Bigg Boss Telugu 7 టేస్టీ తేజకు బంపర్ ఆఫర్.. లారెన్స్ మాస్టర్ అలా ఫిదా!
Raghava Lawrence: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతుంది. 9 వారాలుగా అద్భుతమైన టీఆర్పీతో దూసుకు వస్తున్న ఈ షో రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. రాత్రి 9 అయిందంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు అంతా టీవీల ముందు వాలిపోతున్నారు. బిగ్ బాస్ షోను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అయితే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేసింది. ముఖ్యంగా నిన్న తప్పు చేసిన వారంతా నాగార్జునతో గట్టిగా క్లాసులు పీకించుకోగా... కరెక్టుగా ఆడిన వాళ్లు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే సండే ఫండే ప్రోగ్రామ్ తో నాగార్జున వచ్చేశారు. అలాగే తన వెంట ఇద్దరు గెస్టులను కూడా తీసుకు వచ్చారు.
తాజాగా విడుదల అయిన ప్రోమో చూస్తుంటేనే ఈ విషయం అర్థం అయిపోతుంది. నటుడు, డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ తాజాగా ఈ షోకు గెస్టుగా వచ్చారు. అలాగే డైరెక్టర్, యాక్టర్ ఎస్ జే సూర్యను కూడా మనం స్టేజీపై చూడవచ్చు. మాస్ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వస్తుండగా.. లారెన్స్, సూర్యలు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇంట్లోని కంటెస్టెంట్లను చూపించారు. వారంతా గెస్టులను చూసి ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. అలాగే మాస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఎంట్రీ ఇచ్చిన వెంటనే లారెన్స్ కూడా మాస్ స్టెప్పు వేసి అందరినీ అలరించారు.

ఇదే స్టూడియోలో నా జీవితం స్టార్ట్ అయింది ఆ తర్వాత సినిమాలు చేసి హీరోగా మారి ఇక్కడ ఇలా మీ ముందు నిలుచున్నానంటూ లారెన్స్ చెప్పుకొచ్చాడు. హీరో రేంజ్ మరి ఎలాంటి సినిమాలు చేస్తున్నావు, ఒకటి కాదు, రెండు కాదు అంటూ నాగ్ చెప్పాడు. ఈక్రమంలోనే గెస్టులతో కలిసి స్టేజీపై నిల్చున్న నాగార్జున కంటెస్టెంట్లకు ఓ అదిరిపోయే టాస్కు ఇచ్చారు. అదే డాన్స్ హుక్ స్టెప్. ఓ మ్యూజిక్ ప్లే చేసిన వెంటనే అందులోని స్టెప్పు వేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలోని ధాయి ధాయి దామా.. మ్యూజిక్ వేశారు. ఇది గెస్ చేసిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వెంటనే బెల్లు కొట్టాడు.
ఆ తర్వాత అదిరిపోయే వీణ స్టెప్పు వేశాడు. అది చూసిన రాఘవ లారెన్స్ ప్రశాంత్ బాగా చేశావని మెచ్చుకున్నాడు. కానీ పైనుంచి కిందకు కాకుండా కింద నుంచి పైకి వేయాలి స్టెప్పు అని చెప్పాడు. దీనికి అంతా నవ్వారు. వెంటనే ఎస్ జే సూర్య.. మాస్టర్ గారు ఒకసారి ఈ స్టెప్పు వేస్తే చూడాలని ఉందని నాకు అని చెప్పగా.. రాఘవ లారెన్స్ ఈ స్టెప్పు వేశారు. ఆ తర్వాత వచ్చిన మరో మ్యూజిక్ ను గెస్ చేసిన గౌతమ్ కృష్ణ ఇష్టం వచ్చినట్లుగా స్టెప్పు వేశాడు. తనకు అపోనెంట్ గా ఉన్న అమర్ దీప్ ను గెస్ చేయమనగా.. గెస్ చేసి కరెక్టు స్టెప్పు వేశాడు. దీనికి రాఘవ లారెన్స్ మెచ్చుకున్నాడు. చాలా బాగా చేశావంటూ పొగిడాడు.
తర్వాత ఓ మాస్టర్ మీకో సూపర్ డ్యాన్సర్ ను పరిచయం చేస్తానని చెప్పిన నాగార్జున... టేస్టీ తేజను పిలిచాడు. ఈ స్టెప్పు చాలా ఉపయోగపడుతుంది, ఇది మా తేజ సిగ్నేచర్ స్టెప్పు అనగానే.. అంతా నవ్వుతారు. మ్యూజిక్ ప్లే చేయగానే.. మస్తు ఊపుతో తేజ అద్భుతమైన స్టెప్పులు వేశాడు. ఇది చూసిన డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ కింద నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయని చెబుతూ కామెడీ చేశాడు. ఇక ఆ తర్వాత ఈ స్టెప్పులను నేను నా నెక్స్ట్ సినిమాలో వాడుకుంటానని అన్నాడు. దీంతో అంతా ఫుల్లుగా నవ్వేశారు. ఇలా ఈ ప్రోమో పూర్తి కాగా.. అసలేం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











