Radhaku Neevera Praanam Serial కార్తీక్‌ను ఫిక్స్ చేసిన రాధిక.. బైక్‌పై స్పీడ్ బ్రేకర్ల మీద..!

జరిగిన కథ: కార్తీక్ కృష్ణ (నిరుపమ్ పరిటాల) పోలీస్ ఇన్స్‌పెక్టర్. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించి పెళ్లి చేసుకొన్న పల్లవి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తుంది. భార్య పల్లవి మరణించిందనే విషాదంలో బతుకుతుంటాడు. తన భార్యకు కారణమైన హంతకులను వెతికే ప్రయత్నంలో ఉంటాడు. అయితే కార్తీక్ కృష్ణ తల్లిదండ్రులు మళ్లీ పెళ్లి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పల్లవిని మరిచిపోయి మరో అమ్మాయి మెడలో తాళి కట్టడం అంత సులభం కాదని.. వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరిస్తాడు.

అయితే తన కూతురును పొట్టన పెట్టుకొన్నారనే నిందను కార్తీక్ కుటుంబంపై పల్లవి తల్లి వేస్తూ వేధిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్తీక్ కృష్ణకు పెయింటర్ రాధిక తారసపడుతుంది. రాధిక హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ పేషెంట్. కార్తీక్‌ను చూడగానే ఆమె గుండె ఉన్నట్టుండి కొట్టుకొంటుంది. కార్తీక్‌ను తొలి చూపులోనే ప్రేమిస్తుంటుంది. కార్తీక్ కోసం రాధిక వెంటపడుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాధికను కార్తీక్ ఓ పని మీద పోలీస్ స్టేషన్‌కు పిలిపిస్తాడు. రాధకు నీవేరా ప్రాణం సీరియల్ 8 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Radhaku Neevera Praanam May 2nd 2023 Episode number 8: Radhika in love with Karthik Krishna

దొంగ బొమ్మ గీసిన రాధిక: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాధికను చూసి.. ఓ మహిళ మెడలో చైన్ కొట్టేశాడు. ఆ కొట్టేసిన చైన్ స్నాచర్‌ను పట్టుకోవడానికి అతడి ఫోటో గీయండి అంటాడు. దాంతో బాధితురాలు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం రాధిక నిందితుడి బొమ్మను గీస్తుంది. అది చూసి బాధితురాలు అవును..అచ్చు ఇతనే.

నా గొలుసు కొట్టేసిందని చెబుతాడు. దాంతో గుడ్.. మీరు మంచి టాలెంటెడ్. కానీ కాస్త తింగరితనం ఉంది అంటూ.. కానిస్టేబుల్ ఈమెకు కొంత డబ్బు ఇచ్చి పంపించేయండి అని కార్తీక్ అంటాడు. దాంతో మీరు సమాజ సేవలో ఉన్నారు కాబట్టి.. నేను కూడా సేవలో భాగంగానే ఉచితంగానే ఈ బొమ్మ వేశానని అనుకొంటానని చెబుతుంది.

Radhaku Neevera Praanam May 2nd 2023 Episode number 8: Radhika in love with Karthik Krishna

పోలీసు జీపులో వెళ్లనని అనడంతో: దాంతో రాధికను జీపులో ఇంటి వద్ద డ్రాప్ చేయమని కార్తీక్ అంటాడు. అయితే తాను పోలీస్ జీపులో వెళితే.. నన్ను మా కాలనీలో అనుమానిస్తారు. కాబట్టి మీరే నన్ను డ్రాప్ చేయండి అంటూ కార్తీక్‌ను అడుగుతుంది. తప్పకపోవడంతో రాధికను కార్తీక్ తన టూ వీలర్‌పై ఎక్కించుకొని ఆమె ఇంటి వద్ద దిగపెట్టేందుకు బయలుదేరుతాడు.

దారి పొడవున వాగుతూనే ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ల రోడ్డు మీద వెళ్లనివ్వండి. స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్తుంటే.. ఎగురుతుంటే మజాగా ఉంటుంది అని అంటుంది.అంతలోనే తన తల్లికి ఫోన్ చేసి కార్తీక్‌తో వస్తున్నానని ఏదో చెబుతుంది.

Radhaku Neevera Praanam May 2nd 2023 Episode number 8: Radhika in love with Karthik Krishna

కార్తీక్ కృష్ణ మీద పూలవాన: కార్తీక్ కృష్ణను రాధిక దారి పొడుగున ఏదోదో వాగుతూ విసిగించినంత పనిచేస్తుంది. రాధిక ఇంటి వద్దకు చేరుకోగానే అందంగా ముస్తాబు చేసి ఉంటుంది. పూలతోరణాలు కట్టి స్వాగతం పలుకుతారు. ఇంట్లోని వారు.. ఇరుగుపొరుగు వారు వచ్చి.. పూలతో కార్తీక్‌పై వాన జల్లు కురిపిస్తారు.

ఇదంతా ఏమిటి అంటే.. అల్లుడు గారు మొదటి సారి వచ్చారని అంటూ రాధిక తల్లి నోరు కరిసేసుకొంటుంది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ కదా.. మొదటిసారి వచ్చినందుకు స్వాగతం అని సర్ది చెప్పుకొంటుంది. కృష్ణ, రాధిక మా పేర్లు కలిశాయి అని రాధిక అంటే.. ఇక ఈ జంట కలవడం దేవుడి దయ అని తల్లి అంటుంది

Radhaku Neevera Praanam May 2nd 2023 Episode number 8: Radhika in love with Karthik Krishna

పల్లవి ఫోటోను తీయించిన కార్తీక్ తల్లి: ఇక ఎంత చెప్పినా కార్తీక్ కృష్ణ పెళ్లి చేసుకోవడం లేదనే కోపంతో ఉన్న తల్లి.. తీవ్రమైన నిర్ణయం తీసుకొంటుంది. కార్తీక్ గదిలోకి వెళ్లి.. పల్లవి ఫోటోను స్టోర్ రూమ్‌లో, అలాగే మద్యం బాటిళ్లను తీసి చెత్త బుట్టలో వేయమని చెబుతుంది.

పల్లవిని చూడకుండా దూరం చేస్తే తన కొడుకు మనసు మారి పెళ్లి చేసుకొంటారనే ఆశతో ఆ పని చేయిస్తున్నానని భర్తతో కార్తీక్ తల్లి చెబుతుంది. కార్తీక్‌కు కోపం వచ్చిన ఫర్వాలేదు. ఇలా చేస్తేనే నా కొడుకు పెళ్లి అవుతుందనే అభిప్రాయంతో ఉంటుంది.

నీ కుటుంబం సర్వనాశనం కావాలి అంటూ: అయితే గుడిలో దొరికిన అమ్మాయిని తన ముందుకు వచ్చేలా చేయమని కార్తీక్ కృష్ణ తల్లి భగవంతుడిని వేడుకొంటుంది. అయితే కార్తీక్ తల్లి భగవంతుడిని వేడుకొంటే.. మీ కోరిక ఎప్పుడు తీరదు అని పల్లవి తల్లి కాంచనవల్లి శపిస్తుంది.

నా బిడ్డను పొట్టన పెట్టుకొన్న మీకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే అని అంటుంది. బిడ్డను పొగొట్టుకొన్నందుకు బాధ ఉండటంలో న్యాయం ఉంది. కానీ మేము సర్వనాశనం కావాలనుకోవడం సరికాదు అని కార్తీక్ తల్లి అంటుంది. మీరు ఏం కోరుకొన్నా..మీరు సర్వనాశనం కావడం తథ్యం అంటూ పల్లవి తల్లి కాంచనవల్లి శపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X