తెలంగాణ‌ గురించి ప్రశ్నించిన అమితాబ్ బచ్చన్

By Bojja Kumar

Amitabh Bachchan-Telangana
హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ 'తెలంగాణ' అంశమే. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ బోతోంది. తాజాగా తెలంగాణ అంశం అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టీవీ కార్యక్రమం 'కౌన్ బనేగా కరోడ్ పతి' 7వ సీజన్లో కూడా చర్చనీయాంశం అయింది.

ఇటీవల జరిగిన కౌన్ కరోడ్ పతి-7 ఎపిసోడ్లో రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి పాల్గొన్నాడు. అపుడు ఆ అభ్యర్థిని తెలంగాణ అంశంపై ప్రశ్నించాడు అమితాబ్. భరత మాతకు జన్మించబోతున్న 29వ బేబీ ఎవరు అని ప్రశ్నించగా....వెంటనే అతను తెలంగాణ అని సమాధానం ఇచ్చాడు.

ప్రశ్న ఈ విధంగా ఉంది....
66వ ఏట మదర్ ఇండియా జన్మనివ్వబోతున్న 29వ బేబీ ఎవరు? అనేది ప్రశ్న కాగా దానికి... 1) ద రాయల్ బేబీ, 2) తెలంగాణ, 3) ఐఎన్ఎస్ విక్రాంత్, 4)నర్గీస్ లాస్ట్ రిలీజ్ కాని సినిమా అనేవి అప్షన్లుగా ఇచ్చారు. దీనికి 'తెలంగాణ' అనేది సరైన సమాధానం.

'కౌన్ బేనేగా కరోడ్ పతి' కార్యక్రమం విశేషాల్లోకి వెళితే.....రూ.1 కోటి ఫ్రైజ్ మనీతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు తొలి 6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని 7వ సీజన్లోకి అడుగు పెట్టింది. 7వ సీజన్ సందర్భంగా ఫ్రైజ్ మనీ రూ.7 కోట్లకు పెంచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X