యాంకర్ స్రవంతిపై ఆర్ నారాయణ మూర్తి ఫైర్.. హైపర్ ఆదికి దండం.. స్టేజీపై షాకింగ్ గా!

సినిమా ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే వారిలో యాంకర్ ఒకరు. తమదైన చలాకీ తనంతో, చమత్కారంతో, గ్లామర్ తో ప్రేక్షకులకు ఎలాంటి బోర్ కొట్టకుండా ప్రోగ్రామ్ చివరి దాకా వారిని ఎంగేజ్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తారు యాంకర్స్. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో స్రవంతి చొకారపు ఒకరు. తాజాగా ఆమె ధనుష్, వెంటీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన సార్ సినిమా సక్సెస్ మీట్ కు హోస్ట్ గా వ్యవహరించింది. ఈ క్రమంలో అతిథిగా హాజరైన ఆర్ నారాయణ మూర్తి యాంకర్ స్రవంతిపై ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.

ఫ్రీలాన్స్ యాంకరింగ్..

ఫ్రీలాన్స్ యాంకరింగ్..

బుల్లితెరపై యాంకర్ గా అవతారం ఎత్తిన బ్యూటిఫుల్ స్రవంతి చొకారపు అనేక షోలు చేసి ఆకట్టుకుంది. అలాగే యాంకర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' మాత్రమే గుర్తింపును తీసుకు రాగా తర్వాత కాల క్రమేణా.. ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారింది స్రవంతి చొకారపు. సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లకు ఫ్రీలాన్స్ యాంకరింగ్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయిపోయింది ఈ స్మైలింగ్ క్వీన్.

ఫిబ్రవరి 17న విడుదలై..

ఫిబ్రవరి 17న విడుదలై..

ఇదిలా ఉంటే తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాల డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ సార్. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బ్యూటిఫుల్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. బైలింగువల్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేరోజు అంటే ఫిబ్రవరి 17న చాలా గ్రాండ్ గా విడుదలైంది.

ధనుష్ కు హ్యాట్సాఫ్..

ధనుష్ కు హ్యాట్సాఫ్..


ధనుష్ లేటెస్ట్ సినిమా సార్/వాతి విడుదలైన రోజు నుంచి మంచి టాక్ తోపాటు కలెక్షన్స్ కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో సార్ సినిమా సక్సెస్ మీట్ ను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాంకర్ స్రవంతి చొకారపు హోస్ట్ గా వ్యవహరించగా.. సీనియర్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సార్ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇలాంటి సినిమా చేసిన ధనుష్ కు హ్యాట్సాఫ్ తెలిపారు.

 నేను మర్చిపోయాను...

నేను మర్చిపోయాను...

అయితే తన స్పీచ్ లో కమెడియన్ హైపర్ ఆది గురించి మాట్లాడటం మర్చిపోయారు ఆర్ నారాయణ మూర్తి. దీంతో వేరొకరు మాట్లాడుతున్నప్పుడు సడెన్ గా మైక్ తీసుకుని ఆది గురించి గొప్పగా చెప్పడం ప్రారంభించారు. "తమ్ముడు.. హే తమ్ముడు.. ఇలా రా.. తమ్ముడి గురించి మాట్లాడాలి. క్షమించండి. సార్ ని (ఆది) నేను మర్చిపోయాను. క్షమించండి" అని నారాయణ మూర్తి అన్నారు.

 నువ్వు నవ్వకుండా నవ్విస్తవే..

నువ్వు నవ్వకుండా నవ్విస్తవే..

ఆర్ నారాయణ మూర్తి కొనసాగిస్తూ.. "మిత్రులారా ఒక కస్తూరి శివరావు గారిని మనం ఎలా చూశామో.. ఓ రేలంగిని ఎలా చూశాం.. ఓ రాజబాబు గారిని ఎలా చూశాం.. ఇవాళ బ్రహ్మానందం గారిని ఎలా చూస్తున్నామో.. ఆ లైన్ లో వస్తున్న గొప్ప గొప్ప మహానుభావులు, కమెడియన్లు ఎంతో మంది ఉన్నారు. కామెడీ అంటే అంత సులభం కాదు. ఏడిపించడం చాలా ఈజీ. కానీ నవ్వించడం చాలా కష్టం. కానీ నువ్వు నవ్వకుండా పంచ్ వేసి నవ్విస్తావ్ అన్నా. దండం ఆది నీకు దండం.. థ్యాంక్యూ" అని తెలిపారు.

హే పిల్లా ఆపు అంటూ సీరియస్ గా..

హే పిల్లా ఆపు అంటూ సీరియస్ గా..

అయితే ఆది గురించి చెప్పే క్రమంలో మొదట్లోనే ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతుంటే.. యాంకర్ స్రవంతి.. మైకులో వేరే ఒకరిని పిలుస్తోంది. దీంతో "హే పిల్లా ఆపు.. ఓ అమ్మాయి.. టైరో టైరో (ఆగు). స్టేజీ మీద కొద్దిసేపు ఎవరు మాట్లాడకూడదు రైట్. మాట్లాడిన తర్వాత పిలవండి దయ ఉంచి ప్లీజ్. డోంట్ మేక్ సీరియస్ ప్లీజ్" అంటూ గట్టిగా అరుస్తూ చాలా సీరియస్ అయ్యారు ఆర్ నారాయణ మూర్తి. తర్వాత స్పీచ్ అయ్యాక "హే పాప.. బ్రహ్మాండగా నడిపిస్తున్నావ్ సభను నమస్కారం అమ్మ" అని సరదాగా అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X