Brahmamudi November 24th: స్వప్నఅక్రమసంబంధాన్ని బయటపెట్టిన రాహుల్... దానికి రాజ్ సాక్ష్యం!
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో (నవంబర్ 24వ తేదీ) స్వప్న బయటకు వెళ్లి ఇంటికి వస్తుంది. ఇక అందరూ హల్లో ఉండటం చూసి.. రాహుల్ తన డ్రామాను మొదలు పెడుతాడు. ఆగు అంటూ స్వప్నపై అరుస్తాడు. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎక్కడకు వెళ్లావు అని స్వప్నను రాహుల్ అడుగుతాడు. ఇక రుద్రాణి ఎంటర్ అయి... అదేంట్రా అలా అడుగుతావు, తను పార్లర్ కి వెళ్తున్నాను అని నాకు చెప్పే వెళ్ళిందని చెప్తుంది.
ఇంతసేపూ పార్లల్లోనే గడిపి వస్తుందా, ఇది ఎవడితోనో తిరుగుతోందని రాహుల్.. స్వప్నపై నిందలు వేస్తాడు. ఆ మాటకి ఇంట్లోని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇందిరాదేవి రాహుల్ పై కొప్పడుతుంది. బయటికి వెళ్ళిన భార్య ఇంటికి లేటుగా వచ్చినంత మాత్రాన అంత అసహ్యంగా మాట్లాడుతావా అంటూ అపర్ణ కూడా మాట్లాడుతుంది. కొంచెం మర్యాదగా మాట్లాడు రాహుల్ అని కావ్య అంటుంది.

మళ్లీ రుద్రాణి ఎంటర్ అయి... ఆగండి అందరూ వాడి ఆవేశాన్ని చూస్తున్నారు కానీ స్వప్న మౌనాన్ని ఎందుకు చూడటం లేదు అని ప్రశ్నిస్తుంది. ప్రతి చిన్న విషయానికే యు షట్ అప్ అంటూ రెచ్చిపోయే స్వప్న ఇప్పుడు ఎందుకు అంత మౌనంగా ఉందని అడుగుతుంది. ఏంట్రా ఆ మాటలు అయినా ఆ అమ్మాయిని అనుమానించడానికి నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయా అని సుభాష్ అడుగుతాడు. ఉన్నాయి మావయ్య అంటూ రాజేష్ తో స్వప్న ఉన్న ఫోటోలు అందరికీ చూపిస్తాడు రాహుల్.
అందరూ స్వప్న, అరుణ్ కలిసి ఉన్న ఫోటోలు చూసి షాక్ అవుతారు. అవి నా కాలేజీ డేస్ ఫొటోస్ అతను నా ఫ్రెండ్. అంతమాత్రాన అనుమానించేస్తావా? అంటూ స్వప్న అడుగుతుంది. ఇతను నీకు ముందే తెలుసా మరి ఎందుకు ఆ రోజు నేను అడిగినప్పుడు తెలియదని చెప్పావు అని ఇందిరాదేవి అడుగుతుంది. అంతే కాదు అమ్మమ్మ ఆ ఫ్రెండ్ షిప్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తుందని రాహుల్ అంటాడు. మొన్న అతను ఇంటికి వస్తే ఇంట్లోకి రానివ్వకుండా బయటే మాట్లాడి పంపించేసిందని చెప్తాడు.
అవును అతను ఇంటికి రావడం స్వప్న ఇంటి బయట అతనితో మాట్లాడటం నేను కూడా చూశానని రాజ్ అంటాడు. ఇలాంటి అనుమానాలన్నీ వస్తాయనే నాకు ఏమీ తెలియదని చెప్పి తప్పించుకున్నాను అమ్మమ్మ గారు అంటూ స్వప్న చెప్తుంది. మరి అతనికి డబ్బు ఎందుకు ఇచ్చావని రాహుల్ స్వప్నను ప్రశ్నిస్తాడు. మరోవైపు ఏమి తెలియనట్లుగా ఇంట్లో ఈ దరిద్రం కూడా జరుగుతుందా అని రుద్రాణి అంటుంది.

స్వప్న కోపంతో మాట్లాడుతూ తప్పించుకోవాలని చూస్తుంది కానీ రాహుల్ డబ్బు ఇచ్చిన ఫోటోలు అందరికీ చూపిస్తాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నా కొడుక్కి, నాకు అన్యాయం చేసింది స్వప్న అంటూ రుద్రాణి డ్రామా ప్లే చేస్తుంది. ఆరోజు నా కొడుకు మోసం చేశాడని ఇంట్లో వాళ్ళందరూ వాడిని తిట్టి ఒప్పించి పెళ్లి చేశారు... ఇప్పుడు తను ఇంటి పరువు తీసి ఏం బజారున పడేస్తుంది.. ఎవరు ఏమి మాట్లాడరేమీ అని అంటుంది. ఇలాంటి ఆడది ఇంట్లో ఉండకూడదు. అయినా నీకు అంత డబ్బు ఎక్కడిది అంటూ ప్రశ్నిస్తుంది రుద్రాణి.
నేను చెప్తాను మమ్మీ అంటూ నగలు తాకట్టు పెట్టిన బిల్ ను ఇందిరాదేవికి చూపిస్తాడు రాహుల్. ఏంటమ్మా నిన్ను వెనకేసుకురావడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఇన్ని సాక్షాలు చూపిస్తున్నాడు రాహుల్ అని ఇందిరాదేవి అంటుంది. అతను నా క్లాస్మేట్ నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు... కానీ అందుకు నేను ఒప్పుకోలేదు. కానీ వదలకుండా ఈ ఫొటోస్ ఇంట్లో చూపిస్తాను అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అందుకే ఇచ్చాను అని స్వప్న అంటుంది.
అలాంటప్పుడు ఇంట్లో ఉన్న మా అందరికీ చెప్పాలి కదా అని అపర్ణ అంటుంది. ఎందుకు చెప్తుంది ఇది వాడితో తిరుగుతుంది డబ్బే కాదు సర్వస్వం వాడికి దోచిపెట్టడానికి సిద్ధంగా ఉంది అంటూ రాహుల్ మరో నింద వేస్తాడు స్వప్న మీద. ఈరోజు ఇంట్లో ఎవరు చెప్పినా వినేది లేదు ఇది ఇకమీదట ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటూ స్వప్న చెప్పేది వినిపించుకోకుండా స్వప్నని బయటికి గెంటేయాలని చూస్తుంది రుద్రాణి. ఇంతలో స్వప్న కిందపడిపోతుంది. ఎపిసోడ్ ముగుస్తుంది.
తదుపరి బ్రహ్మముడి ఎపిసోడ్ లో స్వప్న ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. అయితే ఆ బిడ్డకు నాకు సంబంధం లేదని రాహుల్ చెప్తాడు. ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications











