Brahmamudi November 22nd: అరుణ్‌తో అక్రమ సంబంధం... అందరిముందు అడ్డంగా స్వప్నను బుక్ చేసిన రాహుల్

ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో (నవంబర్ 22వ తేదీన) అప్పు సూసైడ్ చేసుకున్నట్లు కనకం కల కంటుంది. ఒక్కసారిగా అప్పు అంటూ లేస్తుంది. మూర్తి షాక్ అవుతాడు. ఇక పీడకల అని చెప్పి.. వాటర్ తాగొస్తా అని చెప్తుంది. అప్పు గదికి వెళ్లి చూస్తే.. అప్పు కనబడదు. బయటకు వెళ్లి చూస్తే... బావి మీద కూర్చొని ఉంటుంది. కనకం చూసి షాక్ అవుతుంది. ఇంత రాత్రి పూట ఇక్కడ ఎందుకు ఉన్నావ్.. అని కనకం అడుగుతుంది. నిద్ర పట్టడం లేదని చెప్తుంది అప్పు. దీంతో లోపలికి తీసుకువెళ్లి పడుకోబెడుతుంది. నేను నీ పక్కనే పడుకుంటాను అని కనకం అంటుంది. నేను కోపంలో అన్న మాటలు పట్టించుకోకని అప్పుకు చెప్తుంది.

రాజ్, కావ్య గదిలోకి దొంగ వస్తాడు... వాళ్లిద్దరిని తాళ్లతో కట్టేస్తాడు. మెలుకువ వచ్చే సరికి కట్లతో ఉంటారు. రాజ్, కావ్య తమను తాడుతో ఎవరు కట్టారని అనుకుంటారు. ఇంతలో నేను అంటూ దొంగ చెప్తాడు. ఎవడ్రా నువ్వు, ఎలా వచ్చావ్ అని రాజ్ అడుగుతాడు. డోర్ తీసే ఉంది దేవుడు సార్ అని దొంగ అంటాడు. దేవుడు సార్ ఏంటని కావ్య అడిగుతుంది. మాలాంటి దొంగల కోసం డోర్లు తెరిచి పెట్టే ప్రతి ఒక్కరు మాకు దేవుడే అని దొంగ చెప్పుకువస్తాడు.

Rahul reveals Swapna Arun Relationship in November 22nd 2023 Episode number 260 in Brahmamudi Telugu Serial

నువ్వు దొంగవా అని కావ్య రాజ్ షాక్ అవుతారు. ఎప్పుడూ గట్టిగా అరుస్తావ్ కదా, ఇప్పుడు అరువు అని రాజ్ కావ్యను అంటాడు. నేను ఎప్పుడు దొంగను ఇలా చూడలేదు అని కావ్య అంటుంది. దొంగను చూసి కావ్య అరుస్తుంది. దొంగ కత్తి తీసి బెదిరిస్తాడు. అలా చేయొద్దు దొంగ అన్నయ్య అని కావ్య సెంటిమెంట్ తో కొడుతుంది. కావ్య అలా అనడంతో దొంగ కూడా ఎమోషనల్ అవుతాడు. మళ్లీ పిలవమ్మ అంటూ అలాగే పిలిపించుకుంటాడు.

కావ్య, దొంగ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే.. రాజ్ షాక్ అవుతాడు. ఇక దొంగ కుశలం గురించి కావ్య తెలుసుకుంటుంది. వదినా ఏం చేస్తుంది.. అని అడుగుతుంది. వదినా కూడా దొంగే అంటూ కాసేపు మాట్లాడుకుంటారు. ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చావ్ అని కావ్య అడిగితే... పెళ్లాం పోరు పడలేకు వచ్చాను అని చెప్తాడు. డబ్బు ఎక్కడుందని రాజ్‌ ని దొంగ అడిగుతాడు దొంగ. అన్ని బ్యాంకులో ఉన్నాయంటాడు రాజ్. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న కాలంలో ఇంట్లో ఎవడ్రా డబ్బు దాచుకునేదని రాజ్ అంటాడు.

మరి నగలు ఎక్కడున్నాయని దొంగ అడిగితే.. మా అక్క సీమంతం తర్వాత నగలన్నీ లాకర్‌లో పెట్టేశారు అని కావ్య చెప్తుంది. ఇలా అయితే మా దొంగల పరిస్థితి ఏం కావాలని అంటాడు దొంగ. తర్వాత రాజ్ పర్స్ గురించి కావ్య చెబుతుంది. రాజ్ పర్స్ లో నుంచి ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుంటాడు దొంగ. పిన్ నెంబర్ చెప్పమంటే రాజ్ చెప్పనని అంటే.. దాంతో వైఫై ద్వారా రూ. 5 వేలు వస్తాయని కావ్య చెప్తుంది. దాంతో క్రెడిట్ కార్డ్ మేషిన్‌ తో స్వైప్ చేసుకుంటాడు దొంగ.

ఎందుకు ఇలా చేశావ్ అని కావ్యను రాజ్ అడుగుతాడు. ఇంట్లో ఉన్న డబ్బు, నగల గురించి చెప్పానా.... ఐదు వేలతో సరిపెట్టాను అని కావ్య కవర్ చేస్తుంది. రాజ్ కావ్య ఇద్దరూ రాత్రంతా అలా కలిసే పడుకుంటారు. మరోవైపు అరుణ్ లొకేషన్ పంపాడు. పది లక్షలు ఎలా అరెంజ్ చేయాలని ఆలోచిస్తుంది స్వప్న. తాతయ్య ఇచ్చిన నగలు ఉన్నాయి కదా. వాటిని తాకట్టు పెట్టి ఇచ్చేద్దామని ఫిక్స్ అవుతుంది. ఇంట్లో వాళ్లు అడిగితే... ఇది వరకు రాహుల్ దొంగతనం చేశాడు కదా. రాహుల్ తీశాడని అబద్ధం చెప్పేద్దాం అని స్వప్న అనుకుంటుంది.
స్వప్న మాటలన్ని చాటుగా రాహుల్ విని షాక్ అవుతాడు. ఇక్కడికి ఎపిసోడ్ ముగుస్తుంది.

తదుపరి ఎపిసోడ్ లో... స్వప్న బయటకు వెళ్లి వస్తుంటే... ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్. నన్ను మోసం చేసి ఇంకొకడితో తిరుగుతుందని రాహుల్ ఇంట్లో వాళ్లకి చెప్తాడు. ఇంట్లో అందరికీ అరుణ్‌ తో ఉన్న ఫొటోలు చూపిస్తాడు. వాడు నా కాలేజీ ఫ్రెండ్. క్లోజ్ ఫ్రెండ్ అంతే అని స్వప్న అంటుంది. మరి ఇంతకుముందు ఆ ఫొటో చూపించి తెలుసా అని అడిగితే.. ఎందుకు చెప్పలేదని ఇందిరాదేవి నిలదీస్తుంది. స్వప్న, కావ్యలు షాక్ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X