Waltair Veerayya: చిరంజీవి ఫంక్షన్ లో యాంకర్ సుమకు చేదు అనుభవం.. రచ్చ రవి స్పీచ్ మధ్యలో అలా!

దాదాపు నాలుగు దశాబ్ధాలుగు తెలుగు చిత్రసీమలో తన హవాను చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఏక కాలంలో సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టిన చిరంజీవి తాజాగా వాల్తేరు వీరయ్యతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. వాల్తేరు వీరయ్య విజయోత్సాహం హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో పలువురు కమెడియన్స్ చేత మాట్లాడించారు. ఈ క్రమంలో మాట్లాడిన రచ్చ రవి హల్ చల్ చేశాడు.

అదరగొట్టిన చిరు, రవితేజ..

అదరగొట్టిన చిరు, రవితేజ..

మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజా రవితేజ అలరించాడు. సుమారు సుమారు 22 ఏళ్ల తర్వాత అన్నదమ్ములుగా నటించిన చిరు, రవితేజ తమ యాక్టింగ్ అదరగొట్టారని టాక్ వస్తోంది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచిందని అంటున్నారు.

వీరయ్య విజయ విహారం..

వీరయ్య విజయ విహారం..

ఇక చిరంజీవి వింటేజ్ లుక్ లో అదరగొట్టిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోంది. ఈ సినిమా ఇప్పటికే రూ. 200 కోట్లకుపైగా కలెక్షన్స్ కొల్లగొట్టిందని నిర్మాతలు తెలిపారు. దీంతో ఈ సినిమా విజయాన్ని మేకర్స్ తో పాటు చిత్రబృందం ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల శనివారం అంటే జనవరి 28న హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో వీరయ్య విజయ విహారం పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు.

హైలెట్ గా రవి స్పీచ్..

హైలెట్ గా రవి స్పీచ్..



యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేసిన ఈ వేడుకకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ తో పాటు ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. అలాగే వాల్తేరు వీరయ్య సినిమా టీమ్ కూడా పాల్గొంది. ఇక ఈ ఈవెంట్ లో అందులో నటించిన నటులతో మాట్లాడించారు. ఈ క్రమంలోనే స్థానిక నటుడు, కమెడియన్ రచ్చ రవి తన స్పీచ్ తో హైలెట్ గా నిలిచాడు. తన స్పీచ్ కు ప్రతిసారి అడ్డుపడిన యాంకర్ సుమపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఓరుగల్లు ముద్దు బిడ్డలారా..

ఓరుగల్లు ముద్దు బిడ్డలారా..

నటులతో మాట్లాడటానికి ముందే ఎంతసేపు మాట్లాడాలో ముందే ఇండికేషన్ ఇచ్చిన యాంకర్ సుమను ఉద్దేశిస్తూ.. అక్కా ఫస్ట్ నీ కాళ్లు మొక్కుతా.. నా సొంత ఊరిలో చిరంజీవి అన్నతో నేనున్నా. రెండు నిమిషాలు ఎక్కువ మాట్లాడుత. మళ్లీ జీవితంలో ఇంకెక్కడ మాట్లాడ. నీ కాళ్లు మొక్కుతా బాంచన్. గంతే అంటూ స్పీచ్ ప్రారంభించాడు. "ఓరుగల్లు ముద్దు బిడ్డలారా.. నా చిరంజీవి తమ్ముల్లారా.. ఒక్కసారి ప్రేమతో.. ఒక్కసారి భక్తితో జై చిరంజీవ" అని అన్నాడు రచ్చ రవి.

ఇది స్పీచ్ కాదు.. ఆవేదన..

ఇది స్పీచ్ కాదు.. ఆవేదన..

అన్నా.. ఓరుగల్లు నీళ్లు తాగి హైదరాబాద్ కు వచ్చినా. కృష్ణా నగర్ లో నీళ్లు తాగి బతికిన. చిరంజీవి అభిమానిగా బతుకుతున్న. ఒక చిరంజీవి అభిమాని చిరంజీవి సినిమాకు టికెట్లు చింపుతడు. పేపర్లు చల్లుతడు. దెబ్బలు తింటాడు. ఆ అభిమాని ఆర్టిస్ట్ అయితే ఇలా మీ ముందు ఉంటాడు. ఇది స్పీచ్ కాదు. నా ఆవేదన. నా ప్రేమ. పుట్టిన ఊరిలో చిరంజీవి అన్న ముందు ఉన్న. లైఫ్ లో ఇక చాలు అంటూ డైరెక్టర్ బాబీకి థ్యాంక్స్ చెప్పాడు రచ్చ రవి.

 ముగ్గురు కొడుకులను మాకోసమే..

ముగ్గురు కొడుకులను మాకోసమే..

ఈ క్రమంలో స్పీచ్ ముగించాల్సిందిగా సుమ కోరగా.. "ఆగాగు.. దండం పెడతా.. ఇంకొక్కటే.. అంటూ ఈ వేదికగా ఒక్కరికే థ్యాంక్స్ చెప్పాలని, వారు ఎవరో చెబితే ఈమె కూడా ఏడుస్తుందని" సుమను అన్న రచ్చ రవి.. "ఓ అంజనమ్మా.. టీవీ చూస్తున్నవా.. మా అందరికోసం మెగాస్టార్ ని ఇచ్చినవ్. మా అందరికోసం పవర్ స్టార్ ని ఇచ్చినవ్. టాలీవుడ్ లో మా బతుకులు మార్చేందుకు నాగబాబు రూపంలో టవర్ స్టార్ ను ఇచ్చినవ్. మీ ముగ్గురు కొడుకులను మాకోసమే ఇచ్చినవ్ కదమ్మా" అని కృతజ్ఞతలు తెలిపాడు.

 సుమకు కౌంటర్..

సుమకు కౌంటర్..

తర్వాత తనను ఎక్కడా మాట్లాడనిస్తలేరు.. మెగాస్టార్ ను కలవనిస్తలేరని ఆవేదన వ్యక్తం చేశాడు రచ్చ రవి. ఆయన స్పీచ్ ముగిశాక.. అందరి తరపున రచ్చ రవి మాట్లాడాడు కాబట్టి అందరికీ ధన్యవాదాలు అంటూ కవర్ చేస్తున్న సుమతో.. "ఓ బుజ్జీ.. నువ్ ముసలిదానివి కాదు.. ఏం కావు.. వేరేటోళ్లకు అవకాశం ఇయ్యవు. వాళ్లంతో ఇష్టంతో ఒక్కొక్కరు మాట్లాడుతారు. హాయ్.. అన్నా నమస్తే అని చెప్పొద్దా" అంటూ సుమకు కౌంటర్ ఇచ్చాడు రచ్చ రవి. ప్రస్తుతం రవి స్పీచ్ వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X