల్ల సీన్స్ ఎడిటింగ్‌లో తొలగించబడుతాయనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications

















