బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ మూడో వివాహం, విదేశీ మోడల్‌తో...
హిందీ వెర్షన్ బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా పాపులర్ అయిన రాహుల్ మహాజన్ చాలా కాలం తర్వాత మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్న ఈ వివాదాస్పద సెలబ్రిటీ తాజాగా ఓ విదేశీ మోడల్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు.
43 సంవత్సరాల రాహుల్ మహాజన్... 27 సంవత్సరాల కజకిస్తాన్ మోడల్ నటాలియా ఇలినాను పెళ్లాడారు. బెంగుళూరులోని మలబార్ హిల్స్‌లోని ఓ దేవాలయంలో రిలేటివ్స్, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

మూడో పెళ్లి గురించి రాహుల్
తన మూడో పెళ్లి గురించి రాహుల్ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ... ‘నా వివాహాన్ని సింపుల్‌గా కొంత మంది సన్నిహితుల సమక్షంలోనే చేసుకోవాలనుకున్నాను. నా మూడో పెళ్లి గురించి ఒక సంవత్సరం వరకు మాట్లాడకూడదని, ఎవరూ గాసిప్స్ మొదలు పెట్టకూడదను అనుకున్నాను. అందరినీ నా ఫస్ట్ వెడ్డింగ్ యానివెర్సరీకి పిలవాలి అనుకున్నాను. కానీ అలా జరుగలేదు.' అని రాహుల్ తెలిపారు.

గతంలో ఇద్దరితో రాహుల్ మహాజన్ వివాహం
గతంలో రాహుల్ మహాజన్ పైలట్ శ్వేతా సింగ్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత నేషనల్ టెలివిజన్ రియాల్టీ షో కంటెస్టెంట్ డింపీ గంగూలీని వివాహం చేసుకున్నారు. వారితో విడిపోయిన రాహుల్ ఇపుడు కజకిస్థాన్ మోడల్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు.

వారిద్దరూ మంచివారే...
తన గత వివాహాలు గురించి మాట్లాడుతూ... నా గత రెండు వివాహాలు ఆదరాబాదరాగా జరిగాయి. ఆ సమయంలో ఆలోచించే సమయం కూడా లేదు. శ్వేతా, డింపీ చాలా మంచి వ్యక్తులు. మేము కలిసి జీవించడానికి అనుకూలంగా లేదు కాబట్టే విడిపోయాం. నటాలియా, నా ఆలోచనలు చాలా దగ్గరగా ఉంటాయి. మా మధ్య ఇప్పటి వరకు ఎలాంటి విబేధాలు కూడా తలెత్తలేదు అని రాహుల్ మహాజన్ చెప్పుకొచ్చారు.

రాహుల్ మహాజన్ వివాదాలు
మాజీ కేంద్రమంత్రి ప్రమోద్ మహాజన్ కుమారుడే రాహుల్ మహాజన్. బిగ్ బాస్ 2లో పాల్గొనడం ద్వారా పాపులర్ అయిన రాహుల్.... ఆ తర్వాత డ్రగ్స్ కేసు లాంటి వివాదాల్లోనూ ఇరుక్కున్నాడు. డింపీతో విడిపోయిన తర్వాత ఒంటరిగా ఉంటున్న రాహుల్‌కు కామన్ ఫ్రెండ్స్ ద్వారా నటాలియా సంవత్సరం క్రితం పరిచయమైంది. గత మూడు నెలల నుంచి ఇద్దరూ డేటింగులో ఉన్నారు.


Click it and Unblock the Notifications











