Guppedantha Manasu March 14th: మనును చంపేందుకు రౌడీలకు సుపారీ.. వసు మాటలకు అనుపమ హర్ట్!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో కాలేజీలో అంత మంది ఉండగా.. వసుతో మాత్రమే ఎందుకు ప్రాజెక్టు చేయాలనుకున్నవా అంటూ ఫైర్ రాజీవ్ ఫైర్ అవుతాడు. నీలాంటి మృగాలు ఆమె దగ్గరకు రాకుండా కాపాడతానంటూ చెబుతాడు. కానీ ఇంకోసారి వసుధార గురించి కానీ నా గురించి కానీ మాట్లాడితే బాగోదు చెబుతున్నా అంటూ మను వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుండగా.. రాజీవ్ చేయి లేపుతాడు. ఆ తర్వాత జాతకం చూపించుకో పచ్చరాయి ఉంగరం ఉన్నోడి చేతిలోనే నీ చావు ఉంటుందని చెబుతారంటూ చెప్పి మను వెళ్లిపోతాడు.

ఆ తర్వాత వసు మనుకు ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచించుకుంటుంది. ఆ తర్వాత ఫోన్ చేసి మరీ థాంక్స్ చెబుతుంది. మీకిష్టం లేదని అన్నారుగా అంటూ అనగా.. అన్నాను కానీ మీరు ఈరోజు సెలబ్రేట్ చేసిన తీరు నాకు చాలా నచ్చింది, రిషి సార్ పక్కన ఉన్నట్లే అనిపించిందంటూ వివరిస్తాడు. ఆ తర్వాత మను.. ఎన్నో రోజులుగా ఇది చేశానని.. మహేంద్ర గారు నాకు సాయం చేశారంటూ చెబుతాడు. ఆ తర్వాత వసు నాకింకో సాయం చేస్తారా... రిషి సార్ ను వెతికేందుకు మీరు నాకు సాయం చేస్తారా అని అడగ్గా... నేను కూడా అదే పనిలో ఉన్నానంటూ వివరిస్తాడు. ఏంటి అని వసు అనగా.. అదే సాయం చేస్తానని చెబుతున్నానంటాడు.

Raajeev And Manu Fight on The Road on Guppedantha Manasu March 15th 2024 Episode 1025

నా నమ్మకాన్ని మీరు బలపరిచారు.. మామయ్య కూడా నమ్మేలా చేశారు.. మీరు నాకు సాయం చేయండి అంటూ వసు అనగా.. కాలేజీని ఎలా కాపాడానో రిషి సార్ ను అలాగే కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను అంటూ చెబుతాడు. ఆ తర్వాత రాజీవ్, శైలేంద్రలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా వాడు నా ఈగో హర్ట్ చేశాడు.. వెంటనే వెళ్లి నా కోపం తీర్చుకోవాలి.. వాడిని నేను చంపేస్తానంటూ చెప్పుకొస్తాడు. అవసరమా అంటూ శైలేంద్ర అనగా.. ఏమైంది భయ్యా అంటూ రాజీవ్ అంటాడు. ఆ తర్వాత మనిద్దరం ఒకటే అని వాడే అన్నాడుగా.. మనలో ఎవరు ఏం చేసినా వాడు మనిద్దరినీ అనుమానిస్తాడంటూ చెబుతాడు.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఓ రౌడీతో మాట్లాడతారు. మనును రేపే చంపాలని ప్లాన్ చేస్తారు. నీకో ఫొటో పంపిస్తాను అది చూశావుగా.. రేపు వాడు ఈ లోకంలో ఉండకూడదు అంటూ వెల్లడిస్తాడు. ఆ తర్వాత అడ్వాన్స్ కూడా పంపగా.. నేను చూసుకుంటానంటూ చెబుతాడు. ఆ తర్వాత రాజీవ్ పని పూర్తవుతుందా భయ్యా అని అనగా... కచ్చితంగా అంటాడు. ఇదే జరిగితే ఒకరికి కాలేజీ, మరొకరికి వసు దక్కుతుందని అనుకుంటారు. ఆ తర్వాత అనుపమ, వసులు తింటూ కనిపిస్తారు. ఈక్రమంలోనే అనుపమ వసును చూసి ఇంత ఆనందంగా కనిపిస్తున్నావేంటి అనగా.. మను నా బర్త్ డే చేసిన తీరు చాలా హ్యాపీగా అనిపిస్తుందంటూ వివరిస్తుంది.

Raajeev And Manu Fight on The Road on Guppedantha Manasu March 15th 2024 Episode 1025

ఆ తర్వాత మను మీద మీ ఒపీనియ్ ఏంటని అడగ్గా.. మంచోడు, అందరికీ సాయం చేస్తాడు, కల్మషం లేని వ్యక్తి అంటూ అనగా.. బర్త్ డే చేయడం నాకిష్టం లేదన్నా చేసే సరికి చాలా కోపం వచ్చిందని కానీ రిషి సార్ నా పక్కన ఉండి బర్త్ డే చేస్తున్నట్లు అనిపించిందని వివరించింది. చాలా రోజుల తర్వాత నా మనసుకు ఆనందం కల్గిందని... రిషిని వెతికేందుకు సాయం కావాలని ఫోన్ చేసి అడిగితే ఓకే చెప్పాడని మను అన్నాడని వసు వివరిస్తుంది. మను ఎదురు చూస్తుంది రిషి కోసమే అని వీలైనంత త్వరగా రిషి జాడ తెలియాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పుకొస్తుంది. ఆ తర్వాత వసు అదోలా చూడడం గుర్తించి ఏంటని అడగ్గా.. మనుకు మీకు ఏమైనా శత్రుత్వం ఉందా అని అడుగుతుంది.

మనును చూస్తే సొంత మనిషిని చూసినట్లు ఆనందం చూపిస్తారు, ఆ వెంటనే కోప్పడతారు.. అంటూ అడుగుతుంది. మీరు ఎందుకో అబద్ధం చెబుతున్నారని మీ కళ్లు చూస్తేనే అర్థమవుతుందంటారు. అయినా సరే వసు వినకుండా మీ ఇద్దరి మధ్య బంధం ఏంటని అడుగుతుంది. రిషి, జగతిల మధ్య బంధం కూడా ఇలాగే అనిపించిందని.. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే కూడా అలాగే అనిపిస్తుందని వివరిస్తుంది. మీకు ఇప్పటికే పెళ్లైందని నా నమ్మకం అంటూ అడగ్గా... ఇంతకు ముందే చెప్పాను కదా అంటుంది. వెంటనే కోపంగా లేచి నాకు పెల్లి కాలేదు, నేను ఒంటరిదాన్ని, జీవితాంతం ఒంటరిగానే ఉంటానంటూ వివరిస్తుంది. చాలా ఎమోషనల్ అవుతుంది.

Raajeev And Manu Fight on The Road on Guppedantha Manasu March 15th 2024 Episode 1025

మరి మనుతో మీ బంధం ఏంటి, మీరు ఎందుకు చెప్పట్లేదు అని అనగా... వసు ఇంకోసారి అడక్కు. ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇబ్బంది పెట్టకు అంటూ చెప్పుకొస్తుంది. నువ్వు హ్యాపీగా ఉండాలి... నాక్కావాల్సింది మీరంతా సంతోషంగా ఉండాలని అంతే.. అదే చాలని చెబుతూ వెళ్లిపోతుంది. కావాలనే మేడమ్ సమాధానం చెప్పలేదని.. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X