ఆ షో కేవలం మహిళల కోసమే.. హోస్ట్‌గా వ్యవహరించేంది ఆమె
కౌన్ బనేగా కరోడ్‌పతి షో గురించి తెలియని వారెవరూ ఉండరు. బిగ్ బీ అమితాబ్‌ను మళ్లీ లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చిన ఈ షో.. దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. ఒక్కో ప్రశ్నకు జవాబు చెప్పుకుంటూ అలా ఒక్కో గండాన్ని దాటుకుంటూ చివరకు కోటి రూపాయలు ఎవరు గెలుచుకుంటారా? అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసేవారు.
అయితే హిందీలో క్లిక్ అయినంతగా తెలుగులో కాలేదు. మీలో ఎవరు కోటీశ్వరులు షోను నాగార్జున హోస్ట్‌గా బాగానే నడిపించాడు. అయితే రెండో సీజన్‌ను చిరంజీవి అంతగా నడిపించలేకపోయాడు. దీంతో మూడో సీజన్ జోలికి కూడా పోలేదు యాజమాన్యం. అయితే మిగతా భాషల్లోనూ అంతే.. హిందీలో ఫేమస్ అయినంతగా మరెక్కడా కాలేదు.

అయితే తాజాగా కేవలం మహిళల కోసం మాత్రమే మీలో ఎవరు కోటీశ్వరులు అనే షోను ప్రారంభించనున్నారు. మహిళల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ షో ఉపయోగపడుతుందని, అందుకే పూర్తిగా మహిళలకే కేటాయిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఈ షోకు రాధికా శరత్ కుమార్ హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. ఇక త్వరలోనే ఆడిషన్స్ నిర్వహించనున్నారని, డిసెంబర్‌లో షోను ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఇలాంటి షోకు ఒక మహిళా వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇదే మొదటి సారి అంటూ నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











