బుల్లి తెరపై పవన్ హీరోయిన్ రియాల్టి షో

By Srikanya

Lukku Kikku
పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన చేసిన రాసి లావు అయ్యి ఫేడవుట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె 'లక్కు-కిక్కు'అనే గేమ్ షోతో బుల్లి తెరపై రీ ఎంట్రీ ఇస్తోంది. తన తోటి హీరోయిన్స్ అందరూ వరసగా టీవి తెరపై ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ వరసగా పోగ్రాములు చేస్తూంటే తాను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి అనుకుందో ఏమో కానీ రాసి కూడా దూకేసింది. జీ తెలుగు చానల్ లో ఈ షో రానుంది.

ఇక తమ 'లక్కు-కిక్కు'వెరైటీ గేమ్ షో చాలా వెరైటీ పోగ్రామ్ అని సామాన్యులను టీవికు చేరువ చేస్తుందని నిర్వాహకులు అంటున్నారు. ఇప్పటివరకూ వచ్చిన గేమ్ షోలకు భిన్నంగా ఈ 'షో' నిలవనుందని వారు చెప్తున్నారు. తమ గేమ్ షో లో స్త్రీలతో పాటు పురుషులకు కూడా పాల్గొనే అవకాశాన్ని ఈ షో కలిపిస్తోంది.

ఇక గేమ్ షో ప్రత్యేకత ఏమిటంటే... పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నగదు గెలుచుకునే అవకాశం కల్పించడం. అలాగే గేమ్స్ ఆడటమేకాక, తమ ప్రతిభను సైతం ప్రదర్శించే అవకాశం కూడా ఈ కార్యక్రమం పార్టిసిపెంట్స్‌కి దక్కనుందని జీ తెలుగు యాజమాన్యం చెప్తోంది. ఈ గేమ్ లో పాల్గొన్న పోటీదారుల మధ్య నగదు దోబూచులాడుతూ.. ఎవరికి దక్కుతుందనే ఆసక్తిని రేకెత్తిస్తూ వినోదభరితంగా ఈ గేమ్ షో సాగిపోతుందని జీ తెలుగువారు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి నటి రాసి వ్యాఖ్యాతగా వ్యవహరించడమే ప్రత్యేకత అని అంటున్నారు.

రాసి విషయానికి వస్తే ఆమె కెరీర్ లో శుభాకాంక్షలు, గోకులంలో సీత, ప్రేయసిరావె వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. అయితే ఒక పెళ్లాం ముద్దు..రెండో పెళ్లాం వద్దు చిత్రం సమయంలో వివాహం చేసుకుని సెటైలైంది. ఆమె భర్త శ్రీనివాస్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ మహారాజశ్రీ అనే చిత్రం సైతం నిర్మించింది. అయితే అది భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. ఆ తర్వాత ఆమె చాలా టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. గత కొంతకాలంగా టీవీకు దూరంగా ఉన్న రాసిని ఈ 'లక్కు-కిక్కు' కార్యక్రమం ద్వారా కెమెరా ముందుకు తీసుకొస్తోంది జీ తెలుగువారిదే.

టెలీకాస్ట్ డిటేల్స్: ప్రతీ బుధ, గురువారాల్లో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. కేవలం జీ తెలుగు ఛానెల్ లో మాత్రమే ఈ పోగ్రాం ప్రసారం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X