Guppedantha Manasu March 14th: రాజీవ్ తినిపించే కేక్ పడేసిన మను.. కోపంతో రోడ్డుమీదే ఆపి ఫైట్!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో వసుధార పుట్టిన రోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. అందరినీ ఉద్దేశిస్తూ.. వసు మాట్లాడుతుంది. రిషి సార్ లేకుండా నా ఆనందం ఎవరితో పంచుకోలేను.. కానీ మీరంతా ఇలా మాస్కులు పెట్టుకోవడంతో సార్ నా పక్కనే ఉన్నట్లు అనిపించి ఈ బర్త్ డే చేసుకున్నాను అంటూ వివరిస్తుంది. అలాగే తన సంతోషం కోసం ఇన్ని ఏర్పాట్లు చేసిన మనుకు అందరి ముందు థాంక్స్ చెబుతుంది. అలాగే ఏవీలో అందరి మాటలు విన్నప్పుడు మరింత ఎమోషనల్ గా అనిపించిందని అంటుంది.

ఎండీ పదవి స్వీకరించాకా చాలా సమస్యలు వచ్చాయని.. కానీ అందరి మాటలు విన్న తర్వాత వసుధార ఈ కాలేజీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెబుతుంది. దీంతో అందరూ క్లాప్స్ కొడతారు. అలాగే ఎంత మంది ఎన్ని కుట్రలు చేసినా రిషి సార్ చెప్పే వరకు ఈ ఎండీ పదవిని వదిలేదే లేదని అంటుంది. దీంతో దేవయాని, శైలేంద్ర షాక్ అవుతారు. ఆ తర్వాత మనుకు మరోసారి థాంక్స్ చెబుతుంది. ఆ దేవుడు మా బాధను చూడలేకే నిన్ను ఇక్కడకు పంపాడు అనుకుంటా అని మహేంద్ర చెబుతాడు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్రలు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తారు. వసు బర్త్ డే గ్రాండ్ గా చేయడాన్ని జీర్ణించుకోలేకపోతారు.

Raajeev Fires on Manu About Vasu Birth Day Celebrations on Guppedantha Manasu March 14th 2024 Episode 1024

అసలు దీన్ని ఎందుకు ఆపలేకపోయావు అంటూ శైలేంద్రను అడగ్గా.. నా దరిద్రం అనేక ప్లాన్ లు వేసి ఎండీ సీటులోంచి తొలగించాలనుకుంటే అక్కడే ఉంటుంది అంటూ ఫైర్ అవుతాడు. అలాగే మను వచ్చి తన ప్లాన్ లను తిప్పి కొడుతున్నాడని.. వసు బర్త్ డే గ్రాండ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఏదో ఒకటి చేయాలంటూ మాట్లాడుకోగా.. ధరణి వస్తుంది. మిగిలిన కేక్ తింటే ఆలోచనలు అవే వస్తాయంటూ అంటుంది. ఆ తర్వాత బలవంతంగా అత్తకు, భర్తకు కేక్ తినిపిస్తుంది. నాలుగైదు స్పూన్లు పెడుతుంది. ఆ తర్వాత మరేదో వంటకం చేస్తానంటూ లోపలికి వెళ్తుంది.

ఆ తర్వాత మహేంద్ర మనుకు థాంక్స్ చెబుతాడు. వసుధార మొహంలో ఆనందం చూసేలా చేశావు మను చాలా సంతోషంగా ఉందంటూ వివరిస్తుంది. అవును మను మీ బర్త్ డే ఎప్పుడు అని అడగ్గా... ఆయన చప్పుడు చేయడు. అనుపమ మొహం చూస్తాడు. ఇలా బలవంతం చేయకుం అంటూ అనుపమ అనగా.. ఏంజెల్ మాత్రం మీరు చెప్పండి అంటూ అడుగుతుంది. ఆ తర్వాత ఏంజెల్ మీరే చెప్పండి అంటూ అత్తను అడగ్గా.. ఆమె ఫైర్ అవుతుంది. అత్త నా మీద ఎందుకు అరుస్తుంది చూడు వసు అంటూ అడుగుతుంది. ఆ తర్వాత మనుతో నేను మాట్లాడొద్దా, ఎందుకు ఆయనతో మాట్లాడితే ఫైర్ అవుతుందని అంటుంది.

ఆ తర్వాత ఏంజెల్ తప్ప నీకెవరూ లేరు కదా.. ప్రేమ అయినా కోపం అయినా తన మీదే చూపిస్తావు కదా అంటూ మహేంద్ర అంటాడు. సారీ చెప్పమని సూచిస్తాడు. ఒకవేళ నీకు ఎవరైనా ఉంటే చెప్పు అని అనగా మను వెళ్లిపోతాడు. అది చూసిన ఏంజెల్ మళ్లీ ఆపి తనకు ఆన్సర్ రాలేదనగా మర్చిపోయాను.. నా గతం నాకు అనసవరం అంటూ చెబుతాడు. కానీ మహేంద్ర మాత్రం అది గుర్తు చేసేందుకు నేను ఉన్నాగా... పర్లేదు చెప్పు అంటాడు. దీంతో మను కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇంటికొచ్చిన వసు రిషి ఫొటో చూసుకుంటూ మాట్లాడుతుంటుంది. బర్త్ డే ను గుర్తు చేసుకుంటూ అన్నీ చెబుతుంది.

తాను ఈస్థాయిలో ఉండడానికి రిషినే కారణం అని చెప్పుకుంటూ మురిసిపోతుంది. ఆ తర్వాత తన తండ్రి ఫోన్ చేసి హ్యాపీ బర్త్ డే చెబుతాడు. ఆ తర్వాత వసు కాలేజీలో తన బర్త్ డే సెలబ్రేట్ చేశారని... తాను చాలా సంతోషంగా ఉన్నానని అంటుంది. అలాగే రిషి గురించి ఏమైనా తెలిసిందా అనగా.. లేదని చెబుతుంది. ఆ తర్వాత మను వెళ్తున్న కారుకు అడ్డంగా రాజీవ్ వస్తాడు. నీవు చాలా ఓవర్ చేస్తున్నావని, తొలిసారి గన్ తో బెదిరించావు, వసు ఇంటికెళ్తే అకక్డకు వచ్చి మరింత ఎక్స్ ట్రాలు చేశావు కానీ ఆరోజు నేను ఇచ్చిన వార్నింగ్ మర్చిపోయావు అంటూ గుర్తు చేస్తాడు.

పోస్టర్ల మీద నీ ఫొటోలు ఉన్నాయని అలా చేశావు కావచ్చు కానీ.. నా మరదలికి కేక్ తినిపించాలనుకుంటే.. పడిపోయేలా చేశావంటాడు. అప్పుడు నా మరదలికి కేక్ తినిపించబోయింది నేనే అనుకుంటూ చెప్పగా... ఆమె వస్తువు కాదు నీది అని చెప్పడానికి అంటూ వివరిస్తాడు. ఆ తర్వాత వద్దన్నా వెంట పడే వాళ్లని కుక్క అంటారు తెలుసా అంటూ చెబుతాడు. ఆ తర్వాత ఫుల్ గా వాదించుకుంటారు ఒకరినొకరు కొట్టుకునేందుకు చేతులు కూడా లేపుకుంటారు. ఇలా ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X