రాఘవేంద్రరావు గారు ఆ పని చేస్తారంటే ఆశ్చర్యం

By Srikanya

 Raghavendra Rao to host a talk show
హైదరాబాద్ : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సాధారణంగా ఎక్కడా స్టేజీపై మాట్లాడుతూ కూడా కనపడరు. అలాంటిది ఆయనో టాక్ షో చేస్తున్నారంటే అందరికీ ఆశ్చర్యమే. హిందీ లో పాపులర్ అయిన కాఫీ విత్ కరణ్ తరహాలో ఈ పోగ్రామ్ ఆయనే డైరక్ట్ చేస్తూ, నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ పోగ్రాం ప్రారంభం కానుందని సమాచారం. ఈ పోగ్రాంలో ఆయన తెలుగు సినిమా దర్శకులను, హీరోలను ఇంటర్వూ చేస్తారు. గమ్మత్తైన ప్రశ్నలతో, కాంట్రావర్శితో ఈ పోగ్రాం ఉంటుందని అంటున్నారు. రాఘవేంద్రరావు గారు హోస్ట్ కాబట్టి సెలబ్రెటీలందరూ ఈ పోగ్రామ్ పై ఆసక్తి చూపిస్తారని భావిస్తున్నారు. ఈ పోగ్రాం ఈటీవిలోనా లేక మాటీవి లో ప్రసారం కానుందా అనేది మాత్రం తెలియలేదు.

ప్రస్తుతం నాగార్జున కూడా గేమ్ షోతో మాటీవీలో అదరకొడుతున్నారనే సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ ప్రయోక్తగా వ్యవహరించగా అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (కేబీసీ) తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' (ఎంఈకే) పేరుతో మాటీవీలో వస్తోంది. ఈ తెలుగు వెర్షన్‌కు తెలుగు సినిమా అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున ప్రయోక్తగా వ్యవహరిస్తున్నారు. తెలుగు టెలివిజన్ చరిత్రలో కోటి రూపాయల ప్రైజ్ మనీతో ఓ గేమ్ షో ప్రసారం కానుండటం ఇదే ప్రథమం.

'డిన్నర్ పార్టీ' అనేది సరైన సమాధానమని కంప్యూటర్ చూపించింది. 38 మంది సెలబ్రిటీలను పరిశీలించి, చివరకు ప్రయోక్తగా 'ట్రూ హ్యూమన్‌బీయింగ్' అయిన నాగార్జునను ఎంచుకున్నామని మా టీవీ ఛైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ చెప్పారు. టెలివిజన్ రంగంలో ఇది గేమ్ చేంజర్ అవుతుందని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ కూడా టెలివిజన్ రంగం తరహాలో ఆర్గనైజ్డ్‌గా మారితే విజయవంతంగా నడుస్తుందని చానల్ డైరెక్టర్ అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు. 'కేబీసీ' సృష్టికర్త, బిగ్ సినర్జీ సీఎండీ అయిన సిద్ధార్థ బాసు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ షో ఏడాదిన్నర కాలంలో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 480 ఎపిసోడ్లను పూర్తి చేసుకుందనీ, ఈ షో ఆధారంగా 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమా స్క్రిప్టు తయారయ్యిందనీ చెప్పారు.

ఇంతకాలం సినిమాల ద్వారా వినోదం పంచుతూ వచ్చిన తాను మొదటిసారి టెలివిజన్ తెరపైకి వస్తున్నానని నాగార్జున అన్నారు. ఒక సామాజిక బాధ్యతతో ఈ గేమ్ షోకు ప్రయోక్తగా వ్యవహరిస్తున్నాననీ, అమితాబ్ ముద్రను అందుకోవడం చాలా కష్టమని తెలుసనీ, తన శక్తివంచన లేకుండా బాగా చేయడానికి కృషి చేస్తాననీ చెప్పారు. చాలా మంది సామాన్య పౌరుల కలల్ని నిజం చేయడం ద్వారా వారి జీవితాల్ని ఈ షో మార్చబోతోందని ఆయన అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X