బుల్లితెరపై ఆకట్టుకొంటున్న రాధా మనోహరం.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

తెలుగు సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలో టాప్ వెబ్ సిరీస్‌లు హల్‌చల్ చేస్తున్నా.. టెలివిజన్ సీరియల్స్‌కు ఎదురే లేదంటే ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో సీరియల్స్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కుటుంబ సభ్యులను ఎన్నో ధారా వాహికలు ఆకట్టుకొంటున్నాయి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న సీరియల్స్‌కు పోటీగా ఈటీవీలో ఓ కొత్త సీరియల్ ప్రసారం అవుతున్నది. ఈ సీరియల్ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఆ సీరియల్ వివరాల్లోకి వెళితే..

తెలుగులో పాపులర్ టెలివిజన్ ఛానెల్ ఈటీవీ మరో ఫ్యామిలీ డ్రామా రాధా మనోహరం అనే డైలీ సీరియల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ సీరియల్‌ ఏప్రిల్ 29వ తేదీన టెలి కాస్ట్ అవుతున్నది. ఈ సీరియల్‌ ప్రతీ వారం సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రసారం అవుతున్నది.

Radha Manoharam getting good response on ETV Here is the more detials

గతవారం రోజులుగా ప్రసారం అవుతున్న రాధా మనోహరం సీరియల్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నదని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రేక్షకుల నుంచి ఇలాంటి స్పందన రావడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఉంటే.. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం మరోసారి రుజువు అయింది అని అన్నారు.

ఇక రాధా మనోహరం సీరియల్‌లో సిద్దార్థ వర్మ, కన్నడ టెలివిజన్ నటి సలోమీ డిసౌజా జంటగా నటించారు. శతమానంభవతి, ముత్యమంత ముద్దు,అగ్ని పరీక్ష, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు లాంటి సీరియల్స్‌తో సిద్దార్థ తెలుగు ప్రేక్షకులకు చేరవయ్యారు. ఇక కన్నడలో ఇప్పటికే శాలోమీ టాప్ యాక్టర్‌గా ప్రశంసలు అందుకొంటున్నారు.

Radha Manoharam getting good response on ETV Here is the more detials

ఇక రాధా మనోహరం సీరియల్ కథ విషయానికి వస్తే.. మదర్ సెంటిమెంట్, భార్యభర్తల మధ్య సంఘర్షణ, భావోద్వేగాలతో రూపొందింది. తల్లి ప్రేమను కోల్పోయిన కూతురు, ఆడబిడ్డను పోగొట్టుకొన్న తల్లి కోణంలో ఈ సీరియల్ కొనసాగుతున్నది. రానున్న రోజుల్లో ఎలాంటి రేటింగ్ సాధిస్తుందో వేచి చూడాల్సిందే...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X