Rachha Ravi: బాలయ్య బాబుకు రచ్చరవి దసరా దావత్ - బోటికూర, తలకాయతో అమ్మచేతి వంట అందజేత

Bhagavanth Kesari Villain: నటసింహం నందమూరి బాలకృష్ణకు అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ విషయం ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూనే ఉంటుంది. ఆయనను చూడాలని, మాట్లాడాలని, ఫొటో దిగాలని వేలాది మంది అభిమానులు ఉవ్విళ్లూరుతుంటారు. బాలకృష్ణ పుట్టిన రోజు, సినిమాల రిలీజ్ రోజున అయితే ఇక ఆయన అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. సినిమా రిలీజ్ లే కాదండోయ్.. ట్రైలర్ లాంఛ్ వంటి ఈవెంట్లలో కూడా రచ్చ చేస్తుంటారు. అయితే ఆయన హీరోగా తాజాగా రాబోతున్న చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఈరోజు వరంగల్ జిల్లాలో జరిగింది.

ఈక్రమంలోనే ఆయనను చూసేందుకు వేలాది మంది అభిమానులు వచ్చారు. ఈ సందర్బంగానే భగవంత్ కేసరి సినిమాలో నటించిన వారితో పాటు సామాన్య ప్రజలు కూడా వచ్చారు. అయితే ఈ సినిమాలో నటించిన రచ్చ రవి.. అదే జిల్లాకు చెందిన వాడు కావడంతో మరింత సంబరపడిపోయాడు. తమ జిల్లాకు తన అభిమాన నటుడు రావడం గర్వంగా ఉందన్నాడు. బాలయ్య బాబు వస్తున్న విషయం తెలిసిన తన తల్లి... ఆయన కోసం స్పెషల్ గా బోటి ఫ్రై, తలకాయ కూర చేసి తీసుకొచ్చిందని చెప్పాడు. దాన్ని బాలకృష్ణకు అందించమని.. స్టేజీపై ఉండగానే అవ్వా.. దాయే.. దా తీస్కొని రా.. బోటి, తలకాయ కూర తీస్కరా.. సార్ కు ఇవ్వు అని చెప్పాడు.

Rachha Ravi Mother Cooked Special Boti Fry And Thalakaya Curry For Balakrishna at Bhagavanth Kesari Movie Trailer Launch Event

మా ఊరికి వచ్చిన బాలయ్య బాబుకు ఇది నేను ఇస్తున్న దసరా దావత్ అని చెబుతూ తెగ మురిసిపోయాడు. ప్రేక్షకులంతా కూడా పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. అది విన్న ఆయన తల్లి నిజంగానే ఓ టిఫిన్ బాక్సులో బోటి, తలకాయ కూర తీసుకొని బాలయ్య బాబు వద్దకు వచ్చింది. అది గమనించిన సిబ్బంది కూడా ఆమెను బాలకృష్ణ వద్దకు తీసుకెళ్లారు. ఆవిడ రాగానే నటసింహం కూడా నిలబడి మరీ ఆమెను గౌరవించడం మరింతగా ఆకట్టుకుంది. అగో ఆమెనే కాజల్ అంటూ రచ్చ రవి తన తల్లికి చూపించాడు. చీరలో అందంగా ముస్తాబై వచ్చిన కాజల్, పరికిణీలో వచ్చిన శ్రీలలు కూడా నిలబడి రచ్చ రవి తల్లితో మాట్లాడారు.

ఈక్రమంలోనే స్వయంగా తన చేతులతో వండి తీసుకొచ్చిన బాక్సును బాలయ్య బాబుకు అందజేసింది. అది తీసుకున్న బాలకృష్ణ చాలా ఎక్కువగా పెట్టినట్లున్నారుగా... బాగా బరువు ఉందంటూ నవ్వడం అందరినీ మైమరిపించింది. అనంతరం ఆయనతో కలిసి ఫొటోలు దిగారు. రచ్చ రవి, ఆయన తల్లి, పిల్లలు అక్కడున్న నటీనటులతో కలిసి ఫొటోలు దిగారు. అయితే అంతకు ముందే రచ్చ రవి బాలయ్య బాబు గురించి మాట్లాడుతూ.. నువ్వు నా చిన్ని కృష్ణుడివే అంటూ ముద్దుల వర్షం కురిపించారు. ఆయన ప్రేమను చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందేనన్నారు.

Rachha Ravi Mother Cooked Special Boti Fry And Thalakaya Curry For Balakrishna at Bhagavanth Kesari Movie Trailer Launch Event

ఆయన ఎవరినైనా కొట్టాడనో, తిట్టాడనో వార్తలు వస్తుంటాయని.. కానీ వాటికి కారణాలు మాత్రం చెప్పరని అన్నారు. కొట్టిన బాలయ్య బాబుకు, దెబ్బలు తిన్న వాళ్లకు మాత్రమే అక్కడ జరిగిన తప్పు గురించి తెలుస్తుందంటూ బాలకృష్ణ గుణగణాలను వివరించాడు. బాలయ్య బాబు మంచి మనసు తెలిసిన ఎవరైనా ఆయన గురించి ఇలా పాజిటివ్ గానే చెబుతుంటారు మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X