సీరియల్ నుంచి అనూహ్యంగా తప్పుకున్న రాధిక.. కారణం అదేనంటూ హాట్ టాపిక్!
వెండితెరపై రాధిక ఎన్ని అవార్డులు, రివార్డులు గెలుచుకుందో ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే వెండితెరపై తన సత్తాను చాటిన రాధిక బుల్లితెరపైనా రాణించింది. రాడాన్ అంటూ తనకంటూ సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని ఎన్నో ధారావాహికలను నిర్మించి నటించింది. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఏళ్లకేళ్లు కొనసాగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు రాధిక వీటన్నంటికి దూరంగా వెళ్లిపోతోన్నట్టు తెలుస్తోంది.

బుల్లితెరపై సంచలనం..
రాధిక బుల్లితెరపై ఓ సంచలనం. సీరియల్స్‌ను నిర్మించడమేఓ పెద్ద పని అనుకుంటే అందులో నటించడం, నటించిన ప్రతీ ఒక్క సీరియల్‌ను హిట్ అయ్యేలా చేయడం అంటే మామూలు విషయం కాదు. అలా రాధిక చిట్టి (పిన్ని), రాణి వాణి వంటి సీరియల్స్ ఎన్నింటినో ప్రేక్షకులకు అందించింది.

లాక్డౌన్‌లో అలా..
లాక్డౌన్ కాలంలోనే రాధిక చిట్టి (పిన్ని) సీరియల్‌కు సీక్వెల్ ప్రారంభించింది. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక షూటింగ్ చకచకా కానిచ్చింది. మధ్యలో ఆర్టిస్ట్‌లకు, యూనిట్ సభ్యుల్లో కరోనా వచ్చినా కూడా ఆర్టిస్ట్‌లను మారుస్తూ షూటింగ్‌ను కానిచ్చేసింది. అలా చిట్టి 2 సీరియల్ బాగా నడుస్తున్న సమయంలోనే టైమింగ్‌ను మార్చేశారు.

అప్పుడు అలా..
మొదటి 7 30 గంటలకు పిన్ని 2 సీరియల్‌ను ప్రారంభించారు. మెల్లిగా సీరియల్ పిక్ అప్ అయ్యే సమయానికి స్లాట్ మార్చేశారు. ఇప్పుడు రాత్రి పదిగంటలకు ప్రసారం చేస్తున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే.. రాధిక ఇప్పుడు చిట్టి 2(పిన్ని 2) సీరియల్ నుంచి తప్పుకుంది. ఈ మేరకు రాధిక ఓ ట్వీట్ వేసింది.

బై చెప్పాలంటే బాధగా ఉంది..
మెగా సీరియల్స్, చిట్టి 2 నుంచి తప్పుకుంటున్నానని చెబుతూ ఉంటే ఎలానో ఉంది.. అన్ని రకాల ఎమోషన్స్ కలిసి వస్తున్నాయి.. సన్ టీవీ వారితో నేను ఎన్నో యేళ్లుగా ట్రావెల్ అవుతూ వచ్చాను.. ఎంతో కష్టపడ్డాను.. కానీ నా టెక్నీషియన్స్, సహనటులకు బై చెప్పాలంటే బాధగా ఉంది. అయితే ఈ సీరియల్ మాత్రం ముందుకు తీసుకెళ్లండి.. నా ఫ్యాన్స్, శ్రేయోభిలాషులకు అందరికీ లవ్యూ.. మీరు కురిపించిన ప్రేమ, విధేయతకు థాంక్స్.. చిట్టి 2 సీరియల్‌ను చూస్తూనే ఉండండి.. అంటూ రాధిక ఎమోషనల్ అయింది.

అదే కారణం..
అయితే సన్ టీవికి రాధికకు మనస్పర్థలు వచ్చాయి.. టైమ్ స్లాట్ చేంజ్ చేయడంతో ఇలా తప్పుకుందని కొందరు అంటున్నారు. అయితే అదంతా కాదు.. ఆమె రాజకీయంగా బిజీ అవుతోంది.. రానున్న ఎన్నికల్లో ఎంఎల్యేగా పోటీ చేయబోతోంది.. అందుకే ఇప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయింది.. అందుకే సీరియల్ నుంచి తప్పుకుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











