Brahmamudi November 15th: స్వప్నను ఇరికించేందుకు రాహుల్ స్కెచ్.. బాయ్ ఫ్రెండ్ గురించి నిలదీసిన ఇందిరాదేవి

(నవంబర్ 15వ తేదీ) ఈరోజు బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు బ్రహ్మముడి సీరియల్ కల్యాణ్.. ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటున్నారనే విషయాన్ని అనామిక, అప్పులకు చెప్తాడు. ఇక ఆ విషయం విని అనామిక తెగ సంబరపడిపోతుంది. కల్యాణ్ ను హగ్ చేసుకుంటుంది. అది చూసి అప్పు బాధ పడుతుంది. మరోవైపు అనామిక వాళ్ల డాడీకి ఈ విషయం చెప్పాలి అని ఫోన్ చేయడానికి వెళ్తుంది. ఇంతలో అక్కడి నుంచి కల్యాణ్ కు చెప్పకుండా వెళ్లిపోతుంది. కల్యాణ్ ఎంత పిలిచినా కూడా పట్టించుకోకుండా బాధతో అలాగే వెళ్లిపోతుంది. ఏమైంది బ్రోకి... ఇంత మంచి న్యూస్ చెప్తే అలా వెళ్లిపోయిందని కళ్యాణ్ అనుకుంటాడు. ఇక అనామిక వచ్చి.. అప్పు ఎక్కడ అని అడుగుతుంది.. వెళ్లిపోయిందని చెప్తాడు కల్యాణ్.

మరోవైపు రాహుల్... స్వప్న బాయ్ ఫ్రెండును పిలిచి మాట్లాడుతాడు. నీకు స్వప్న మీద ఎంత ప్రేమ ఉంటే... నాతో లేచిపోయినా సరే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావ్ అని అతన్ని నిలదీస్తాడు రాహుల్. నిన్ను ఏదో చేయడానికి పిలవలేదు... నీకు హెల్ప్ చేద్దామని పిలిపించా.. అంతే అని చెప్తాడు. నీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన పర్మిషన్స్ నేను ఇప్పిస్తాను అని రాహుల్ అతనికి చెప్తాడు. దానికి నేనుం ఏం చేయాలి అని చెప్తాడు ఆ డాక్టర్. నా భార్యతో రిలేషన్ పెట్టుకున్నట్లు నటించు అని చెప్తాడు రాహుల్. ఇక మొత్తానికి డ్రామాకు ఆ డాక్టర్ ఒప్పుకుంటాడు. ఎప్పుడు ఏం చేయాలో ఫోన్ లో చెప్తాను దాన్ని బట్టి ఫాలో అవ్వు అని చెప్తాడు రాహుల్.

Rahul Evil Plan in November 15th 2023 Episode number 254 in Brahmamudi Telugu Serial

మరోవైపు ఇంట్లో ఓ బోర్డ్ మీద సారీ కళావతి అని రాసి ఉంటుంది. అది చూసిన ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. ఇక కావ్యనే రాసి.. డ్రామా ప్లే చేస్తూ ఉంటుంది. రాజ్ రాశారని ఇంట్లో వాళ్లంతా అనుకుంటారు. నలుగురిలో ఇలా సారీ చెప్పాలంటే.. చాలా పెద్ద మనసు ఉండాలి అని ఇంట్లో వాళ్లంతా అనుకుంటారు. ఇక కావ్య ఎంటర్ అయి... డ్రామా ప్లే చేస్తుంది. సారి కళావతి అని చూసి.. ఎవరు పెట్టారు ఈ బోర్డ్ అని అడుగుతుంది. ఇంకెవరు పెడుతారు.. రాజ్ అని ధాన్య లక్ష్మి అంటుంది.

ఇంతలో రాజ్ వచ్చి.. ఏమైందని అడుగుతాడు. నువ్వు చేసిన గొప్ప పని చూసి.. అందరం ఇలా గిల గిల కొట్టుకుంటున్నామని సెటైర్స్ వేస్తారు. సారి కళావతి అని బోర్డ్ మీద చూసి షాక్ అవుతాడు రాజ్. ఇక కావ్య కూడా డ్రామా మొదలు పెడుతుంది. మీరు ఇలా అందరి ముందు ఎందుకు సారి చెప్తారు అంటూ కావ్య అడుగుతుంది. ఎందుకు సారి రాశావ్ అని అపర్ణ అడుగుతుంది. దానికి రాజ్ ఏదో ప్లాన్ చేసి ఉంటావ్ నువ్వే చెప్పు అని కావ్యకు హింట్ ఇస్తాడు.

ఇక వారం రోజుల నుంచి నాతో సరిగా మాట్లాడటం లేదు కదా.. అందుకే ఇలా రాశాడు అని కావ్య చెప్తుంది. ఇక రాజ్ సారి చెప్పబోతుంటే.. కావ్య ఆపుతుంది. భర్త సారి చెప్పడం ఏంటి అంటూ రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. ఇక టిఫిన్స్ రెడి చేస్తాను అని కావ్య వెళ్లిపోతుంది.. రాజ్ కూడా ఫ్రెష్ అయి వస్తా అని వెళ్లిపోతాడు. మరోవైపు అప్పు బాధపడుతూ ఉంటుంది. అనామిక, కళ్యాణ్ పెళ్లి గురించి ఆలోచిస్తూ.. బాధ పడుతూ ఉంటుంది.

Rahul Evil Plan in November 15th 2023 Episode number 254 in Brahmamudi Telugu Serial

ఇంతలో అప్పు కోసం.. కల్యాణ్ వస్తాడు. కనకం కూర్చోమని చెప్తుంది. కల్యాణ్ బాబు వచ్చాడు రా అని చెప్తుంది అన్నపూర్ణమ్మ. కనకం.. కల్యాణ్ తో మాట్లాడుతుంది. అనామికతో పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తే.. కనకం సంతోషపడిపోతుంది. ఇక అప్పు సీరియస్ గా మాట్లాడుతుంది. నాకు ఎవ్వరు లేరు అని చెప్పి లోపలికి వెళ్తుంది అప్పు. ఈ మధ్య అప్పుకి నాపై కోపం చూపిస్తుంది.. ఎందుకో తెలియదు..ఇదివరకు అప్పులా లేదు అని కల్యాణ్ అంటాడు.

నా పెళ్లికి అప్పు దగ్గరుండి అన్ని చూసుకోవాలి అని చెప్తాడు కళ్యాణ్. ఓకే అని చెప్తారు కనకం. ఇక అప్పు లోపల కల్యాణ్ ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. దానిపై ఐ లవ్ యూ కళ్యాణ్ అని రాసి ఉంటుంది. మరోవైపు రాజ్ గదిలో కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అంతలో కావ్య వస్తుంది.. ఆగు ఏంటి నువ్వు చేసిన పని అని రాజ్ అడుగుతాడు. ఇక కావ్య వంటింటి పనుల గురించి చెప్తుంది. ఇలా టాం అండ్ జెర్రీలా కాసేపు మాట్లాడుకుంటారు. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో ఓ కోరియర్ వస్తుంది.. అందులోని ఫోటో చూసి ఇందిరాదేవి షాక్ అవుతుంది. స్వప్నను పిలిపించి అడుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X